కె.వి.మహదేవన్ , K.V.Mahadevan
పరిచయం : కృష్ణన్కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్ (కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్రసంగీత దర్శకుడు. వందలకొద్దీ తెలుగు, తమిళ చలన చిత్రాలకు ఈయన సంగీత దర్శకత్వం వహించారు. జానకిరాముడు, శంకరాభరణం, శ్రీనివాస కళ్యాణం , మొదలైనవి ఆయన దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు ఆణిముత్యాలు.కె. వి.మహదేవన్‌కి తెలుగు రాదు. ఏదో అంతంత మాత్రం మాట్లాడతారుగాని, చదవడం అసలు రాదు. కాని, రచయిత పాట రాసి ఇవ్వగానే తన భాషలో రాసుకుని, సందర్భం, అర్థం తెలుసుకుని వరస ఆలోచిస్తారు. వెంటనే ఆయనకు 'తెలుగు సరస్వతి' అనుగ్రహిస్తుంది. అక్షరాలు ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తేల్చాలో పదాల్ని ఎలా ఉచ్ఛరించాలో అన్నీ వచ్చేస్తాయి ఆయనకి ప్రొఫైల్ : పేరు : మహదేవన్ . కె.వి , ఊరు :నాగర్కోయిల్ - తమిళనాడు , పుట్టిన తేది : 06-డిసెంబర్ -1917 .(మార్చి 14 అని కొంతమంది అంటారు). మరణము : 21 జూన్ 2001 > మహదేవన్ అంతిమదినాలలో శ్వాసపీల్చుకోవటం కష్టమై వారం రోజులపాటు అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 21 న - 83 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించాడు. తల్లి : లక్ష్మీ అమ్మాళ్ , తండ్రి : వెంకటాచలం అయ్యర్ ...