పరిచయం :
- 1958లో ‘శోభ’ చిత్రంతో సినీకెరీర్ ప్రారంభించిన రావి కొండలరావు , నటుడు , రచియిత మరియు నిర్మాత , పెళ్ళిపుస్తకం , బృందావనం , వరకట్నంమున్నగునవి ఈయన సాహస క్రుత్యాలలో ముఖ్యమైనవి . బహుముఖప్రజ్ఞాశాలి అనే పదానికి సరిగ్గా సరిపడే ప్రతిభా వంతుడు రావి కొండలరావు. నాటకం, సినిమా, టీవీ, పత్రిక ఇలా రంగం ఏదైనా అన్నిటా..ఆయన మార్క్ ఏనాడో పాదుకొంది. నటన, దర్శకత్వం, రచన, మిమిక్రీ..ఇలా బహుముఖ కళల్లో ఆరితేరిన నిపుణుడిగానూ సుప్రసిద్ధుడు. వయసు వజ్రోత్సవం పూర్తిచేసుకున్నా..ఆయనలోని హుషారే వేరు. ముఖ్యంగా తెలుగు సినిమాకి కొండంత అండ కొండలరావు. సినీ కెరీర్ అర్థసెంచరీ దాటి నేటికీ దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది
బయోగ్రఫి :
- పేరు : రావి కొండలరావు ,
- పుట్టిన తేది : ౦/౦/1931.
- పుట్టిన స్థలం : సామర్లకోట --తూర్పుగోధావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ , ఇండియా . వీరి నాన్నగారి పోస్టింగ్ చివరగా శ్రీకా కుళం కావడంతో కొండలరావు కుటుంబం దాదాపు అక్కడే స్థిరపడింది. అన్నయ్య ఏకపాత్రా భినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు చేయడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించ డం, చిన్నచిన్న కథలు రాయడం..ఇలా కొండలరావు పిన్నవయసు గడిచిపోయింది.
- భార్య : రాధాబాయి --సినిమాల్లో నటిస్తుండగానే రాధాకుమారి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మనువాడి ఆదర్శ జంటగా నిలిచారిద్దరూ. రాధాకుమారి రావి కొండలరావుకి అన్నివిధాలా తగిన సహచరి. ఎంతో ప్రతిభ కలిగిన నటీమణి. నేటికీ సినిమా, టీవీ, నాటకరంగాల్లో బిజీ ఆర్టిస్టు. ఆమె జన్మించినది విజయనగరంలో. స్ర్తీలు ఎక్కువగా నాటకాల్లో వేషాలు వెయ్యని ఆ రోజుల్లోనే తన చిన్నతనంలో నటిగా కృషిచేయడం ప్రారం భించారు. క్రమంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా అనేక సాంఘిక, పౌరాణికాల్లో నటించారు
- నాన్న : పోస్ట్ మాస్టర్ ,
- తోబుట్టువులు : అన్నయ్య .. ఆర్.కె.రావు ,
- నివాసము : హైదరాబాద్ , టి.వి.సీరియల్స్ లో పని.
అవార్డ్స్ & ముఖ్య విషయాలు :
- కళాప్రపూర్ణ అనే బిరుదు వచ్చింది .
- ముసికాల్ కంపెని -- సుకుమార్ ఆర్కెస్ట్రా .
- ఎడిటర్ -- తెలుగు మేగాజిన్స్ - జ్యోతి ,వనితా , ఫిల్మ్ మగజైన్ " విజయ చిత్ర " చిత్రవల్లియం .
ఫిమోగ్రఫి :
Actor:
- 1. మీ శ్రేయోభిలాషి (2007) .... Raghuram
- 2. నిన్నీ ఇష్ట పడ్డాను (2003)
- 3. శ్రీ కృష్ణార్జున విజయం (1996)
- 6. పెళ్లి పుస్తకం (1991) .... బాబాయ్- ... aka Book of Marriage
- 7. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991)
- 8. చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం (1989)
- 9. సాహసం చేయరా డింభకా (1988)
- 10. చంటబ్బాయి (1986) .... Chiranjeevi's Boss
- 11. మంత్రిగారి వియ్యంకుడు (1983) .... రావులపాలెం రామభద్రాయ- ... aka The Minister's In-Laws
- 12. ఊరికి ఇచిన మాట (1981)- ... aka Promise Made to Our Village (India: English title)
- 13. రాధా కళ్యాణం (1981)- ... aka The Marriage of రాధా- ... aka Wedding of Radha (India: English title)
- 14. సొమ్మొకడిది సోకొకడిది (1978)
- 15. అందాల రాముడు (1973)- ... aka The Handsome Rama
- 16. దసరా బుల్లోడు (1971) .... Pellilla Perayya
- 18. శ్రీ కృష్ణ విజయం (1970)
- 20. ప్రేమించి చూడు (1965)
- 21. శోభ (1958) .... డాక్టర్
బంగారు పంజరం (1965)
Writer:
- 1. భైరవ ద్వీపం (1994) (dialogue)- ... aka Veera Pratap (India: Tamil title: dubbed version)
- 2. బృందావనం (1992) (dialogue)
- 3. పెళ్లి పుస్తకం (1991) (story)- ... aka Book of Marriage
తన మాటల్లో దాంపత్య జీవితము :
- ఆమెకి నేనిచ్చే నివాళి అదే!
మొదట్లో నా పేరు కొండలరాయుడు. స్కూలు రిజిస్టర్లో రెండోక్లాసు వరకు అదే పేరు. కాని ఎలా మారిపోయిందో మరి, కొండలరావు అయింది. అలాగే ఆమె పేరు రాధాలక్ష్మి. రాధాకుమారి అని పెద్దవాళ్లే మార్చినట్టున్నారు. ఆ పేరుతోనే నాటకాల్లో నటించింది.
ఆమె ఎవరో నాకు తెలీదు. విజయనగరం రాఘవ నాటకోత్సవాల్లో ఆత్రేయగారి 'గుమాస్తా' నాటకం చూశాను. నేను ప్రేక్షకుల్లో, ఆమె రంగస్థలం మీదా. 'ఎవరామె?' అని అడిగితే చెప్పారు. ఆ సంవత్సరం ఆ పాత్రధారణకి ఆమే ఉత్తమ నటిగా ఎన్నికైంది. మేం శ్రీకాకుళం నుంచి వచ్చి ఒక నాటిక వేశాం ఆ పోటీల్లో. ఆ నాటిక ఆమె చూసినట్టులేదు. ఇదంతా జరిగింది 1952-53ల్లో. మళ్లీ 54లో అదే పోటీలకు వెళ్లాం. అప్పుడు కూడా ఆమే ఉత్తమనటి. నాటకం 'విచిత్ర జీవులు'. మా అన్నయ్య ఆర్.వి.చలం (జెమ్‌షెడ్‌పూరు) బృందంలో వచ్చింది. అప్పుడు కూడా ఒకరికి ఒకరం పరిచయం కాలేదు. 1956లో నేను మద్రాసు వెళ్లిపోయాను. 57లో నా 'కుక్కపిల్ల దొరికింది' ప్రదర్శిస్తే విజయనగరం వెళ్లాను. మా అన్నయ్య బృందంతో 'ఫణి' నాటకంలో ఆమె నటించింది. మూడు నాటకాల్లో ఆమెని చూశాను. రాను రాను పరిపక్వత చెందుతున్నట్టు కనిపించింది.
శివం అని, విజయవాడ కథా రచయిత. నాకు మిత్రుడు. అతను రాసిన 'నేరమూ శిక్ష'లో ఆమె నటించిందట. అంచేత అతను 57లో విజయనగరం వచ్చినప్పుడు, నాటకం అయిన మర్నాడు ఆమె ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి, నన్నూ రమ్మంటే వెళ్లాను. నన్ను ఆమె ఎరగదు. నేను మాత్రం ఎరుగుదును. అభిమానిగా ప్రశంసించాను. అప్పుడు నేను సినిమా దర్శకత్వశాఖలో పనిచేస్తున్నాను. ఆమె అడిగితే ఆమాట చెప్పాను.
జె.వి. సోమయాజులు, రమణమూర్తి బృందం 'పంజరం' నాటకం ప్రదర్శించేవారు. అందులో నేనూ నటించేవాడిని. అప్పుడు నిర్మలది (నిర్మలమ్మ) నాయిక వేషం. తర్వాత సినిమాలవల్ల ఆమెకి కుదరకపోతే, రాధాకుమారిని తీసుకున్నారు. అప్పుడు మాకు పరిచయం ఎక్కువైంది. నేను సినిమాల్లో ఉన్నాను గనక, తనకి ఆ ఉత్సాహం ఉన్నట్టు చెప్పింది. మంచినటే! కాని నావల్ల ఏమవుతుంది? ఆమె తండ్రిగారికి ఇంకా ఉబలాటం. నాకు ఉత్తరాలు రాసేవారు ''ఫలానా కంపెనీ మొదలవుతోంది కనుక్కోండి'' లాంటివి. ఆమె కంఠం బాగుంటుంది. ఉచ్ఛారణ బాగుంది. పలుకులోనూ స్వచ్ఛత ఉంది. ముందుగా నావల్ల సాధ్యమయ్యే పని డబ్బింగ్ చెప్పించడం. 'ముగ్గురు వీరులు' (1959) సినిమాలోని రెండోనాయికకి డబ్బింగ్ చెప్పడానికి రమ్మన్నాను. వచ్చింది. డబ్బింగ్ ఎలా చెప్పాలి, విధానం ఏంటి చూపించాను. మా అమ్మ, నేను, తమ్ముడూ ఉండేవాళ్లం. మా అన్నయ్య నాటకాల్లో నటించింది గనక అమ్మకి ఆమె తెలుసు. ఆమె, వాళ్ల నాన్నగారు మాఇంట్లోనే దిగారు. 'ముగ్గురు వీరులు' తర్వాత, నేను డబ్బింగ్ ప్రయత్నాలకి తీసుకెళ్లేవాడిని. వాళ్ల నాన్నగారు వేషాల ప్రయత్నం ప్రారంభించారు.
''ఇద్దరు కలిసితిరగడం చూసిన వాళ్లకి బాగుండదు. తలోమాటా అంటారు'' అన్నారు మిత్రులు. అయితే మా మధ్య ఏ భావాలూలేవు. (ముళ్లపూడి వెంకటరమణ 'కోతి కొమ్మచ్చి'లో ఈ ఉదంతం బాగా ప్రస్తావించారు.)
- దాంతో స్వార్థం ప్రవేశించింది. అంతకుముందు స్త్రీ పాత్రలు లేని నాటికలే రాశాను, అవే ఆడుతూ వచ్చాం. స్త్రీ పాత్రలు వేసే వాళ్లకి పారితోషికాలు ఇవ్వాలి. వాళ్ల రాకపోకలకీ ఇవ్వాలి. మాకు నాటకాల మీద ఉన్న ఉత్సాహంతో, మా జేబుల్లోని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆడుతున్నాం గాని, స్త్రీ వేషధారికి ఏం ఇచ్చుకోగలం?
నా జీవితంలో ఒక నటి ప్రవేశిస్తే?- స్త్రీ పాత్రతో నాటకం రాస్తే?... వెతుక్కోనక్కర్లేదు. అంతే! 'ఐలవ్యూ'లు, శృంగార యాత్రలూ లేవు. మనసులోని మాట చెప్పాను ఆమెతో. ఏకీభవించింది. కేవలం నటనరీత్యా మేము ఒకటయ్యాం. నటనే మమ్మల్ని కలిపింది. 'మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?' అని అందరూ అడుగుతూ ఉంటారు. రెండూ కాదు. నటన! అదీ మా వైవాహిక రహస్యం!
నాలుగిళ్ల చావిడి, పట్టాలు తప్పినబండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటకాలు ముమ్మరంగా వెయ్యగలిగామంటే ఆ నటి సహకారమే! నేను రాసిన ప్రతి నాటికలోనూ ఆమె నటించింది. ఉత్తమ నటిగా చాలాసార్లు ఎన్నికైంది. సినిమా ప్రయత్నాలు ఫలించాయి. చాలా చిత్రాల్లో గాత్రం అందించింది. రేడియో నాటకాల్లో వేసింది. తొలి చిత్రం 'తేనెమనసులు' (1965) అని చెబుతుంది. అంటే అది ప్రధాన పాత్ర గనక. ముందుగా చిన్న వేషాలు వేసినవాళ్లు ఆ సినిమాలు చెప్పుకోరు. ప్రధాన పాత్ర అయితేనే చెబుతారు. రంగారావుగారిలాంటి మహానటుడు మనదేశం, పల్లెటూరిపిల్ల లాంటి చిత్రాల్లో కనిపించినా అవి లెక్కలోకి రావు. అలాగే, రాధాకుమారి 'శాంత' (1961), 'నువ్వానేనా' (1962), 'మహామంత్రి తిమ్మరుసు' (1962), 'మంచి-చెడు' (1963), 'వారసత్వం' (1964), సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. 'దాగుడుమూతలు' (1964)లో గుర్తింపు గల వేషమే. 1965లో వచ్చింది 'తేనె మనసులు' ఈ రెండు సినిమాల్లోనూ ఒకేసారి వేషాలు వచ్చాయి. రెండింటికీ కారకులు ముళ్లపూడి వారే! మా వివాహానికి ప్రేరకులూ ముళ్లపూడి వారే!
అయితే, అందరికీ ఆశలున్నట్టు ఆమెకీ మొదట్లో హీరోయిన్‌గా నటించాలన్న ఆశ ఉండేది. పోనీ సెకెండ్ హీరోయిన్. ఎలా వస్తాయి? ఎలా ఇస్తారు? ఏదో వేషం. ఏదయితేనేం సినిమా. అలా వచ్చింది. హాస్యం, శాంతం, క్రోధం, గయ్యాళి + అమాయకం అన్నీ చేసింది. 'మహామంత్రి తిమ్మరుసు'లో దేవిక దగ్గర నటించడం వల్ల దేవికకి దగ్గరైంది. ఇద్దరూ మంచి స్నేహితులు. 'వారసత్వం' నుంచి నేటి వరకూ అంజలిదేవి గారికి ఎంతో అభిమానం. ఇలాంటి అభిమానాలు చాలా సంపాదించుకుంది బహుమానాలతో పాటు.
నాటకాల నుంచి వచ్చింది గనక, నాటకం ప్రాణం. సినిమాల్లో నటిస్తున్నా నాటకాల్లో నటించడం మానలేదు. ఈ సంవత్సరం జనవరిలో 'రవీంద్రభారతి'లో నాటికలు వేశాం. ఏప్రిల్, మే నెలల్లో చెన్నై, న్యూ ఢిల్లీల్లో వెయ్యవలసి ఉంది. విడుదల కావలసిన సినిమాలు మూడో, నాలుగో ఉన్నాయి. 'మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్' అనే సినిమాలో ఆమె బామ్మ. చాలా ముఖ్య పాత్ర. ఆ సినిమాని రాధాకుమారికి అంకితం ఇస్తున్నట్టు ఆ చిత్రం నిర్మాత చలం గారు చెప్పారు.
అప్పట్లో వదిన, అక్క వేషాలు వేసింది గాని, తర్వాత తల్లే. ఆ తల్లి రానురాను 'బామ్మ'గా మారింది. 'ఒకరికి ఒకరు' నుంచి బామ్మ పాత్రలే. మధ్యలో రెండు మూడు చిత్రాల్లో తల్లి. మేము భార్యాభర్తలుగా నటించినవీ ఉన్నాయి. ఒకే చిత్రంలో ఉన్నా వేర్వేరు పాత్రలు ధరించినవీ ఉన్నాయి. ఆమె నటించినవి 450 సినిమాలకి పైగా లెక్కతేలింది. నాటకాల్లో నాకంటే సీనియర్. హైద్రాబాదు వచ్చాక నాకంటే తనే ఎక్కువ సినిమాల్లో నటించింది.
ఆ రోజుల్లో సావిత్రిగారు, సూర్యకాంతం గారు, కృష్ణకుమారి గారూ అలా చాలామంది పండగలొస్తే ఇంటి నుంచి మిఠాయిలు తెచ్చి షూటింగుల్లో అందరికీ ఇచ్చేవారు. అలా రాధాకుమారి టీవీ సీరియల్స్‌కి వెళ్లినా, సినిమా షూటింగ్స్‌కి వెళ్లినా ఏవో తీసుకెళ్లి ఇచ్చేది. (నాకా అలవాటు లేదు) దానధర్మాలు ఎక్కువే (నాకు అంత లేదు.)
నా జీవితంలోని సగభాగం వెళ్లిపోయింది. ఆ భాగం 'నటి'. భార్య కంటే ఒక నటి- నా జీవితం నుంచి వెళ్లిపోయింది. అదే నాకు లోటు. అయినా, ఆమె లేదని నిరుత్సాహపడను. నాటకాలు వేస్తాను. వేస్తేనే ఆమెకి శాంతి. అదే ఆమెకి నివాళి.
- మూలము : పాతబంగారము - ఈనాదు సినిమా పేపరు .