కొసరాజు రాఘవయ్య చౌదరి , Kosaraju Raghavayya Chowdary
పరిచయం : కొసరాజుగా ప్రసిద్ది చెందిన ఈ తెలుగు సినిమా పాటల రచయిత పూర్తి పేరు కొసరాజు రాఘవయ్య చౌదరి . తెలుగు సినిమా పాటల రచయిత గా కొసరాజుది ప్రత్యేకపీఠం . ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి . వ్యంగ్యం , హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి , అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది . ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు . జానపదగీతాల్లోని లాలిత్యాన్ని , ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి . ఏరువాక సాగాలోరన్నో … అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ … అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది . పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి . అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు ...