Bollu Satyanarayana- బొల్లు సత్యనారాయణ
పరిచయం (Introduction) : సినీ నిర్మాత బొల్లు సత్యనారాయణ (61) శనివారం(29-08-2015) మధ్యాహ్నం తిరుపతిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ సినీ ప్రస్థానం 1981లో 'ముద్దమందారం'తో ప్రారంభమైంది. ఆ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2002లో 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ'తో నిర్మాతగా మారారు. ఆపై 'బాలీవుడ్ కాలింగ్', 'మిస్సమ్మ', 'మాయాబజార్' తీశారు. అనువాద చిత్రాలు 'అభిమన్యుడు', 'గీతాంజలి' ఆయనే నిర్మాత. 'మిస్సమ్మ'కుగాను 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు :భొల్లు సత్యనారాయణ, వయసు : 61 సం.లు , పుట్టిన ఊరు : నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం జువ్విగూడెం.. భార్య :: అన్నపూర్ణమ్మ తితిదే పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరయ్యారు. పిల్లలు : ఆయనకు కుమార్తె హరిత కుమారుడు తేజస్వి ఉన్నారు. నివాసము : తిరుపతి , ...