సాయికిరణ్ , Sai kiran
పరిచయం : సినిమా రంగంలో వివిధ రంగాల్లో ఉన్నవారి వారసులు కూడా వారి , వారి రంగాల్లోనే ప్రవేశించడం పరిపాటి . అయితే దీనికి భిన్నంగా గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ గాయకుడుగానే కాకుండా నటనా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు . పదో తరగతిలోనే సినిమా రంగంపై ఆసక్తి కలిగి ఉన్నా తండ్రికిచ్చిన మాటకోసం " హోటల్ మేనేజ్ మెంట్ " లో గోల్డ్ మెడల్ సాధించిన తరువాతే నటనపై దృష్టి సారించాడు సాయికిరణ్ . ఈయన grandson of singer P. Suseela. " నువ్వే కావాలి " సినిమాలో " అనగనగా ఆకాశం ఉంది " పాటలో నటించిన కుర్రాడు ఎవరబ్బా అనుకునేంతగా ఆకట్టుకున్న కుర్రాడు సాయికిరణ్ . ఈ సినిమా తరువాత ఆఫర్లు వెల్లువెత్తటంతో సరైన నిర్ణయాలు తీసుకోక నటనాపరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన ఇతను మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూనే ఉన్నాడు . తాజాగా అనే సినిమాలో ఎవరూ ఊహించనట్టి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో , " ప్రియరాగమా " అనే మరో చిత్రంలో మెకానిక్ గా నటిస్తున్నాడు . సాయికిరణ్ కు పాములతో స్నేహం ఒక హాబీ "ప్రొఫైల్ : అసలు ...