రామజోగయ్య శాస్త్రి-గీతరచయిత , Ramajogayya Sastry (Lyricist)

పరిచయము :
  • అదుర్స్‌'... 'చారీ..' 'చంద్రకళా..' నవోవెంకటేశలో... అన్నీ. ఏక్‌నిరంజన్‌లో... టైటిల్‌సాంగ్‌. గో.గో.గోదావరి... 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే..' గతంలోకి కాస్త తొంగిచూస్తే గీతరచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఇలాంటి హిట్‌ పాటలెన్నో.
జీవిత విశేషాలు (ప్రొఫిల్) :
  • పేరు :రామజోగయ్య శాస్త్రి,
  • ఊరు : ముప్పల - గుంటూరు జిల్లా ,
  • పుట్తిన తేదీ :
  • చదువు : ఎం.టెక్ (ఇంజినీరింగ్ ),
కుటుంబము :
  • అమ్మ :
  • నాన్న :
  • భార్య :
  • పిల్లలు :
  • తోబుట్టువులు :
కెరీర్ : తన మాటల్లో ->
  • ఐదారు తరగతుల్లోనే సినిమాల ప్రభావం వెుదలైంది. పాటలు విన్నవి విన్నట్టుగా పాడేవాణ్ని. అందుకు నాకున్న సోర్స్‌... మాఊరు ముప్పాళ్లలో ఓ టూరింగ్‌ టాకీస్‌, అప్పుడప్పుడూ హైస్కూల్‌ గ్రౌండ్‌లో వేసే తెరబొమ్మలు. అప్పట్లోనే టేప్‌రికార్డర్లు వచ్చాయి. ప్రేమాభిషేకం, కొండవీటి సింహం వంటి పాటలు తెగ వినిపించేవి. దీనికితోడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఓ పీరియడ్‌ ఉండేది. అందులో నాపాట తప్పనిసరి. మా డ్రిల్‌ మాస్టారు సాయంత్రంపూట ట్యూషన్స్‌ చెప్పేవారు. నాతో పాడించాకనే ట్యూషన్‌ విడిచిపెట్టేవారు. మరోపక్క... మా బావగారు సాంఘిక నాటకాలు వేసేవారు. ఆయనతో వెళ్లేవాణ్ని. నాటకాల్లో వాడే సినిమా పాటలు ఇంట్లో ప్రాక్టీస్‌ చేసేవాణ్ని. అలా పాడిన తొలిపాట 'ముత్యమల్లే మెరిసిపోయే మల్లెవెుగ్గా...' ఇలా టెన్త్‌ వరకూ గడిచిపోయింది. ఇంటర్‌కి మాఊరు దగ్గర్లో ఉన్న నర్సరావుపేట వచ్చేశా. పాటల కలెక్షన్‌ వెుదలుపెట్టా. నచ్చినవి రికార్డ్‌ చేయించుకుని విని నేర్చుకునేవాణ్ని. తరువాత వరంగల్‌ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరాను.
గాయకుణ్ని అయిపోయాను!
  • నిజమే, క్యాంపస్‌లో నేనే ఆముదపు వృక్షాన్ని! ఇంజినీరింగ్‌లో జాయిన్‌ కాగానే సీనియర్స్‌ ర్యాగింగ్‌ వెుదలైంది. మాతో రకరకాల పనులు చేయించేవారు. నా దగ్గరకి రాగానే 'నువ్వేం చేయగలవు?' అని ఓసారి అడిగారు. ఎవరో నేను పాడతానని చెప్పారు. 'అయితే ఘంటసాల పాటొకటి వేసుకో' అన్నారు. ఇదే బాగుందని మర్నాట్నుంచి ఓ పాటల పుస్తకం పట్టుకుని తిరిగేవాణ్ని. సీనియర్లు అడగ్గానే పాడేసి నా పనైపోయింది అనిపించేవాణ్ని. ర్యాగింగ్‌ నుంచి తప్పించుకోడానికి అదే సులువైన మార్గం! మా కాలేజీలో 14 కల్చరల్‌ క్లబ్బులు ఉండేవి. వాటిల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టూడెంట్స్‌ ఉండేవారు. అందులోని మ్యూజిక్‌ క్లబ్‌లో నేను సభ్యుణ్ని. థర్డ్‌ ఇయర్‌లో ఉండగా 'స్ప్రింగ్స్‌ స్ప్రీ' అనీ ఓ కార్యక్రమం జరిగింది. అందులో 'ఓపాపా లాలీ... జన్మకే లాలీ...' పాటను పాడాను. విపరీతమైన రెస్పాన్స్‌. భాషాభేదం లేకుండా స్టూడెంట్స్‌ అందరూ చప్పట్లు కొట్టారు. వూహించని స్పందన. ఆ ఎప్లాజ్‌ మాంచి కిక్‌ ఇచ్చింది. మర్నాడు 'నిన్న పాడింది నువ్వే కదా! సూపర్‌. ఇరగదీసేశావ్‌' అని క్యాంటీన్‌లో అందరూ మెచ్చుకున్నారు. ఆరోజు వేసుకున్న చొక్కాను మూడ్రోజులు వరుసగా తొడుక్కున్నా. ఒకవేళ షర్టు మార్చేస్తే నన్నెవరైనా గుర్తుపట్టరేవోనని! అలా క్యాంపస్‌లో ఓ వెలుగు వెలిగా. తరువాత ఎం.టెక్‌.కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌ వెళ్లిపోయా. అక్కడ తెలుగు సంఘాల్లో నా పాట షరామామూలే. అలా పాడగాపాడగా నామీద నాకు నమ్మకం కలిగింది. గాయకుడిగా అవకాశాలు రావాలంటే చెన్నై వెళ్లడమే మార్గం అనిపించింది.
పిలుపు... మద్రాస్‌లో సెటిల్‌ అవ్వాలి!
  • సినీ పరిశ్రమ అక్కడే ఉంది. మద్రాస్‌లోనే ఉద్యోగం దొరికితే కల సాకారం చేసుకోవచ్చుగా! కానీ బెంగళూర్‌లో జాబ్‌ వచ్చింది. గుడ్డిలో మెల్ల. ఉద్యోగాన్ని కాదనుకుని మద్రాస్‌ వెళ్లి కల నెరవేర్చుకోవచ్చు. కానీ, ఆ పరిస్థితుల్లో నాకు జాబ్‌ అవసరం. ఉన్న పరిస్థితిని బట్టే పోరాడదామని నిర్ణయించుకున్నా. జాబ్‌లో చేరిపోయా. నెల్రోజుల్లోపే బెంగుళూర్‌లో ఓ గాయకుడు పరిచయం అయ్యాడు. ఓ పెళ్లి ఫంక్షన్లో ఆర్కెస్ట్రాలో పాడటానికి వచ్చాడు. ఆయనతో నేనూ పాడతానని చెప్పాను. ఆయనతో కలిసి ఓ రికార్డింగ్‌ థియేటర్‌కి వెళ్లాను. అక్కడ తెలుగు భక్తిగీతాల రికార్డింగ్‌ జరుగుతోంది. అక్కడ కన్నడ గీత రచయిత శ్రీచంద్ర, గాయని సుజాత పరిచమయ్యారు. 'వాయిస్‌ టెస్ట్‌' చేద్దామన్నారు. నాలో చిన్న ఆశ... పాడిస్తారేవో! దాంతో రోజూ ఆఫీస్‌ అవగానే వాళ్లదగ్గరకి హాజరు. ఓనెలపాటు వాళ్ల చుట్టూ తిరిగా. ఈలోగా అంతా మంచి ఫ్రెండ్స్‌ అయిపోయారు. తరువాత వాయిస్‌ టెస్ట్‌ చేయించారు. దాని ఫలితం చెప్పడానికి మరో రెణ్నెళ్లపాటు నాన్చారు. తరువాత చెప్పిందేంటంటే... 'శాస్త్రీ... నువ్వు బాగానే పాడతావ్‌. కానీ ఉద్యోగం చేసుకుంటూ పాటలంటే కష్టమేవో. అదే పాటలు రాయడం వెుదలుపెట్టావనుకో... నీ ఉద్యోగానికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఏఁవంటావ్‌!' అన్నారు శ్రీచంద్ర. నాకు శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదు. ఏ గురువు దగ్గరా శిష్యరికం లేదు. కాబట్టి నాతో పాడించలేం అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ అలా చెప్పారు.
అప్పుడు నేనేం చెయ్యాలి? స్నేహాన్ని వదులుకోలేను. అలాగని పాటలు రాయడం తెలీదు. కానీ నాకు వేరేదారి లేదు. మలుపు...
  • ఎలాగైనా పాటలు రాయాలి! ఏదో ఒకరోజు పాటపాడాలి.
అందుకే రాయడం నా వల్లకాదని అనుకోలే. ప్రయత్నిస్తా. తెలిసినవాళ్లు ఒకపాటను గంటలో రాయెుచ్చు. నాకు తెలీదు, కాబట్టి పదిరోజులైనా కష్టపడతా అనుకున్నా. తొలిసారిగా భక్తి పాటలు రాయడం వెుదలుపెట్టా. అలా రాస్తూరాస్తూ పోతుంటే రాయడంలో ఏదో మజా ఉందనిపించింది. నాలో గీత రచయిత నెమ్మదిగా ఎదగడం వల్లనో... మెచ్యూరిటీ లెవల్స్‌ మారడం వల్లనో... నాలో గాయకుడు పక్కకు తప్పుకున్నాడు. నన్ను ప్రోత్సహించి దాదాపు నలభై ఆధ్యాత్మిక గీతాల క్యాసెట్లకి పాటలు రాయించారు శ్రీచంద్ర, గాయని సుజాతాదత్తు. వాళ్లని ఎప్పటికీ మరిచిపోలేను. అప్పట్లోనే ఎల్‌.ఎన్‌.శాస్త్రి అనీ ఓ గాయకుడు పరిచయమయ్యారు. ఆయన సినిమాలకి పాడతారు. ఆయన ద్వారా కన్నడ హీరో రవిచంద్రన్‌ పరిచయం. రవిచంద్ర ఓ సినిమాకి సంగీతం చేపట్టారు. వాళ్లింట్లో సంగీత పరికరాలుండేవి. రోజూ ఆఫీస్‌ నుంచి రావడం... ఇంట్లో పిల్లలతో కాసేపు ఆడుకోవడం... రవిచంద్రన్‌ ఇంటికెళ్లిపోయి వాళ్లోపక్క ట్యూన్లు కట్టుకుంటుంటే వాటికి పాటలు రాస్తూ ప్రాక్టీసు చేసుకునేవాణ్ని. ఏ రాత్రికో ఇంటికి చేరేవాణ్ని. నాలుగైదేళ్లపాటు ఇదే దినచర్య.
  • ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నారు రవిచంద్రన్‌. దానికి నాతో పాటలు రాయించారు. రికార్డింగ్‌ కూడా అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి నేను ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఇబ్బందుల్లో పడింది. మరో ఉద్యోగం చూసుకోవాల్సి వచ్చింది. . హైదరాబాద్‌ వచ్చేశా.
మెరుపు...
  • నేను రాసిన తెలుగుపాటల్ని రవిచంద్రన్‌ వద్ద దర్శకుడు కృష్ణవంశీ ఓసారి విన్నారు. 'ఇవి డబ్బింగ్‌ పాటల్లా ఉన్నాయి' అని ఆయనతో అన్నారట. అప్పుడాయన నాకు ఫోన్‌ చేసి కృష్ణవంశీని కలవమన్నారు. ఆయన ద్వారా సీతారామశాస్త్రిగారి దగ్గరకు వెళ్లి మూడు పాటలు రాయించాం. ఆ కన్నడ సినిమా అక్కడా పెద్ద హిట్‌ కాలేదు. దాంతో తెలుగులో రిలీజ్‌ అన్నమాటే రాలేదు. కానీ, నాకు శాస్త్రిగారి పరిచయం దొరికింది. వెుదటి పరిచయంలోనే 'మీ దగ్గర శిష్యుడిగా చేరతా' అని అడిగేశా. ఆయన ఒప్పుకున్నారు. రోజూ మధ్యాహ్నం పన్నెండుకి ఆఫీస్‌కి వెళ్లేవాణ్ని. అక్కణ్నుంచి రాత్రి ఎనిమిదయ్యేసరికి శాస్త్రిగారింటికి. తెల్లారేవరకూ అక్కడే. అప్పుడొచ్చి కాసేపు నిద్రపోయి మళ్లీ ఆఫీస్‌కి వెళ్లేవాణ్ని. ఆయన దగ్గర శిష్యరికం ఓ స్వర్ణయుగం. పాటలు రాయడంతోపాటూ జీవితాన్ని ఎలా మలుచుకోవాలీ... మనిషికి ఎలాంటి యాటిట్యూడ్‌ ఉండాలీ... భవిష్యత్తుపట్ల సానుకూల దృక్పథం... ఇలా ఎన్నో నేర్చుకోగలిగాను. ఓ సందర్భంలో గురువుగారే 'నేను రికమండ్‌ చేస్తా. వెళ్లి పాటలు రాసేయ్‌' అన్నారు. వద్దుసార్‌, నాలో కొరత ఇంకా భర్తీకాలేదు అన్నాను. కొన్నాళ్ల తరువాత నిర్మాత 'స్రవంతి' రవికిషోర్‌గారు నాతో పాటలు రాయిస్తా అని గురువుగారిని అడిగారు. అలా తొలిసారిగా 'యువసేన'లో రెండు పాటలు రాశా. 'ఏదిక్కున నీవున్న ఎగిరొస్తా పావురమా', 'ఓణీ వేసుకున్న పూలతీగ వూగుతుంటే'... రెండూ హిట్‌ సాంగ్సే. కానీ, తరువాత ఏడాదిపాటు ఏ అవకాశమూ రాలేదు!
గెలుపు... నన్ను పక్కన పడేశారా? చిన్నప్పట్నుంచి పాటమీద వోజుపడ్డా. దానికోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసుకున్నా. మరోపక్క ఉద్యోగాన్ని పణంగాపెట్టి కష్టపడ్డా. ఈ శ్రమంతా వృథాయేనా? జీవితం ఇక్కడితో ఆగిపోతుందా? ఆ ఏడాదంతా ఎన్నో ప్రశ్నలు. ఏదో అలజడి. టెలిఫోన్‌ డైరెక్టరీ దగ్గరపెట్టుకుని ఎంతోమందికి ఫోన్‌ చేశా. బాగానే మాట్లాడేవారు. 'యువసేన' పాటలు బాగున్నాయనీ మెచ్చుకునేవారు. కానీ అవకాశాలు మాత్రం రాలేదు.
  • ఆ తరువాత కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన 'అసాధ్యుడు' చిత్రానికి రాసే అవకాశం వచ్చింది. చక్రి పరిచయమయ్యారు. తరువాత శ్రీనువైట్ల 'ఢీ'లో అవకాశమిచ్చారు. తరువాత రెడీ, చిరుత, లక్ష్యం... వరుస అవకాశాలొచ్చాయి. పాటల్లోపడి ఉద్యోగానికి న్యాయం చెయ్యలేకపోతున్నానని అనిపించింది. అందుకే రిజైన్‌ చేసేశాను.
పాటలు రాసిన సినిమాలు :Year Movie Name Role
  • 2011 శక్తి Lyricist
  • 2011 Mr పెర్ఫెచ్త్ Lyricist
  • 2011 అః నా పెళ్ళంట Lyricist
  • 2011 ఊసరవెల్లి Lyricist
  • 2011 బ్రహ్మిగాది కథ Lyricist
  • 2011 థర్డ్ మాన్ Lyricist
  • 2010 రగడ Lyricist
  • 2010 హాసిని Lyricist
  • 2010 డాన్ శీను Lyricist
  • 2010 పంచాక్షరి Lyricist
  • 2010 ఓం శాంతి Lyricist
  • 2010 బెట్టింగ్ బంగార్రాజు Lyricist
  • 2010 బద్మాష్ Lyricist
  • 2010 బురిడి Lyricist
  • 2010 ధూల్ Lyricist
  • 2010 కోతి మూక Lyricist
  • 2010 ఆరంగే Lyricist
  • 2010 ఓం సైరం Lyricist
  • 2010 ఎం పిల్లో ఎం పిల్లాడో Lyricist
  • 2010 డార్లింగ్ Lyricist
  • 2010 మర్యాద రామన్న lyrisisT^
  • 2009 గణేష్ Lyricist
  • 2009 బాణం Lyricist
  • 2009 జయీ భావ Lyricist
  • 2009 సంఖం Lyricist
  • 2009 బెండు అప్పారావు RMP Lyricist
  • 2009 మహానగరంలో Lyricist
  • 2009 బిళ్ళ Lyricist
  • 2009 మల్లి మల్లి Lyricist
  • 2009 కరెంటు Lyricist
  • 2009 ఏక నిరంజన్ Lyricist
  • 2009 గోపి గోపిక గోదావరి Lyricist
  • 2009 హ్యాపీ ^ ఝుర్నీ ^ Lyricist
  • 2008 భలే దొంగలు Lyricist
  • 2008 కృష్ణార్జున Playback Singer
  • 2008 ఒంటరి Lyricist
  • 2008 పెళ్లి కానీ ప్రసాద్ Lyricist
  • 2008 భద్రాద్రి Lyricist
  • 2008 జల్సా Lyricist
  • 2008 సవాల్ Lyricist
  • 2008 దొంగ సచినోల్లు Lyricist
  • 2008 కంత్రి Lyricist
  • 2008 రెడీ Lyricist
  • 2008 మా ఆయన చంటి పిల్లడు Playback Singer
  • 2008 అంకిత్ , పల్లవి and ఫ్రెండ్స్ Lyricist
  • 2008 కుసల్య సుప్రజా రామ Lyricist
  • 2008 ఏక పోలీసు Lyricist
  • 2008 నేనింతే Lyricist
  • 2008 కింగ్ Lyricist
  • 2007 గొడవ Lyricist
  • 2007 వియ్యాలవారి కయ్యాలు Lyricist
  • 2007 లక్ష్మి కళ్యాణం Lyricist
  • 2007 ధీ Lyricist
  • 2007 రాజు భై Lyricist
  • 2007 చిరుత Lyricist
  • 2007 దుబాయ్ శీను Lyricist
  • 2007 విహారి ల్య్రిసిస్ట్
  • 2007 సంధ్య Lyricist
  • 2006 గేమ్ Lyricist
  • 2006 అసాధ్యుడు [2006] Lyricist
  • 2004 యువసేన Lyricist
  • వ్య్కున్తపాలి Lyricist
  • శ్రీ శైలేంద్ర సినిమాస్ Lyricist
  • శ్రీ సాయి గణేష్ produktions Lyricist
  • మనసే మందిరం Lyricist
  • కట్టి కాంతారావు Lyricist
  • ఆలస్యం అమృతం Lyricist
  • తాజ్ మహల్ Lyricist
  • వాడె కావాలి Lyricist
  • source : Enadu sunday magazine
  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni