Ramakrushna .V-రామకృష్ణ .వి - (tollywood singer)
పరిచయం (Introduction) : వి.రామకృష్ణ(విస్సంరాజు రామకృష్ణ) 1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు.ముఖ్యంగా భక్తి ప్రధానంగా పాటలు చెప్పుకోదగ్గవి. 1972లో 'విచిత్రబంధం సినిమాతో గాయకుడిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన ఆలపించిన భక్తిగీతాల ఆల్బమ్ ఎంతో ఆదరణ పొందాయి. ప్రముఖ గాయని పి.సుశీలకు రామకృష్ణ దగ్గర బంధువు(మేనత్త ). ఆయన కుమారుడు సాయికిరణ్ 'నువ్వేకావాలి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మరణించిన రెండు రోజులకే రామకృష్ణ మృతి చెందడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవిత విశేషాలు (profile) : పేరు : వి.రామకృష్ణ జననం --ఆగష్టు 20, 1947 జన్మ స్థలము : విజయనగరం మరణం -- కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రసిద్ధి : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. పిల్లలు : ఒక కుమారుడు సాయికిరణ్ (నువ్వేకావాలి స...