సి.సీతారామ్.C.Sitaram

  • courtesy with Animutyalu /Ravi kondararao
పరిచయం (Introduction) :
  • బొబ్బిలి యుద్ధం' (1964)లాంటి భారీ చిత్రాన్ని సాహసోపేతంగా నిర్మించి, దర్శకత్వం వహించి, పాత్ర కూడా ధరించిన సి.సీతారామ్‌ అంతకు ముందు మద్రాసులోని పూర్ణా పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసుకి మేనేజరుగా వుండేవారు. మంచి ఫొటోగ్రాఫర్‌. ఆయన తీసిన ఫొటోలు ఇంగ్లీషు పత్రికల్లో వచ్చేవి. పూర్ణాలో మూడున్నర సంవత్సరాలపాటు ఆయన ఆ ఉద్యోగంలో వున్నారు. అప్పుడు ఆయనకు చాలామంది సినిమావారితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రత్రిక వీక్లీ మొదలైన పత్రికల్లో ఆ ఫొటోలు అచ్చయ్యేవి. ఆంధ్రపత్రిక వీక్లీ అప్పుడు పెద్ద సైజులో వచ్చేది. ఆ పత్రిక కవర్‌ పేజీ మీద కూడా ఆయన తీసిన ఫొటోలు వచ్చేవి. ఫొటో కింద 'సి.ఎస్‌.రామ్‌' అని వుండేది. కథలు రాయడం మీద కూడా ఆయనకి ఉత్సాహం వుండేది. ఆయన రాసిన కథలు 'భారతి', 'గృహలక్ష్మి' పత్రికల్లో వచ్చాయి.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సి.సీతారామ్‌,
  • పుట్టిన ఊరు : బందరు దగ్గర పల్లెటూరు ,
  • తండ్రి : చోడవరపు ఆంజనేయులు --వ్యవసాయము ,
  • చదువు : SSLC - గుడివాడలో ,
సినిమాలు (filmography ): దర్శకుడిగా, నిర్మాత గా
  • పెళ్లి సందడి (1959)
  • సత్యం శివం సుందరం (ఆరుద్ర రచన)
  • బొబ్బిలి యుద్ధం,
  • రక్త సిందూరం(1967). శోభన్‌బాబు, రాజశ్రీ
మూలము : ఆణిముత్యాలు - రావి కొండలరావు (ఈనాడు సినిమా న్యూస్). ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)