బాబిలోనియా , Babylonia

బాబిలోనియా మన తెలుగు సినిమాల్లో ఐటంసాంగ్‌లకి తొలినుంచి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ ఐటంసాంగ్‌ల కోసం ప్రత్యేకమైన నటీమణులు సైతం తయారయ్యారు. సీరియస్‌గా సాగిపోయే సినిమాలో రసిక హృదయం ఉన్న ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడానికి ఈ ఐటంసాంగ్‌లు ఉపయోగపడేవి. అప్పట్లో నాగేశ్వరరావు, రామారావు లాంటి అగ్రహీరోల చిత్రాల్లో సైతం ఈ ఐటంసాంగ్‌లను పెట్టేవారంటే వీటికున్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ ఐటంసాంగ్‌ల ద్వారా ఆంధ్రావనిని ఓ ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి, జయమాలినిని ఈనాటి వరకు తలచుకుంటునే ఉన్నారు. అయితే రానురాను హీరోయిన్లే అంగాంగ ప్రదర్శనకు సిద్ధమైపోవడంతో ఐటంసాంగ్‌లను సైతం హీరోయిన్లతోనే చిత్రీకరించేయడం ప్రారంభమైంది. అలా ఐటంసాంగ్‌లలో హీరోయిన్లు తెగ ఎక్స్‌పోజింగ్ చేస్తూ నటించిన సందర్భాలు లేకపోలేదు. అయితే చరిత్ర పునరావృతమైనట్టు తెలుగు చిత్రాల్లో మళ్లీ ఇన్నాళ్లకి ఐటంసాంగ్‌లో కోసం ప్రత్యేకమైన నటీమణులు పుట్టుకొచ్చారు. 'పోకిరి' చిత్రంలో ఇప్పటికింకా నావయసు... పాటతో ముమైత్‌ఖాన్ ఎందరికి పిచ్చేక్కించిందో తెలిసిందే. దీంతో ప్రతి చిత్రంలో ఐటంసాంగ్ పెట్టడం మళ్లీ రివాజుగా మారింది. ఆ కోవలో తాజాగా విడుదలైన 'దొంగసచ్చినోళ్లు' చిత్రంలో బావలు సయ్యా... అనే పేరడీ పాటలో బాబిలోనియా విపరీతమైన ఎక్స్‌ఫోజింగ్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఈ భామ 'మహాయజ్ఞం' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కూడా బాబిలోనియా ఐటంసాంగ్‌లోనే నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో బాబిలోనియా ఫోజులివ్వడానికి సిద్ధమైంది. అయితే బాబిలోనియా టాలెంట్ తెలిసిన కొందరు ఫోటోగ్రాఫర్లు మరింత కసెక్కించే ఫోజులు కావాలని అడిగితే... అయితే బెడ్‌రూంకి రండి... మీరు అడిగిన ఫోజులిస్తాను అందట. (మూలము =వెబ్ దునియా )
  • ఈమె నటించిన తెలుగు సినిమాలు :
  • "దొంగ సచ్చినోళ్ళు
  • "మహాయజ్ఞం"
  • మొండిమొగుళ్లు, పెంకిపెళ్లాలు

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)