Posts

Showing posts with the label G.N.swamy(old tollywood actor)-జి.ఎన్‌.స్వామి

G.N.swamy(old tollywood actor)-జి.ఎన్‌.స్వామి

Image
పరిచయం (Introduction) : గాదె నరసింహస్వామి అని పూర్తి పేరుగల జి.ఎన్‌.స్వామి బాలనటుడు. పాటలూ, పద్యాలూ బాగా పాడేవారు. బరంపురంలో వుంటూ చిత్రాల్లో ప్రవేశించారు. 1936లో ఈస్టిండియా వారికి సి.పుల్లయ్యగారు తీసిన ''అనసూయ, ధ్రువ''లో ధ్రువ పాత్రధారి జి.ఎన్‌.స్వామి. 'అనసూయ'లో అందరూ బాలనటులే. ప్రౌఢ పాత్రలూ ధరించారు. 'అనసూయ' నిడివి సినిమాకి తగ్గడంతో (ఆ రోజుల్లో సినిమా రెండన్నర, మూడు గంటల పాటు నడవాలి) 'ధ్రువ' మొదలుపెట్టి రెండూ కలిపి ఒకే 'షో'గా విడుదల చేశారు. ఆ 'ద్విచిత్ర ఏకచిత్రం' కాసులు బాగా సంపాదించింది. ధ్రువుడు పాడిన పాటలు, పద్యాలూ ఆకట్టుకున్నాయి. అందంగానూ, సౌమ్యంగానూ కనిపించాడు ధ్రువుడు. ఇంకొక బాల పాత్ర ప్రధానంగా కనిపించే 'మార్కండేయ'ని తీసినప్పుడు జి.ఎన్‌.స్వామితో చిత్రపు నారాయణమూర్తి 'భక్త మార్కండేయ' (1939) నిర్మించారు. వేమూరి గగ్గయ్య యముడు. రెండూ బాలభక్తుల కథలు కావడంతో ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. 'మార్కండేయ'లోని భక్తి పాటలు కూడా స్వామి చక్కగా పాడి, ఆకట్టుకున్నారు. ఆ బాలుడు పెద్దవాడయ్యాక, అటూ ఇటూ కాని వయ...