నరసింహారావు కోరాడ , Narasimharao Korada
పరిచయం : కోరాడ నరసింహారావు - ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. కోరాడ నరసింహారావు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు . భారతదేశ మొట్టమొదటి మిస్ ఇండియా 'పద్మభూషణ్' ఇంద్రాణి రెహమాన్, పద్మ విభూషణ్ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు . ప్రొఫైల్ : పేరు : కోరాడ నరసింహారావు , ఊరు : పవర్ పేట - ఏలూరు , పశ్చిమ గోదావరి జిల్లా , పుట్టిన సం . : 1936 , మరణము : 04 - జనవరి 2007 , హైదరాబాద్ లో పిల్లలు : ఒక కుమారుడు , ఒక కుమార్తె , ఫిల్మోగ్రఫీ : గిరిజ కళ్యాణం , రహస్యం ( వేదాంతం రాఘవయ్య నిర్మించినది ) పురస్కారాలు : 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడిగా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యారు . కోరాడ నరసింహారావును భరత కళాప్రపూర్ణ, కళాసరస్వతి లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కార...