DoraSwamy-దొరస్వామి(actor)
పరిచయం (Introduction) :
- వాహిని సంస్థకి ఒక నటబృందం ఉండేది. వాళ్లు తప్పకుండా ఆ సంస్థ తీసిన సినిమాల్లో ఉంటారు. బయటి చిత్రాల్లోనూ వేస్తారుగాని, వాహినిలో తప్పక ఉంటారు. లక్ష్మీకాంతం (పురుషుడు), సి.నాగేశ్వరరావు, రాఘవన్, దొరస్వామి, లింగం సుబ్బారావు, కె.వి.సుబ్బారావు మొదలైన వాళ్లందరికీ వాహిని సంస్థ ఏదో ఒక వేషం ఇచ్చేది. తర్వాత వీళ్లలోనే కొందరు విజయ సంస్థలోనూ నటించేవారు. అందులో ముఖ్యుడు దొరస్వామి. మల్లీశ్వరి, మిస్సమ్మ సినిమాలు బాగా గుర్తున్నవాళ్లకి దొరస్వామి గుర్తుంటారు. మల్లీశ్వరిలో మల్లీశ్వరి తండ్రి, మిస్సమ్మలో మేరీ (సావిత్రి) తండ్రి. 'యోగి వేమన'లో వేమారెడ్డి గారింట్లో నౌకరు. 'త్యాగయ్య'లో కూడా మంచి పాత్ర ధరించారాయన. అంతకుముందు వాహిని తీసిన వందేమాతరం, దేవత చిత్రాల్లోనూ దొరస్వామి నటించారుగాని, ఇతరులు నిర్మించిన చిత్రాల్లో కనిపించినట్లు లేదు. ఎందుకనో!
జీవిత విశేషాలు (profile) :
- పేరు : DoraSwamy-దొరస్వామి(actor)
నటించిన కొన్ని సినిమాలు (filmography ):
- మల్లీశ్వరి,
- మిస్సమ్మ .
- యోగి వేమన'లో వేమారెడ్డి గారింట్లో నౌకరు.
- 'త్యాగయ్య'
- వందేమాతరం, .
- దేవత .
*Courtesy with Ravi kondalarao@pathabangaram of eenadu cinima news
- ==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog