ఇంద్రజ , Indraja
పరిచయం : ఇంద్రజ గా తెలుగు సినీ రంగములో పేరుతెచ్చుకొన్న నటి , తెలుగు , మళయాల సినిమా నటి . ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి , మద్రాసులో పెరిగినది . ఈమె దాదాపు 80 కి పైగా సినిమాలలో నటించింది . ప్రొఫైల్ : పేరు : ఇంద్రజ , అసలు పేరు : రజత , పుట్టిన ప్రదేశం : కేరళ రాష్ట్రము , తోబుట్టువు : ఇద్దరు చెల్లెళ్ళు , భారతి , శోభ , కుటుంబం : కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా . ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది . భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు . కెరీర్ : పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది . శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించినది . ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చినది . ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించినది . యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30 కి ...