Samshuddhin Ibrahim,శ్యాం , శంషుద్దీన్ ఇబ్రహిం
పరిచయం (Introduction) : కిక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై తొలిసినిమా 'కిక్'నే తన పేరు ముందు చేర్చుకున్న నటుడు శ్యాం. ఓ పక్క తమిళ్‌లో హీరోగా బిజీగా ఉంటూనే, తెలుగులో ప్రధాన పాత్రల్లో అదరగొడుతున్నాడు. 'రేసుగుర్రం'లో 'రామ్'గా దూసుకొచ్చి, ఇక్కడి అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. అప్పుడు... నాలుగేళ్లు కాళ్లరిగేలా తిరిగినా అవకాశాలు లేవు. ఇప్పుడు... అన్ని భాషల్లోనూ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. జీవిత విశేషాలు (profile) : సినిమాల్లో పేరు ; శ్యాం , అసలు పేరు : శంషుద్ధీన్‌ఇబ్రహీం, సొంత ఊరు : మధురై (తమిళ నాడు), చదువు : బి.కాం , భార్య్ : కాషిష్ (పంజాబీ కాలేజీ లోఉన్నప్పుడు ప్రేమించి పెళ్ళిచేసుకునారు), పిల్లలు : కూతురు - సమైరా , తండ్రి : గాజులు వ్యాపారము , ఎత్తు : 6 అడుగులు , కెరీర్ : డిగ్రీ చదువుతూనే మోడల్‌గా పనిచేశాడు. చదువైపోయాక ముంబైలోని రోహన్ తనేజా యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. సినిమాలకు తనను తాను మానసికంగా...