వాహిని కుమారి , Vahini Kumari



  •  
  • ---------------------------------------- 
  •  
పరిచయము : 
  • వాహిని కుమారి పాతకాలపు తెలుగు సిని నటి . ' వాహినీ ' కుమారిగా ప్రసిద్ధి చెందిన రాజకుమారి.......మద్దెల నాగరాజకుమారి గత తరం ప్రేక్షకులకు అప్పటి నటీమణులలో చిరపరిచితమైన పేరు. 'దశావతారాలు ' ఈమె మొదటి ఫిల్మ్ , ఈ సినిమాలోమూడు పాత్రలు పోషించినది , లక్ష్మి ,సీత , యసోధర ,. ఈమె రెండెవ సినిమా - అమ్మ(1939). 1940 లో ఈమె వాహిని పిచర్స్(Vahini picturs) లో ప్రవేశించినది . అప్పటి నుండి , వాహిని కుమారి గా పిలువబడేది .
బయోగ్రఫి :
  • పేరు : వాహిని కుమారి .
  • అసలు పేరు : మద్దెల నాగ రాజ కుమారి .
  • పుట్టిన స్తలం : తెనాలి .
  • తండ్రీ : వెంకటేశ్వరరావు ,
  • తల్లి : రామామణి ,
  • భర్త : భాష్యకార్లు గారు .
  • కొడుకు : గంగాధర్ .(ఒక్క సంతానమే)
  • నివాసము ; విజయవాడ .
  • మరణము : 2009 మార్చి 3 న స్వర్గస్తులయ్యారు.   .
 కెరీర్ (career) :
  • తెనాలికి చెందిన మద్దెల నాగరాజకుమారి అందం 1934 లోనే సి. పుల్లయ్య గారి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోను, వేల్ పిక్చర్స్ వారి ' సీతాకళ్యాణం ' చిత్రంలోనూ అవకాశాలు వెదుక్కుంటూ వచ్చేటట్లు చేసింది. అయితే నటన, చిత్ర పరిశ్రమ అంటే భయపడ్డ ఆమె తల్లి వాటిని తిరస్కరించింది. 1937 లో ఒక బంధువు ప్రోద్బలంతో ' దశావతారాలు ' చిత్రానికి జరిగిన సెలక్షన్లో కుమారి ఎంపికయ్యారు. తోలి చిత్రంలోనే లక్ష్మి, సీత, యశోధర పాత్రలు ధరించి త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత 1939 లో ' అమ్మ ' , ' ఉష '  అనే చిత్రాల్లో నటించారు. అయితే ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ' ఉష ' ఘోరంగా పరాజయం పాలైంది.

    ఇక కుమారి గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టం..... వాహినీ పిక్చర్స్ లో అడుగుపెట్టడం. వితంతు పునర్వివాహం ప్రధానాంశంగా వాహినీ వారు 1940 లో నిర్మించిన ' సుమంగళి ' లో ఆమె పోషించిన కథానాయిక పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. తర్వాత వాహినీ వారు పతిత జనోద్దరణ ప్రధానాంశంగా నిర్మించిన ' దేవత ' చిత్రం ఆమెను వాహినీ కుమారిని చేసింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం తర్వాత అయిదేళ్లపాటు ఆమె కనుమరుగైపోయింది.
    మళ్ళీ 1946 లో ఘంటసాల బలరామయ్య గారి ' ముగ్గురు మరాటీలు ' చిత్రం ద్వారా పునః ప్రవేశం చేసారు. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఆ తరవాత కుమారి కొండచిలువతో పోరాటాలు వగైరా సాహసాలు చేసిన ' మాయపిల్ల ' ( 1951 ) పరాజయం పాలయ్యింది. ఇంకా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచన చేసిన ' ఆకాశరాజు ' చిత్రంలో గౌరీనాథశాస్త్రి గారి సరసన నటించారు. ఇలా ఆమె నటించిన బయిట చిత్రాలలో కొన్ని పరాజయం పొందగా, మరికొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి.

    మళ్ళీ వాహినీ వారి ' మల్లీశ్వరి ' చిత్రంలో రాణి తిరుమలదేవి పాత్ర కుమారికి మరోసారి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో కుమారిది చిన్న పాత్రే అయినా ఆమెకు వాహినీ కుమారి అనే పేరును శాశ్వతం చేసింది. ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లో నటించిన కుమారి 1958 లో మద్రాస్ వదలి విజయవాడ కొచ్చి స్థిరపడ్డారు. శేష జీవితం బెజవాడ లోనే గడిపి 2009 మార్చి 3 న స్వర్గస్తులయ్యారు. 

     

నటించిన సినిమాలు :
  • దశావతారాలు
  • 'అమ్మ' (1939)
  • సుమంగళి'
  • దేవత
  • 'ముగ్గురు మరాటీలు'
  • 'మల్లీశ్వరి'
  • చిన్న కోడలు (1952),
  • పెంపుడు కొడుకు (1953),
  • కాళహస్తి మహత్యం (1954).

  • =================================
visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)