Posts

Showing posts with the label shobha - శోభ(Telugu actress)

shobha - శోభ

Image
పరిచయం (Introduction) :  shoba - శోభ--నాన్న డాక్టర్‌ని చేయాలనుకున్నారు. ఆమె మాత్రం యాక్టర్‌ అవ్వాలనుకుంది. అదే చేసింది. చక్కని మాటతీరూ, ఆకట్టుకునే హావభావాలతో ఎన్నో సినిమాల్లో మెప్పించిన శోభ .   జీవిత విశేషాలు (profile) :  పేరు : shoba - శోభ ఊరు : రేపల్లె -- గుంటూరు జిలా,  చరువు : డిగ్రీ ,  నాన్న : ఆర్టీసీ ఉద్యోగి., పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు  కెరీర్ ప్రారంభం : తన మాటల్లో-- చిన్నప్పట్నుంచి టీవీ బాగా చూసేదాన్ని. స్టేజి మీద నాటకాలు వేసిన అనుభవమూ ఉంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మా కాలేజీకి యాంకర్‌ ఉదయభాను వచ్చి, ఈటీవీ 'హృదయాంజలి' కార్యక్రమం చేశారు. మా తరగతిలో ఎవరూ మైకు ముందు మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. నేను చొరవగా మాట్లాడా. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పా. మెచ్చుకొని వెయ్యి రూపాయల గిఫ్ట్‌ చెక్‌ ఇచ్చారు. అలానే కామెడీ నటుడు గౌతంరాజు ఓ కార్యక్రమం కోసం మా కాలేజీకొచ్చారు. నాతో చాలాసేపు మాట్లాడారు. చివరికి 'శోభా.. నువ్వు హైదరాబాద్‌ వచ్చెయ్‌, నీకు మంచి అవకాశాలు ఇప్పిస...