Adah Sharma-ఆదాశర్మ(actress)
పరిచయం (Introduction) :
- ఆదా శర్మ " హార్ట్ ఎటాక్ " తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆదా శర్మ బాలీవుడ్ నటి , ముంబై నివాసము గా ఎన్నో యాడ్స్ లో నటించారు . మొదటి సినిమా హిందీలో "1920 " విక్రం భట్ దర్శకత్వములో. ఆదాశర్మ--నేను తెలుగు ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' నుంచి కాదు... ఎప్పట్నుంచో పరిచయమే! నోకియా, లిమ్కా, నటుడు మాధవన్‌తో కలిసి జోయ్ అలుకాస్.. వంటి సంస్థల ప్రకటనల్లో నటించా. అవి చూసి 'మీరు బాగున్నారు' అంటూ ట్విట్టర్‌లో ప్రశంసించిన అభిమానులు చాలామందే. అలా ప్రకటనల్లో కనిపించిన తను తెరమీద ఎలా కనిపించారంటే అంతా అదృష్టమే.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : ఆదా శర్మ ,
- పుట్టిన ఊరు : కేరళలోని పాల క్కాడ్ ,
- పుట్టిన తేదీ :11-మే-1989.
- నాన్న : నేవీ లో ఉద్యోగి ,
- అమ్మ : డాన్సర్ , యోగా టీచర్ ,
- నివాసము : ఉద్యోగ రీత్యా ముంబై లో నివాసము ,
- తోబుట్టువులు : లేరు -- ఒకే కూతురు ,
- చదువు : డిగ్రీ - సైకాలజీ లో ,
- ఇస్టమైన నటీనటులు : నటనలో నిత్యా మీనన్, సమంత, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ చాలా ఇష్టం.
- మొదటి సినిమాలు : హిందీ -- 1920 , తెలుగు : హార్ట్ ఎటాక్ .,
కెరీర్ :
- కథక్‌లో ప్రావీణ్యం సంపాదిస్తూనే, జిమ్నాస్టిక్స్, బెల్లీ డాన్స్‌లో శిక్షణ పొందా. దాంతో చక్కటి శరీరాకృతి సొంతమైంది. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఎక్కడ ఆడిషన్లు జరుగుతున్నా వెళ్లేదాన్ని. మొదటి అవకాశం వచ్చింది. '1920' హారర్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టా. కథక్ డాన్సర్‌గా వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం వంటి వాటిలో అనుభవం ఉండటంతో కెమెరా ముందు సులువుగా నటించా. మరో మూడింటిలోనూ నటించి మెప్పించా. 'హయాతీ' పాత్ర కోసం పూరీగారు ఆడిషన్‌కి పిలిచారు. నా హావభావాలూ, కథక్ డాన్స్ చూసి అవకాశమిచ్చారు.
నటించిన సినిమాలు (filmography ):
- 2008-లో 1920(హిందీ),
- 2011-లో phhir (హిందీ),
- 2013 -లో : Hum Hai, Raahi Car ke ,
- 2014 - లో : Hasee Toh , Phasee (Hindi),
- : హార్ట్ ఎటాక్ (తెలుగు),
- =========================
- visiti my website > Dr.Seshagirirao-MBBS.
.jpg)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog