లత మంగేష్కర్ పాడిన
తెలుగు పాట :
- నిదుర పోరా తమ్ముడా -సంతానం (ఫిల్మ్) - Singer(s)=లత మంగేష్కర్ -S దక్షిణ మూర్తి -అనిసెట్టి(Music Director) - పినిసెట్టి ( Lyricist ) - 1955 (year).
సంగీత లత జీవనప్రస్థానం :
అపర గానామృతవర్షిణి అయిన లతామంగేష్కర్
- పుట్టిన ఊరు : మధ్యభారతదేశపు కేంద్రమైన ఇండోర్ లో
- పుట్టిన తేది : సెప్టెంబర్ 28, 1929 న సంప్రదాయ మహారాష్ట్రీయ కుటుంబంలో జన్మించారు.
- తండ్రి : దీనానాధ్ మంగేష్కర్ సంప్రదాయ సంగీతకారుడే కాక, రంగస్థల కళాకారుడు.
- తల్లి : శుద్ధమతి దీనానాధ్ కు రెండవభార్య.
- యింటిపేరు : హర్దీకర్ అయితే, స్వగ్రామైన పేరు మంగేషి (గోవాలోని గ్రామం) పేరును సార్ధకం, అభిమానం జోడించి చేర్చుకోవడం జరిగింది.
- లత అసలు పేరు : "హేమ", కాని తన తండ్రిప్రదర్శించే నాటకం - బాన్ బంధన్ - లో ఒక పాత్ర "లతిక" ప్రభావంతోహేమ, లతగా మారింది. అప్పటినుండి, భారతీయసంగీతకళాజగతికి లత గానే సుప్రసిద్ధం.
- కుటుంబము : కుటుంబానికి లత - జ్యేష్ఠసంతానమైతే, హృదయనాధ్, ఆశ, ఉష, మీనా లు - సోదరుడు, సోదరీమణులు.
చదువు - సంగీత కళాభ్యాసం
- తొలి గురువులు తల్లితండ్రులు. అలాగే, లత సంగీత శిక్షణ పొందింది తొలిపర్వంగా తండ్రినుంచే. మహారాష్ట్రలో స్థిరనివాసంచేసుకున్న లత, ఐదేళ్ళ వయసులోనే తండ్రి సంగీతరూపక నాటకాల్లో నటించేది. దీనానాధ్ ప్రతిభతో చెప్పినసంగీతపాఠాలు, లత మనసులో గొప్ప ప్రభావాన్ని కలిగించాయి. అంతే కాక, ప్రముఖ సంగీతకారుడు కె.యల్.సైగల్పాటలంటే లతకు అమిత ప్రాణాభిమానాలు. ఆమెకు మార్గదర్శి, స్ఫూర్తిమూర్తి. నమ్మడానికి వీలులేని, ఆమె చదువుపాఠశాలకు వెళ్ళినది, తొలిరోజు, ఆఖరిరోజు - కేవలం ఒకే ఒక రోజు. ఆరోజు కూడ, పిల్లలకు సంగీతం, పాటలు నేర్పిందిట. ఉపాధ్యాయురాలు, కల్పించుకుని లతను నిరోధిస్తే, ఈ కళాకారిణికి చాలా కోపం రావడమే కాక, తిరిగి చదువు నిమిత్తంపాఠశాలకు వెళ్ళనేలేదట. ఆమె పదమూడేళ్ళ ప్రాయంలో, గుండెపోటు కారణంగా తండ్రిని పోగొట్టుకుంది. మంగేష్కర్కుటుంబంతో సన్నిహితుడైన మాష్టర్ వినాయక్ దామోదర్ కర్ణాటకి ఈ కుటుంబాన్ని ఆదుకోవడమే కాక, నవయుగచిత్రపఠ్ సంస్థకు యజమాని, ప్రముఖ హిందీ చలనచిత్ర నటి నందాకు తండ్రి. లతా మంగేష్కర్ తన వృత్తికి దామోదర్చాలా దోహదపడ్డాడు. లత సోదరసోదరీమణులకు కూడ సహాయకారి అయ్యాడు.
దిష్టి తొలగిన మొదటి పాట
- జీవనోపాధికోసం హిందీ, మరాఠీ చిత్రాల్లో చిన్నపాత్రలను, హాస్యపాత్రలనూ ధరించడం జరిగినా, మొదటి చిత్రం 1942 లోని వినాయక్ రామ్ మరాఠీ చిత్రం - పహలీ మంగళగౌర్ లో పాత్రను ధరించడం జరిగింది. మొట్టమొదటగా, దాదాచందేకర్ సంగీతస్వరబద్ధతలో నాధ్ చైత్రాచి నవలాయ్ లో పాటను పాడడం జరిగింది. అయితే, అంతకు పూర్వమే నాచుయా గాడె ఖేలు సారీ మనీ హస్ భరీ పాట సదాశివరావు నెవ్రీకర్ సంగీతరచనలో కితీ హసాల్ మరాఠీచిత్రం (1942)లోవసంత్ జోగ్లేకర్ నిర్మాణంలో పాడడంజరిగినా, అది చిత్రంలో కనుమాయ అయింది. లత మొదటి హిందీ చిత్రగీతం - మాతా ఏక్ సపూత్ కీ దునియా బదల్ దే తు అన్న మరాఠీ చిత్రం గజబహు(1943). ఈ పాటతో లతకు కలిగినదురదృష్టం, దృష్టి తొలగిపొయాయి.
చిత్రజగతి - ముంబైకు తరలింపు
- 1945 లో వినాయక్ నాటకసంస్థతో పాటు లత కూడ బోంబేకు నివాసం మారడం, ఉస్తాద్ అమానత్ అలీఖాన్ వద్దహిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకోవడం, అమె మొదటి హిందీచిత్రగీతం - పా లాగూం కర్ జోరీ పాటని దత్త దావ్జీకర్స్వరపరచడం, వసంత్ జోగ్లీకర్ చిత్రం - వసంత్ జోగ్లేకర్ హిందీ చిత్రం(1946) - ఆప్ కీ సేవా మె అని అందరూ చెప్తున్నవిషయమే. పాడిన పాటతో పాటు, లత, ఆశ చిన్నపాత్రల్లో నూర్జహాన్ తో నటించారు. వినాయక్ రామ్ మొదటిహిందీచిత్రం బడీ మా(1945) ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది. మాతా తేరే చరణోం మే అన్న భజనను లత గానం చేయగా, ఆమెసోదరి ఆషా పై చిత్రించారు. సరిగ్గా, యిదే సమయంలో లతను ప్రసిద్ధ సంగీతదర్శకుడు వసంతదేశాయ్ పరిచయభాగ్యం. వినాయక్ రెండవ చిత్రం సుభద్ర(1946)సమయంలో కలిగింది. ఉస్తాద్ అమానత్ అలీఖాన్ దేశవిభజన మూలానపాకీస్తాన్ కు తరలి వెళ్ళడం, అమానత్ ఖాన్ దేవస్వాలె వద్ద సంప్రదాయ సంగీతాన్ని అభ్యసించారు. అంతేకాక, పండిట్తులసీదాస్ శర్మ - ఉస్తాద్ బడే గులాం ఖాన్ శిష్యుడు - వద్ద శిక్షణను పొందారు. వినాయక్ 1948లో మరణించాక, సంగీత దర్శకుడు గులాం హైదర్ లతామంగేష్కర్ లోని సంగీతకళకు గురుత్వం వహించారు. ఆనాటి హిందీచలనచిత్రరంగంలో ప్రముఖంగా నూర్జహాన్, సంషద్ బీగం, జొహ్రబాయి అంబాల్ వలి వర్ధమానదశలో ఉన్నారు. నిర్మాతశశధర్ ముఖర్జీ చిత్రం షహీద్ (1948) నిర్మాణంలో లతను హైదర్ పరిచయం చేయడం జరిగినా, లత గళసౌరభాన్నిఆయన చాలా మందగతి స్వరం అని కొట్టి పారవేశాడు. ఈ సమాధానానికి హైదర్ కు తీవ్రకోపం వచ్చి, రానున్నముందుకాలంలో చిత్ర నిర్మాతలు, దర్శకులు లతామంగేష్కర్ కాళ్ళపై పడతారని, వారి చిత్రాల్లో పాటలు పాడవలసిందిగాబతిమాలతారని చెప్పిన జోస్యం అబద్ధం కాలేదు సరిగదా, తీవ్రతరమైన నగ్యసత్యం. చివరగా లతకు ఒకమైలురాయిగామజబూర్ (1948) చిత్రంలోని దిల్ మేరా తోడా అన్న పాట మళ్ళీ లతకు వెన్నకి తీసుకోవాలసిన పరిస్థితిఎదురవ్వలేదు. మొదటగా, నూర్జహాన్ ను లత అనుసరించిందనీ, అతి తక్కువకాలంలోనే లత తనదైన శైలినిఅలవరచుకొందని విజ్ణులు చెప్పుతారు. లత పాటలు పాడేటప్పుడు, మహారాష్ట్రభాషలోని యాస, మాండలిక స్వరాలువినిపిస్తున్నాయని, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్. ఈ వ్యాఖ్యను తీవ్రంగా తీసుకున లత ఉర్దూభాషని మౌల్వి - షఫి - అభ్యసించారు. హిందీచిత్రాల్లోని హిందూస్తానీశైలి (హింది-ఉర్దూ) చిత్రగీతాలను ఆనాడు ఉర్దూ పండితకవులురచించేవారు. 40 దశకాంతంలో ప్రముఖ సంగీతదర్శకులంతా లతామంగేష్కర్ కు అవకాశాలు యివ్వడంఅధికమయ్యాయి. మొదటి లతాప్రభంజన వీచికలని కలిగించింది - ఖేమ్ చంద్ ప్రకాశ్ సంగీతదర్శకత్వంలో, మధుబాలపై చిత్రించిన ఆయేగా ఆనేవాలా అన్న మహల్ (1949)లోని పాట. ఈ చిత్రం మధుబాలకు, మంగేష్కర్ కు కూడ తొలిప్రభంజనంగా చెప్పుకోవాలి. ఈ విధంగా లతా మంగేష్కర్ చిత్రగీతకళాజీవనప్రస్థానం అధ్బుతంగా ప్రారంభమైంది.
గానకోకిల లత గాయకురాలిగా ఆమె సంగీతప్రస్థానంలోని ముఖ్యసంఘటనల్లో -
మచ్చుకు కొన్ని:
- - అనిల్ బిశ్వాస్, శంకర్-జైకిషణ్, నౌషాద్, యస్.డి.బర్మన్, సి.రామచంద్ర, హేమంతకుమార్, సలీల్ చౌధరీ లాంటిఉద్దండ సంగీతదర్శకుల ఆధ్వర్యంలో లత మధురాతిమధురమైన స్వరసంగీతలహరితో ఓలలాడించారు.
- - సంప్రదాయబద్ధమైన సంగీతరాగాలతో సృష్టించిన ఆనాటి ఆపాతమధురగీతాలను - నౌషాద్ స్వరగంగాఝరితో - బైజూబావరా, ముఘలాయిజం, కోహినూర్ చిత్రాలనే చెప్పాలి. నౌషాద్ అందించిన లత మొదటి పాట ఏ చోరే కీ జాత్ బడేబేవఫా ఈనాటికీ హిందీచిత్రగీత ప్రేమికులను వెంటాడుతూనే వుంటుంది.
- - నేపథ్యగాయనిగా శంకర్ జైకిషన్ రమారమి అన్ని చిత్రాల్లో లత పాటలు మనకు కనిపిస్తాయి - ప్రత్యేకంగా రాజకపూర్చిత్రాలు - ఆగ్, ఆహ్, శ్రీ 420, చోరీ చోరీ.
- - సచిన్ దేవ్ బర్మన్ లతలోని ప్రతిభను వెలికితీసి చిత్రజగతికి, సజా, హౌస్ నం. 44 మరియు ప్రముఖచిత్రం - దేవదాస్. అయితే, యిద్దరిమధ్య సమస్యలు రావడం ఒక ఐదేళ్ళకాలంపాటు (1957-1962) లతకు బర్మన్ చిత్రాల్లో విరామందొరికింది. బర్మన్ మాత్రం, ధైర్యంగా గీతాదత్త్, లత సోదరి ఆశాభోంస్లే చేత పాటలు పాడించి రాణించారు కూడ.
- - ఎవరి గూడు వారు కూడగట్టుకునే ప్రయత్నంలో, లత, ప్రముఖ సంగీతదర్శకుడు సలీల్ చౌధరీ ప్రోత్సాహంలోకొనసాగడం, ప్రముఖమైన పాట - ఆజారే పరదేశీ అన్న మధుమతి చిత్రానికి మొదటి ఫిల్మ్ పురస్కారం (1958) లభించింది. ప్రతిభకు పురస్కారాన్ని పొందడానికి ఒక దశాబ్దకాలం లతకు ఆగవలసివచ్చింది.
- - ఈ సంగీత ప్రస్థానం లత ను అత్యున్నత పురస్కారమైన భారతరత్న (2001) వరకూ తీసుకెళ్ళడంపట్ల ఆమెఅమర్చుకున్న ప్రతిభాసిగలో సొగసులు, సొబగులు, వర్ణనాతీతమనే చెప్పాలి.
- - ఈ ఏడాది జూన్ లో విడుదలైన సాద్గీ జావేద్ అక్తర్ అద్భుత రచనలు, మయురేష్ పాయ్ స్వరరచనతో లత గజల్గానంతో అభిమానులను ముంచెత్తింది.
కేవలం చిత్రాల్లో పాటలే కాదు - యింకా మరెన్నో
- సంగీత దర్శకత్వం వహించినవి - మరాఠా తితుక మేల్వవ, మోహిత్యాంచి మంజుల, సధి మనసే, తంబడిమతి చిత్రాలు.
మహరాష్ట్ర ప్రభుత్వంనుంచి ఉత్తమ సంగీత దర్శకత్వంలో పురస్కారం (సాధీ) వచ్చింది.
- నటనలో కూడ కనబరచిన ప్రతిభగానం, సంగీతదర్శకత్వంతోపాటు, లత తన ప్రతిభను నటనలో కూడ కనబరచింది. 1942-48 మధ్య కాలంలో, పహ్లి మంగళగౌర్, చిముక్ల సంసార్, మాఝే బాల్, గజభౌ మరాఠీ చిత్రాలతో పాటు, బడీ మాహిందీ చిత్రం, జీవన్ యాత్ర, సుభద్ర, మందిర్ చిత్రాల్లో కూడ నటించి, మెప్పు పొందారు. 1952 లో హింది - మరఠీ భాషల్లోచత్రపతి శివాజీ చిత్రంలో అతిధి పాత్ర-పాటలో కనిపించి రాణించారు. ఏక్ తూహీ బరోసా అన్న పుకార్ చిత్రంలోని పాటలోకుడ అతిధి పాత్ర-పాట లో దర్శనమయ్యారు.
చిత్ర నిర్మాణంలో కూడ
- వాదల్ (మరాఠీ), సంగీతదర్శకులు సి.రామచంద్రతో సహనిర్మాణంలో జంఝర్ (1953), కాంచన్ (హిందీ - 1955) చేపట్టారు. తిరిగి చాలాకాలం తర్వాత, లేకిన్ (హింది - 1999) చిత్రం నిర్మించి, విజయం సాధించారు.
ప్రతిభకు నీరాజనాలు, పురస్కారాలు
- పద్మభూషణ్ (1969), పద్మవిభూషణ్ (1999),
- దాదాసాహెబ్ ఫాల్కె (1989) మరియు
- భారతరత్న (2001),
- మూడుజాతీయ చిత్ర పురస్కారాలు. కేవలం బెంగాలీ చిత్ర పత్రికాకారుల సంఘం తరఫునుంచే 12 హుమానాలుగెలుచుకున్నారు. ప్రత్యేకంగా గుర్తించవలసినది - యువకళాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో, 1969 లోవచ్చిన ఉత్తమ ఫిల్మ్ ఫేర్ గాయని బహుమానాన్ని మర్యాదతో వలదన్నారు. లత బహుమానాన్ని తప్పించుకున్నా, బహుమానం మాత్రం లతని వెంటాడడం మానలేదు. ఫలితంగా 1993 లో ఫిల్మ్ ఫేర్ జీవితకాల పురస్కారాన్నిస్వీకరించక తప్పలేదు.
- మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1984 లో లతామంగేష్కర్ పేరున లతామంగేష్కర్ పురస్కారం, మహారాష్ట్ర ప్రభుత్వం 1992 లోనుస్థాపించడంతో వచ్చిన మార్పులు స్వాగతించదగ్గవి.
ప్రతిభ తో పాటు - కొన్ని వాదాలు, వివాదాలు.
- ప్రతిభ, పాటవం విలసిల్లుతున్న ఏ రంగంలో నైనా, అసూయలు, ద్వేషాలు సర్వసామాన్యంగా మారిపోతున్న స్థితిగతులు. ఈ తీరుతెన్నులు కళారంగానికీ తప్పలేదు కదా, కొంచెంపాళ్ళు ఎక్కువే అని చెప్పాలి. ఈ భాగంగా, అధికభాగంగాచిత్రగీతాలు పాడిందని లతామంగేష్కర్ ని 1974 లో ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం, వాదోపవాదాలమధ్య 1991 లో ఆ విషయాన్ని తీసివేయడం జరిగింది.
వాదనలున్నా - వాదనచేయలేని ప్రతిభాకళాకారిణి
- తనదైన గానమాధురీశైలితో విశ్వాన్ని ఆరు దశాబ్దాలకు పైగా విశేషమైన సంగీతసాగరాన్ని ఓలలాడిస్తున్న విద్వన్మణి, గానకోకిల, భారతీయ నైటింగేల్, వివాదస్పదంగా లతామంగేష్కర్ అన్నది మాత్రం నూటికి నూరుపాళ్ళు - సత్యం, శివం, సుందరం.
- లత సోదరీమణి ఆశాభోంస్లే కుడ సమజోడిగా చెలామణి అవ్వడం, వారిద్దరూ బాహ్యప్రపంచానికి సయోధ్యాపూరితప్రేమానురాగాలు పంచుకున్నా, ఉభయత్రా వారి వృత్తి, ప్రవృత్తిలు తరచు కలహించుకుంటాయి అన్న భావన కూడచిత్రమాధ్యమంద్వారా విచిత్రమైన వార్తలు వస్తూనేవున్నాయి.
త్రివేణేసంభూతమైన సంగీతకళకు సోదరీమణుల సేవలు
- చాలాకాలంపాటు మంగేష్కర్ సోదరీమణులు - లత, ఆశ, ఉష లు త్రివేణీసంగమంగా సంగీతకళకు అజరామరమైనసేవలను అందించి భారతీయ కళాసంస్కృతీవైభవానికి మరింత వన్నె తెచ్చారన్నది మాత్రం, సత్యం, వాస్తవం, నిజం. అతిశయోక్తిలేని అలంకారం.
యిద్దరే యిద్దరు - గానమాధురీకోకిలలు
- భారతదేశంలో యమ్.యస్. సుబ్బలక్ష్మి తర్వాత, చెప్పాలంటే తిరిగి లతామంగేష్కర్ కే భారతరత్న - అత్యున్నతపురస్కారాన్ని సాధించుకున్నారు. సంప్రదాయేతర సంగీతరంగంలో, సంప్రదాయతను పుణికిపుచ్చుకున్న ఏకైకకళాకారిణి లతామంగేష్కర్ అని మాత్రం చెప్పక తప్పదు. యింతవరకు పద్మవిభూషణ్ తర్వాత ఉన్నతమైన పురస్కారంవేరే ఎవ్వరినీ వరించలేదు అంటే, లతామంగేష్కర్ ప్రతిభాపాటవాలకు వేరే సంజాయిషీలు, వివరణలు, సవరణలుఅవసరం లేదు, రాదు.
- లతామంగేష్కర్ జయంతి సందర్భంగా భారతీయకోకిల మరిన్ని సరసస్వరసురఝరీగమనవీధుల్లోకి సంగీతకళను, ఈకళతోపాటు సంగీతప్రేమికులను, రసికులను తనవెంట తీసుకెళ్ళే ప్రస్థానప్రయత్నంలో భగవంతుడు ఆయుషుని, సుప్రసన్నతని చేకూర్చమని వేడుకుంటూ, ఈ భావరాగతాళసమన్వితమైన ఈ కళకు, కళాకారిణికి నీరాజనాలుతెలుగుజర్నల్ సమర్పిస్తూంది.
(source:www.telugujournal.com)