అల్లరినరేష్ , Allari Naresh
---------------------------- పరిచయం : అల్లరి నరేష్ - సిని దర్శకుడు /నిర్మాత యి.వి.వి.సత్యనారాయణ కొడుకు . తన పేరు కి ముందు అల్లరి అనే పదము , అతని మొదటి సినిమా "అల్లరి" బాగా విజయవంతమైనందున ,, నరేష్ కాస్త అల్లరి నరేష్ గా మారిపోయాడు ప్రొఫైల్ : పేరు : నరేష్ పుట్టిన ఊరు : - హైదరాబాద్ లో పుట్టిన తేది : జనవరి - 20-1982 ఎత్తు : 5" 10" , నాన్న : ఇ.వి.వి.సత్యనారాయణ -- సోదరుడు : ఆర్యన్ రాజేష్ --ఒక నటుడు. చదువు : బి.కాం , బాల్యము : (అతని మాటల్లో)-- నేను ప్లస్‌టూ వరకూ మద్రాస్‌లో చదివాను. తరవాత మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. అప్పుడు నిజాం కాలేజీలో బీకామ్‌లో చేరాను. నేను అక్కడ చదివానన్న విషయం చాలామందికి తెలియదు. క్లాసులకు సరిగ్గా వెళ్తే కదా! అప్పట్లో నాన్నగారు కొత్తగా ప్రొడక్షన్ ప్రారంభించారు. నాకేవో సినిమాల మీదే ఆసక్తి ఉండేది. చదువంటే ఇష్టం లేదు. కేవలం నాన్న కోసమే కాలేజీలో చేరాను కాబట్టి మనకి హాజరెప్పుడూ నిల్లే. హాల్ టిక్కెట్ తెచ్చుకోవడానికీ పరీక్షలు రాయడానికీ మాత్రమే కళాశాల...