Harini - హరిణి (Singer)
పరిచయం (Introduction) : దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి పాపులారిటీ సంపాదించిన గాయనీమణులలో హారిణి ఒకరు. హారిణి సినీగీతాలతో పాటు శాస్ర్తీయ సంగీతాధారిత అనేక పాటలను పాడారు. తెలుగు, హిందీ, కన్నడ, మళయాళంలో అనేక పాటలు పాడినా తమిళంలో పాడిన పాటలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అనేక ప్రముఖ, వర్ధమాన సింగర్స్‌తో పాడిన హారిణి నేపధ్యగాయకుడు టిప్పును వివాహం చేసుకున్నారు. ఘర్షణ చిత్రంలో ‘అందగాడా అందగాడా’ అనే పాట తెలుగు సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. నేటికీ ఈ పాటను వింటే నాడు వచ్చిన ఫీలింగ్ నేటికీ కలుగుతుంది. ఇది సాహిత్య మహిమా లేదా స్వర మాయా అనే సందేహం వస్తే రెండింటికి మార్కులు ఇచ్చి పాటను ఎంజాయ్ చేయమని చెబుతారు ఆ పాటను పాడిన సింగర్ హరిణి. నరసింహా నాయుడులో ‘లక్స్‌పాపా’ వంటి ఫాస్ట్ బీట్ పాడిన హరిణి గుడుంబా శంకర్‌లో ‘ఎమంటారో ’, 100 % లవ్‌లో ‘తిరుతిరు గణనాథా’ అంటు, ఖుషి చిత్రంలో ‘చెలియా చెలియా’ వంటి పాటలలో తన స్వరంతో పాటకు ప్రాణం పోశారు. తెలుగు, తమిళ కన్నడ , మళయాలి పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న హరిణి . జీవిత విశేషాలు (profile) : పూర్తి పేరు...