జయలలిత,Jayalalitha
-- జయలలిత . తమిళనాడు ముఖ్యమంత్రి . -------------------------------------------------------------------------------------- పరిచయం : జయలలిత జయరామన్ ,తమిళనాడు రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు సినీనటి. తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం యొక్క ప్రధాన కార్యదర్శి. 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి, 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభ ఎన్నికైంది. అప్పటిముఖ్యమంత్రి యంజి.రామచంద్రన్ కు సన్నిహితంగా మెలిగింది. రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. గ్లామర్ వల్లజయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించింది. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జర్గిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించిముఖ్యమంత్రి పాఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగాఅవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజ...