బాలచందర్-కె ,Balachandar K

పరిచయం :
  • బాలచందర్-కె - తెలుగు సినిమా దర్శకుడు , స్క్రిప్ట్ రైటర్ & ప్రొడ్యూసర్ . బాలచందర్‌ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి పిల్లగాలులను మోసుకొచ్చిన వాయుదేవుడు. హిందీ సినిమాలు కనీసం కల గనడానికికూడా భయపడే సాహసోపేతమెన ఇతివృత్తాల్నిపరమసహజంగా డీల్‌ చేసిన దర్శకుడాయన. బహుశా తెలుగులో ఆయన తొలిచిత్రం ''భలేకోడళ్ళు'' లేదా ''బొమ్మా బొరుసా''అనుకుంటా. తర్వాతతర్వాత మాస్‌ హీరోలైన కృష్ణ, రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తదితరులును పరిచయం చేసిన ఘనత బాలచందర్దే.

  • ఇక అంతులేనికథ, మరోచరిత్ర, ఇదికథకాదు, 47 రోజులు లాంటి సినిమాలలో బాలచందర్‌ పోర్ట్రే చేసిన పాత్రల గురించిచెప్పవలసిన పనేలేదు. మానవ సంబంధాలు ఇతివృత్తంగా తమిళంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. అవన్నీబాలచందర్‌, ఆయన శిష్య, ప్రశిష్యకోటి తీసినవే అయివుండడం కేవలం యాదృచ్ఛికం కాదు. బాలచందర్‌ స్కూల్‌ అంటే అదేమరి!
ప్రొఫైల్ :
  • పేరు : కైలాసం బాలచందర్ ,
  • పుట్టిన తేది : ~09-జూలై ~1930,
  • పుట్టిన ఊరు : నన్నిలం , తంజావూరు జిల్లా , తమిళనాడు .
  • నాన్న : దండపాణి కైలాసం ,
  • అమ్మ : సరస్వతి ,
  • మతము : హిందూ .. బ్రాహ్మిన్‌.
  • భార్యపేరు : రాజం , 
  • children : 2 sons and 1 daughter.కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.
  • Death : 23-Dec-2014 (84 years).
కెరీర్ : 

ఎనిమిదో ఏట నుంచే ఆయనకు సినిమా పిచ్చి, కళల పిచ్చి. అప్పట్లో అదే జిల్లాకు చెందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ సినిమాలు చూసినప్పటి నుంచీ బాల బాలచందర్‌కు సినిమా పిచ్చి పట్టుకుంది. 12వ ఏటనే ఆయన చిన్న చిన్న డ్రామాలు, నాటకాలు రాసేవారు. అలా ఆయనకు నాటకాలు వంటబట్టాయి.అన్నామలై యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన తరచూ కళాశాలల్లో నాటకాలు వేసేవారు. చదువుపూర్తయ్యాక ఆయన తిరువారూరులో కొన్నాళ్లపాటు బడిపంతులుగా పనిచేశారు. అనంతరం అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో గుమస్తాగిరి రావడంతో 1950 ప్రాంతంలో అప్పటి మద్రాసు నగరానికి వచ్చేశారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాశారు. అక్కడ మొదట్లో 'యునైటెడ్‌ అమెచ్యూర్‌ ఆర్టిస్ట్స్‌' అనే డ్రామా కంపెనీలో చేరారు. తరువాత తనకు తానుగనే సొంతంగా ఒక డ్రామా కంపెనీ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో షావుకారు జానకి, నగేస్‌, శ్రీకాంత్‌ లాంటి నటులంతా ఉండేవారు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన 'దైవతాయ్‌' చిత్రానికి సంభాషణల రచయితగా ఆయన చలనచిత్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఈ సమయంలో ఆయన రాసిన 'సర్వర్‌ సుందరం' సినిమాను నగేశ్‌ హీరోగా ఒక దర్శకద్వయం రూపొందించింది. ఈ సినిమా విజయవంతమవడమే కాకుండా ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. అలా మరికొన్ని సినిమాలకు కూడా ఆయన రచనలు చేస్తుండేవారు. 1965లో నీర్‌కుమిలి సినిమా ద్వారా ఆయన తొలిసారిగా దర్శకత్వంలోకి అడుగుపెట్టారు. ఆయన సినిమా పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి సినిమాలన్నీ హీరోయిజం, పురుషాధిక్యతతో కనిపించాయి. ఈ పంథాను మార్చి సరికొత్త బాట పట్టించడానికి ఆయన నడుం బిగించారు. 1970లో ఆయన సినిమాలను నాయిక చుట్టు పరిగెత్తేలా చేశారు. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబ జీవితాలు, వారిమధ్య సంబంధాలు, ప్రేమాభిమానాలను, అప్పటి సామాజిక పరిస్థితులను కథా వస్తువుగా ఎంచుకని సినిమాలు తీశారు. మొదటి సినిమా తరువాత ఆయన రాసిన నాటకాల్లో ఒకటైన 'నీర్కుమిళి'ని చలనచిత్రంగా మలిచారు. ఆ సినిమాలో అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే సెట్‌లో ఉంటాయి. అలాంటి కథ అప్పటి ప్రేక్షకులకు కొత్త. అయినా అనుకున్నట్టే అది విజయం సాధించింది. దాంతో ఆయన చిత్ర దర్శకుడిగా మారారు. తరువాత 'మేజర్‌ చంద్రకాంత్‌', 'ఎదిర్‌ నీచ్చల్‌' వంటి చిత్రాలు చేశారు.

కథే ఆయన హీరో: పెద్దపెద్ద స్టార్లతో సినిమాలు తీయమని బాలచందర్‌కు ఎంతోమంది సలహాలు ఇచ్చారట. ఏరోజూ ఆయన వాటిని చెవిని వేసుకోలేదు. హీరోలను దృష్టిలో ఉంచుకుని ఆయన కథలు రాసుకుందీ లేదు. సర్వర్‌సుందరం కథే దానికి ఉదాహరణ. ఆ పాత్రకు నగేష్‌ చక్కగా సరిపోతాడని భావించారు. అప్పట్లో ఎంతో బిజీ హాస్యనటుడిగా ఉన్న నగేష్‌ ఇమేజ్‌ను ఈ సినిమా మరింత పెంచింది. ఈ సినిమా బాలచందర్‌కు ఓ పెద్ద మలుపు. ఈ సినిమా సంభాషణలకుగాను బాలచందర్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా తరువాత అవకాశాలు పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాలా వద్దా అని సందేహిస్తున్న బాలచందర్‌కు మెయ్యప్పన్‌ అనే నిర్మాత ధైర్యం చెప్పి బాలచందర్‌కు వరుసగా మూడు అవకాశాలిచ్చి ఉద్యోగానికి రాజీనామా చేయించారు. దాంతో ఆయన సినిమా పరిశ్రమలో స్థిరపడ్డారు.

అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్లు పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే జయప్రద నటించిన 'అంతులేని కథ'. సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన 'సింధుభైరవి', ప్రమీలతో తీసిన 'అరంగేట్రం'. సింధుభైరవిలో మగవాడి సహాయం లేకుండా బతకాలనుకొనే పాత్ర సుహాసినిది. అరంగేట్రంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్య వృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార, వ్యవహారాలకు పెద్దపీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదస్పదం అయ్యాయి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలా వరకు పెళ్లితో అంతమయ్యేవి. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి. చిరంజీవి, శోభన ప్రధాన పాత్రలో నటించిన 'రుద్రవీణ' గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయనే ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమలహాసన్‌, సరిత నటించిన 'మరో చరిత్ర' అప్పట్లో ఒక సెల్యులాయిడ్‌ సంచలనం. ఈ విషాదాంత ప్రేమకథ ఇప్పటికీ యువతరాన్ని అలరిస్తూనే ఉంది.--ఈనాడు న్యూస్ (24-12-2014)

కె. బాలచందర్ ద్వార సినిమాలు లోనికి వచ్చిన కొంతమంది నటీ నటులు :
  • కమల్ హాసన్-
  • రజినీకాంత్,
  • శ్రీవిద్య,
  • సరిత,
  • వివేక్,
  • ప్రకాష్ రాజ్,
  • య. జి. మహేంద్రన్,
  • సుజాత,
  • సారన్ (డైరెక్టర్),
  • రమేష్ అరవింద్,
  • మాధవి,
  • విమల రామన్,
  • జయసుధ,
  • జయప్రద,
ఫిల్మోగ్రఫీ
  • పాయి
  • రుద్రవీణ
  • పర్తలే పరవశం
  • కల్కి
  • అజ్హగాన్
  • దయూట్
  • వానమే ఎల్లి
  • పుదు పుదు అర్థంగల్
  • సింధు భైరవి
  • ఉన్నల్ ముదియుం తంబి
  • సిగరం
  • పున్నగై
  • ఆచమిల్లై ఆచమిల్లై
  • తన్నీర్ తన్నీర్
  • అరంగేట్రం
  • పున్నగై మన్నన్
  • నూత్రుక్కు నూరు
  • ఇరు కొడుగల్ (౧౯౬౦)
  • నవగిరహం
  • మేజ్హుగువర్తి
  • వరుమయిన్ నిరం సివప్పు
  • తిలలు ముళ్ళు
  • సోల్లతాన్ నినైకిరెన్
  • తమరి నేన్జం
  • తప్పు తలంగల్
  • పాయి కాల్ కుదిరి
  • పూవా తలయ
  • ఏక దుఉజే కె లిఏ
  • నినైథలే ఇన్నిక్కుం
  • నాన్ అవనిల్లై
  • మరో చరిత్ర
  • మన్మధ లీలై
  • ఎతిరోలి
  • ౪౭ నాటకాల్
  • ఒరు వీడు ఇరు వాసాలు
  • అవర్గల్ (౧౯౭౭)
  • అపూర్వ రాగంగల్
  • కావియ తలైవి
  • పాతాం పసిలి
  • మూన్రు ముదిచు
  • అవల్ ఒరు తోదర్గతై
  • నిజ్హళ్ నిజమకిరదు
  • నూలు వెలి
  • నానల్
  • కన్నా నలమ
  • అనుబవి రాజ అనుబవి
  • నీర్క్కుముజ్హి (౧౯౬౫)
  • ఎదిర్ నీచల్
  • బమ విజయం
  • సర్వర్ సుందరం (స్టొరీ అండ్ డైలాగ్)
  • ఏక నయి పహేలి
  • మనదిల్ ఉరుది వేండుం
  • అగ్ని సత్చి
  • కళ్యాణ అగదిగల్
TV సీరియల్స్
  • రయిల్ స్నేహం (దూరదర్శన్)
  • ప్రేమి (సన్ టీవీ)
  • కాసు అలవు నేసం (సన్ టీవీ)
  • కధల పగడై (సన్ టీవీ)
  • కై అలవు మనసు (సున్టీవీ/రాజ్ టీవీ)
  • సహన (జయ టీవీ)
  • అన్ని (జయ టీవీ)
  • ఎంగిర్రుందో వందాల్ (జయ టీవీ)
  • నిలవై పిడిప్పోం (రాజ్ టీవీ)
  • జన్నల్-1 (రాజ్ టీవీ)
  • జన్నల్-౨ (రాజ్ టీవీ)
  • కధల పగడై (సన్ టీవీ)
  • ఒథెర్ వొమెన్ ఒరిఎన్తెద్ సీరియల్స్ (సన్, రాజ్, జయ అండ్ అల్ టీవీ చానల్స్).
Award-winning films
  • The following films won the "Best Regional Film" title at the annual Indian National Film Awards:
  1. * Iru Kodugal
  2. * Apoorva Raagangal
  3. * Thanneer, Thanneer
  4. * Achamillai, Achamillai
దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌కు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందజేశారు. పురస్కారం కింద స్వర్ణకమలం, రూ.10 లక్షల నగదు అందించి ఘనంగా సత్కరించారు. 58వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం శుక్రవారమిక్కడ జరిగింది. 81 ఏళ్ల బాలచందర్‌ అవార్డు అందుకుంటున్న సమయంలో సినీ ప్రపంచం కరతాళధ్వనులతో ఆయనకు అభినందనలు తెలిపింది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో అద్భుత చిత్రాలు తీసిన ప్రతిభాశాలి బాలచందర్‌ అని రాష్ట్రపతి ప్రశంసించారు. ఎందరో నటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారని పేర్కొన్నారు. బాలచందర్‌ సుమారు వంద చిత్రాలకు దర్శకత్వం వహించారు. 60కిపైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీదేవి వంటి గొప్ప నటులను సినీ ప్రపంచానికి పరిచయం చేశారు.

  • ====================================
Visit my website --> Dr.Seshagirriao-MBBS

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)