కె.ఎస్.చిత్ర, Chitra.K.S
పరిచయం : చిత్రగా సుపరిచితురాలైన కె.ఎస్.చిత్ర, భారతీయ సినీరంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని . "దక్షిణ భారత నైటింగేల్" అనిబిరుదందుకున్న ఈమె మలయాళం,తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మరియు బెంగాలీ భాషల సినిమాలకుగాత్రదానం చేసింది. బాల్యములో తండ్రి ఈమె , ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలరుషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్దకర్ణాటక సంగీతములో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె మళయాల సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళసినిమారంగములో అడుగుపెట్టింది. దక్షినాది భాషలు మరియు హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయాభాషలలో పాటలను చక్కగా పాడగలదు. ప్రొఫైల్ : పేరు : చిత్ర .కె.యస్. జన్మ నామము : చిత్రా కృష్ణన్ నాయర్ , పుట్టిన తేది : చిత్ర, 1963, జూలై 27న పుట్టిన ఊరు : కేరళలోని తిరువనంతపురములో, కుట...