అంజలి దేవి-AnjaliDevi
------------------------------------------------------------- *********************************************** పరిచయం : అంజలీదేవి 1950-75 తరానికి చెందిన సినిమా నటీమణి మరియు నిర్మాత. అంజలీదేవి నర్తకి కూడా . తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. సుమారు 350 సినిమా ల లో నటించారు . అంజనీకుమారే .. అంజలీదేవిగా 'గొల్లభామ' (1947)లో దేవకన్య వేషం వేసింది. 'గొల్లభామ'కీ, ఆ కొత్తనటి అంజలీదేవికీ పేరు వచ్చింది. 'కీలుగుర్రం' (1949)లో మరీ భయంకరమైన పాత్ర; రాక్షసి. రాజుగారి కోటలో ఉన్న ఏనుగుల్నీ, గుర్రాల్నీ తినే పాత్ర! ఇలాంటి పాత్రలతో సినిమా రంగంలో ప్రవేశించిన అంజలీదేవి- నాయికగా, వదినగా, తల్లిగా, అమ్మమ్మగా, బామ్మగా దశలవారిగా పాత్రలు ధరిస్తూ- గొప్ప నటిగానూ, మంచినటిగానూ, మహానటిగానూ ప్రసిద్ధి పొందింది. 'శ్రీ లక్ష్మమ్మ కథ'లో పతివ్రతలాంటి పాత్రని అంజలిదేవికి ఇచ్చినప్పుడు అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఆమె భయపడలేదు. దర్శక నిర్మాత బలరామయ్య గారూ భయపడలేదు. అంజలీదేవి- ఆ పాత్రధారణని ఒక సవాలుగా త...