కృష్ణుడు (వినాయకుడు ఫేం ),Krishnudu (Vinayakudu Fame)
photo from Wikipedia.org/ పరిచయం : చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. చూసేందుకు చాలా లావుగా ఉంటాడు , కాని ముఖము చుస్తే పాలుగారుతూ ముద్దుగా ఉంటుంది . నటనలో మంచి అందెవేసిన చేయి . వినాయకుడు చిత్రం లో మంచి పేరు తెచ్చుకొన్న హీరో ... ఈ కృష్ణుడు , ప్రొఫైల్ : పేరు : కృష్ణుడు , ఊరు : చింతలపల్లి , రాజోలు తాలూక -- తూర్పు గోదావరి జిల్లా . తోబుట్టువులు : ఒక సోదరుడు , ఒక సోదరి , చదువు : బెంగుళూరు లో పాలిటెక్నిక్ పూర్తిచేసాడు . మొదటి సినిమా : మనోడు , అభిమాన నటుడు : పరేష్ రావాల , పెళ్ళి : కాలేదు . తమ్ముడు కి పెళ్ళి అయినది . హాబీలు : ఫొటో్గ్రఫీ , ఫేవరైట్ నటుడు : కమల్ హాసన్ , కెరీర్ : 10 ఏళ్ల అనగా 2000 నాటికే హీరో కావాలని తపత్రియం ఉంది , దేవదాస్ కనకాల ఇన్స్టిట్యుట్ లో శిక్షణ తీసుకున్నారు . ఆ సమయం లో యాక్షిడెంట్ మూలముగా తన ఊరు వెళ్ళవలసి వచ్చింది ... మరల తిరిగి వచ్చి మనుగడ సాగించడం కోసం డెరెక్టర్ ' రసూల్ ' దగ్గర " భగీరధ " చిత్రానికి , సహాయం గా డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసారు. వినాయకుడు" సిన...