రాధ (నటి),Radha
పరిచయం : ఏ.రాధా నాయర్ తెలుగు మరియు తమిళ చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధ నటి. దక్షినాది భాషలలో 250 కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే. సినిమా ప్రవేశం : రాధ, భారతీరాజా సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిన భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె రజినీకాంత్తో రాజాధిరాజా చిత్రములో, కమలహాసన్తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. శివాజీ గణేషన్ సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంశలు అందుకొన్నది. ప్రొఫైల్ : పేరు : రాదా నాయర్ , అసలు పేరు : విజయ చంద్రిక, పుట్టిన తేది : *03-*అక్టోబర్ -1965 , పుట్టిన ఊరు : కేరళ స్టేట్ , భర్త : తన బంధువైన మణి రాజశేఖర్ నాయర్ అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లి తర్వాత రాధసినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. పిల్లలు : ముగ్గురు పిల్ల లు -ఇద్దరు కూతుర్లు - కీర్తిక ,తులసి , ఒక కొడుకు -విగ్నేష్ . రాధ తన పెద్ద కూతురు కీర్తిగ తో పాట...