రమేష్ నాయుడు , Ramesh Naidu
--------------------------------------------------- Introduction : పసుపులేటి రమేష్ నాయుడు 1970వ మరియు 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు . ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీత పరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి. ఈయనను తెలుగులో సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం సినిమాతో తెలుగు చిత్రరంగానికి పరిచయం చేసింది. Profile : పేరు : రమేష్ నాయుడు పుట్టిన తేదీ : 1933లో పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించాడు. మరణము : 1987, సెప్టెంబర్ 3న మరణించాడు. కెరీర్ : యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణములో పనిచేశాడు. అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది. అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం కూడా కలిగింది. ఈయన 16యేళ్ళ వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా బంద్వల్ పహీజా అనే మరాఠీ సినిమా. ఈయనను తెలుగులో సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం సినిమాతో తెలుగు చిత్రరంగానికి పరిచయం చేసింది. ఆ సినిమా తర...