రాజబాబు,Rajababu
పరిచయం : తెలుగు సినిమా రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖహాస్యనటునిగా వెలిగిన రాజబాబు "శతాబ్దపు హాస్యనటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి. ౧౯౬౦ లో అద్దాల నారాయణరావు గారి దర్సకత్వములో వచ్చిన " సమాజం " సినిమాలో తొలిసారి అవకాసం ఇచ్చారు . అప్పటి నుండి ఇప్పటి వరకు ౧౮౫ సినిమాల లో నటించారు . ప్రొఫైల్ : పుట్టు పూర్వోత్తరాలు పేరు : రాజ బాబు . పూర్తీ పేరు : పుణ్యమూర్తుల అప్పలరాజు . పుట్టిన తేది : అక్టోబరు 20 , 1938 పుట్టిన ఊరు : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం , తండ్రీ : శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు తల్లి : శ్రీమతి రవణమ్మ. చదువు : నిడుదవోలులోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారిదగ్గరచేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయులుగాకొద్దికాలంపనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకలల్లో పాలుపంచుకొనే వారు. కుటుంబము :రాజబాబుడిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు గారిని వివాహమాడారు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరుబిడ్డలుపుట్టారు. మరణము : 14 ఫిబ్రవరి 1983 . కెరీర్ : ఒక ...