కీర్తన-Keerthana
------------------------------------------- కీర్తన తమిళ్ నటి . కీర్తన, పర్తిబన్ అండ్ సీత, నటుల కుమార్తె తమిళం, తెలుగు లో నటిస్తునారు. keertana(Amruta) - కీర్తన (అమృత) మణిరత్నం సార్ సినిమాలో నటించడమంటే ఎంత గొప్పో నాకు ఆ వయసులో తెలియలేదు. ఇప్పుడు మాత్రం తలచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను పుట్టిందీ పెరిగిందీ అంతా చెన్నైలోనే. అమ్మ సీత కథానాయిక, నాన్న పార్థిబన్ నటుడు, దర్శకుడు. అమ్మానాన్నల సినిమాలు చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను కనుక నాకు ఆ వాతావరణం కొత్తగా అనిపించేది కాదు. నేను అయిదో తరగతిలో ఉన్నప్పుడు మణిరత్నంగారు ఓసారి మా నాన్న దగ్గరికి వచ్చి 'నా కథలో ఓ ముఖ్యమైన పాత్ర ఉంది. దానికి కీర్తన అయితే బాగుంటుంది' అన్నారు. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. అప్పటికే షూటింగులు ఎలా జరుగుతాయో చూశాను కనుక, నటించడానికి నాకేం భయం వేయలేదు. అమ్మ నాకు తోడుగా షూటింగులకు వచ్చేది. నిజానికి నాకు ఎలాంటి శిక్షణను ఇవ్వకుండా కెమెరా ముందు నిల్చోబెట్టారు. అప్పుడప్పుడు చెప్పినట్టు చేయలేక పోయేదాన్ని. దాంతో మణిరత్నం సార్ నాన్నతో 'మీ అమ్మాయిని నటించమని చెప్పకండి.. నిజ జీవితంలో ఎలా ఉంటుందో.....