దగ్గుబాటిరామానాయుడు,Rama Naidu
======================================================= పరిచయం : దగ్గుబాటి రామానాయుడు : ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను 14 భారతీయ భాషలలో నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. అంతటితోఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకుస్ఫూర్తిగా నిలిచారాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్తో సహాసినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగానూ రాణించారు. బయోగ్రఫి : పుట్టిన తేది : 1936వ సంవత్సరం జూన్ 06 . పుట్టిన ఊరు : ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించారు. తండ్రీ , -డి.వెంకటేశ్వరులు. తల్లి : లక్ష్మిదేవమ్మ. భార్య : రాజేశ్వరి , చదువు : College education. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ . సేవాకార్యక్...