హంసా నందిని , Hamsha Nandini





















  •  
  • ===================================

పరిచయం :
  • హంషా నందిని - సినీ నటి అందమైన మరాటీ అమ్మడు ... టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలను కుంటున్న నటి. పూనం పేరును హంషానందినీ గా తెలుగులో చలామని అవుతుంది .
ప్రొఫైల్ :
  • పేరు : హంసానందిని -అనుమానాస్పదం షూటింగ్ టైం లో .. దర్శకుడు వంశీ గారు పూనం పేరు నుహంసానందిని గా మార్చారు ,
  • అసలుపేరు : పూనం ,
  • ముద్దు పేరు : పమ్స్ ,
  • పుట్టిన రోజు : ౦8 డిసెంబర్ ,
  • చదువు : బి.కాం ,పి.జి.డిప్లమో in హెచ్.ఆర్.యం.,
  • తొలి చిత్రం : అనుమానాస్పదం ,
  • హాబీలు : డాన్స్ ,స్విమింగ్ ,పాటలు వినడం ,
    'ప్రతిదినం నీ దర్శనం దొరకునా..' అంటూ పరిచయమైన హంసా నందిని... ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌తో ఆడిపాడింది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న 'బాహుబలి'లో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఈ ఆరడుగుల అందాల భామను తన ఇష్టాయిష్టాల గురించి అడిగితే మూడు ముక్కల్లో ఇలా చెప్పింది.

* గుర్తింపు తెచ్చిన సినిమాలు
అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు

* తీరికదొరికితే...
డాన్స్‌ చేస్తా, ఈత కొడతా, ఇంట్లో ఉన్న కుక్కలతో ఆడుకుంటా.

* చక్కని శరీరాకృతి కోసం...
బాగా నడుస్తా, పొద్దున్నే యోగా చేస్తా. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తా.

* బాగా నచ్చిన సినిమాలు
మిర్చి, అత్తారింటికి దారేది, హాలీవుడ్‌ సినిమా 'ట్రాయ్‌'.

* ఇష్టంగా చేసే పనులు
స్నేహితులతో ఛాటింగ్‌, జోక్స్‌ చదవడం, కొత్త వంటలు చేయడం.

* మీ గురించి తెలియనివి
అసలు పేరు పూనమ్‌ బర్త్‌కే. దర్శకుడు వంశీగారు నా పేరు మార్చారు. ఫన్నీ వెబ్‌ సైట్లు తెగ చూస్తా.

* అభిమాన నటులు
మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌, సమంత.

* అందం కోసం ఏం చేస్తారు?
నీళ్లు బాగా తాగుతా. పండ్ల రసాలు తీసుకుంటా. కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటా.

* ఎదుటి వాళ్లలో నచ్చేవి
మానవత్వం, నిజాయతీ, నవ్వించే గుణం.

* చేయాలనుకునే పాత్రలు
యాక్షన్‌ సినిమాలు. ఏంజెలినా జోలి చేసిన పాత్రలు. మహిళా ప్రాధాన్య మున్న చిత్రాలు.

* కాబోయే భర్త ఎలా ఉండాలి?
అందంగా ఉండాలి.
అబద్ధాలు చెప్పకూడదు.
నన్ను బాగా అర్థం చేసుకోవాలి.

* ఎప్పుడూ బ్యాగులో ఉండే వస్తువులు
ఫోన్‌, లిప్‌బామ్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌.

ఇష్టంగా తినేవి
చేప వంటకాలు, బెంగాలీ రుచులు, థాయ్‌ వంటకాలు.

* నచ్చే దుస్తులు
చీరలూ, టాప్‌లూ, చొక్కాలు.

* మీ గురించి మూడు ముక్కల్లో ...
చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటా. నిద్ర-భోజన వేళల్ని పాటిస్తా. క్రమశిక్షణ గల జీవన శైలిని అనుసరిస్తా.

హంసా నందిని నటించిన తెలుగు చిత్రాలు

  • అనుమానాస్పదం (ఆర్యన్‌ రాజేష్‌, హంసా నందిని హీరోహీరోయిన్లుగా),2007
  • 'ఒకటవుదాం' 2008
  • మోహినీ-సినిమా,
  • 'గీత' -సినిమా,
  • అధినేత (జగపతి బాబు హీరో గా),2009
  • మిర్చి , 
  • అత్తారింటికి దారేది.
source : ఆదివారం ఈనాడు --2009 జూలై 26 
  • ===========================
 Visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)