రాజ్-వెంకటసోమరాజు,Raj-Venkatasomaraju
పరిచయం :
- రాజ్ -అంటే ... తోటకూర వెంకటసోమరాజు మంచి సంగీత దర్శకుడు .ఈయన సుప్ర సిద్ద సంగీత దర్శకుడు టి.వి.రాజుతనయుడు,సాలూరు రాజేశ్వరరావు ,చక్రవర్తి అనే ఇద్దరు సంగీత సామ్రాట్ ల ప్రియ శిష్యుడు , రాజ్ -కోటి కాంబినేషన్లో మంచి సంగీతాన్నీ అందించారు.
- పేరు : రాజ్ ,
- పూర్తి పేరు : తోటకూర వెంకతసోమరాజు ,
- స్వస్థలం : రఘుదేవపురం - రాజమండ్రి దగ్గర ,
- పుట్టిన స్థలం : చెన్నై '
- పుట్టిన తేది : 27 జూలై 1957 ,
- నాన్న పేరు : తోటకూర వెంకటరాజు , సంగీత దర్శకుడు 50 సం.వయసు లోనే (20 ఫిబ్రవరి 1973) చనిపోయారు .
- అమ్మ పేరు : సావిత్రి .
- అన్నయ్య :సూర్యనారాయణ రాజు ,
- చదువు : ఇంటర్మీడియట్ -- , పియానో, వైయిలేన్ , కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు ,
- నాన్న గారు చనిపోయిన తరువాత కొన్నాళ్ళు సాలూరు హనుమంతరావు (సాలూరి రాజేశ్వరరావు గారిఅన్నయ్య)దగ్గర , కొన్నాళ్ళు యస్.పి. కోదండ పాణి దగ్గర తరువాత సాలూరి రాజేశ్వరరావు దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ గా పనిచేసారు . కొన్నాళ్ళు మలయాళీ సంగీత దర్శకుడు 'మాస్టర్ దేవరాజ్' దగ్గర ఉన్నారు . 1983 మొదటి గా రాజ్-కోటి కాంబినేషన్ లో డైరెక్టర్ అయ్యారు . ఎన్నో సినిమాలకు సంగీతాన్నీ అందించారు. సుమారు ౩౩౦ సినిమా లకు సంగీతాన్నీ అందిచారు 17 సినిమాల లో నటుడిగా చిన్న చిన్న పత్రాలు వేసారు .
- ప్రళయ గర్జన ,
- సంసారం ,(శోబన్ బాబు హీరో గా ),
- నా పిలుపే ప్రభంజనం ,(కృష్ణ గారు హీరో గా),
- యముడికి మొగుడు (చిరంజీవి హీరో),
- పోకిరి రాజు ,
- ఆస్తి మూరెడు -ఆశ బారడు ,
- మైసమ్మ ఐ.పి.యస్.,(విలన్ గా ),
- 1977 -తమిళ సినిమా (శరత్ బాబు హీరో),

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog