శ్రీదేవి(పాత) , Sridevi Bonikapoor

పరిచయం :
- శ్రీదేవి (Sridevi, శ్రీదేవి అయ్యప్పన్), ఆగష్టు 13 తీద్ి 1963వ సంవత్సరములూ శివకాశి (తమిళనాడు రాష్ర్టం)లోజన్మించింది. ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగానటించింది.
- పుట్టిన తేది : 13- ఆగష్టు -1963 ,
- పుట్టిన ఊరు : శివకాశి , తమిళనాడు ,
- తండ్రి పేరు : అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. ఆమె తండ్రి లమ్హె అను చిత్రం నిర్మాణంలో ఉండగా
- తల్లి పేరు : రాజేశ్వరి. తల్లి జుదాయి అను చిత్రం నిర్మాణంలో ఉండగా మరణించారు.
- శ్రీదేవి కి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. ,
- హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లిచితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి, తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది.
- భర్త : బోనీకపూర్ ను( హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్ ను జూన్ 2 ,1996న వివాహం చేసుకొన్నది. ) .
- పిల్లలు : ఝాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు కలరు.
- శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రం తో మొదలు పెట్టినది. ఆమెయూవ నటిగా తొలుత, ఎక్కువగా తమిళం మరియు, మళయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళంచిత్రములకు ఎక్కువగా ఐ.వి. శశి గారు దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రములలోచెప్పుకోదగినవి : ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం. 1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రుముదచ్చు" లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచిపరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రం రజనీకాంత్ సినీజీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తరువాత, శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో వీరితో (కమల్హాసన్, రజనీ కాంత్) కలిసి నటొంచారు. కమల్ హాసన్ గారితో, ఆమె గురు, శంకర్ లాల్, సిగప్పు రోజక్కల్. తాయుళ్లమాల్ నానిల్లై, మీండుం కోకిల, వాజ్వే మాయం, వరుమైయిన్ సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రం పిరై, 16 వయత్తినిలే మొదలగు చిత్రాలలో నటించారు. రజనీ కాంత్ గారితో, ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. 1975-85 సమయంలో ఆమె తమిళచిత్రసీమలో అగ్ర కధానాయిక.
- అదే సమయంలో, శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కధానాయకి గా కొనసాగింది. దాదాపు అందరు అగ్రకధానాయకులతో కలసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వంవహించారు. ఎన్. టి. రామా రావు గారితో, ఆమె కొడవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులిమొదలగు చిత్రాలలో నటించారు. ఎ. నాగేశ్వర రావు గారితో, ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ/కృష్ణ గారితో కలిసి ఆమె కంచు కాగడ, కలవారిసంసరం, కృష్ణావతారం, బురిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణగారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగం లో అడుగుపెట్టారు. ఆదిలో, ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు, వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవి, ముఖ్యంగాకె. రాఘవేంద్ర రావు గారు మరియు కె. బాపయ్య గారు దర్శకత్వం వహించినవి.
- 1978 లో, శ్రీదేవి మొదటి హింది చిత్రం "సోల్వా సావన్" అమోల్ పాలేకర్ తో కలిసి నటించారు, ఆ చిత్రం విజయవంతంకాలేదు. కాని, ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం "హిమ్మత్వాలా" మంచి విజయం సాధించింది. ఆచిత్రంతో ఆమెను ఉత్తర భారతదేశంలో "Thunder Thighs" అని పిలవసాగారు. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీచిత్రరంగంలో (star) అయిపొయారు. ఆమె తదుపరి చిత్రం "సద్మ" ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీచిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి. 1980 లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని, "నగీన", "మిస్టర్ ఇండియా", "చాందిని", "చాల్ బాజ్" మొదలగు చిత్రాలు. చాల్ బాజ్ చిత్రానికిహగానూ ఆమెకి మొదటి ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలుఅందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు "మిస్ హవ హవాయి" (Miss Hawa Hawai) అని పేరు వచ్చింది. ఆమె ఆచిత్రంలో చార్లీ చాప్లిన్ గా మరువలేని నటనా ప్రతిభ కనబరిచారు. "చాందిని" చిత్రం ఆమె సినీ జీవితంలో మరోమైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కధానాయిక. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికంఅందుకునేవారు.
- యాష్ చోప్రా ఆమెతో "చాందిని" చిత్రం తరువాత "లమ్హే" (1991) చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గానూ ఆమెరెండవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు, ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి (International Best Actress Award) పురస్కారాన్ని కూడా అందుకున్నారు. "ఖుదా గవా" మరియు "గుమ్రా" చిత్రాలలో ఆమె నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. "హాలీవుడ్" లో ప్రఖాతి గాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg), ఆమెతో సినిమా తీయదలచి, ఆమెను సంప్రదించారు. కాని సమయం లేని వలన ఆమె ఆ చిత్రాన్నితిరస్కరించవలసి వచ్చింది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం "రూప్ కీ రాణి చోరో కా రాజా" అపజయం అయ్యింది. విజయవంతమైన చిత్రం "జుదాయి" (1997) తరువాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. తరువాత ఆమె, "బోనీకపూర్" ని వివాహమాడారు. ఇప్పుడు ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. ఆమె కూతుళ్ళ పేర్లు "జాన్వి" మరియు "ఖుషి".
- ఆరేళ్ళ విరామం తరువాత ఆమె సహార చానల్ లో ప్రసారింప బడిన "మాలినీ అయ్యర్ (2004 - 05)" అను సీరీయల్లో నటించారు. అంతే కాకుండా, కరిష్మా కపూర్ నిర్వహించే "జీనా ఇసికే నామ్ (2004)" అనే కార్ర్యక్రమం లో కూడాఅతిధిగా కనిపించారు. "కాబూమ్ (2005) అనే నృత్య పోటీలకు ఒక రోజు న్యాయనిర్నేతగా వ్యవహరించారు.
- ఆమె త్వరలో "మిస్టర్ ఇండియా - 2" చిత్రం లో నటించవచ్చునని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఏసియన్ఎకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక సభ్యురాలి గా పని చేస్తున్నారు.
- ఫిబ్రవరి 24 2007 న, 52 వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రధానం రోజున, ఆమె నర్తించి మెప్పించిన 80 లలోని కొన్నిపాటలకు, మరల నర్తించి అభిమానులను, తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండిప్రశంసలు అందుకున్నారు.(courtesy:tewiki)
- ఒకప్పడు సినీ రంగాన్ని మహారాణిలా యేలిన శ్రీదేవి పెళ్ళి చేసుకుని పరిశ్రమ నుండి తప్పుకుంది. చాలా కాలంసినిమాలకు దూరంగా ఉన్నామె మళ్ళీ ఇన్నాళ్ళకి రీఎంట్రీ ఇవ్వటానికి ఆసక్తి చూపుతోంది. అదీ ఓ రీమేక్ చిత్రం ద్వారా. అది ప్రకాష్ రాజ్ తమిళంలో నటించి,నిర్మించిన ‘Mozhi"చిత్రం తోనట. ఈ మధ్యన ఆ చిత్రం చూసిన ఆమె రీమేక్ రైట్స్తీసుకోమని భర్త బోనీకపూర్ పై ఒత్తిడి తెస్తోందిట. కానీ అందులో హీరోయిన్ పాత్ర చాలా విశిష్టమైంది ఎవరు చేస్తారనిఅడిగాడుట.
- ఎందుకంటే కథ లో హీరోయిన్ మూగ,చెముడు అమ్మాయి. ఆమెతో సంగీతమే ప్రపంచంగా బ్రతికే హీరో ప్రేమలోపడతాడు. అలా సంగీతం వాళ్ళనెలా కలిపిందినేదే కథ. బాగా పేరుతెచ్చుకున్న ఆ పాత్రని జ్యోతిక పెళ్ళికాక ముందుచేసింది. దానికి శ్రీదేవి తానే చేస్తానని చెప్పిందిట. సర్లే భార్య కోరిక తీర్చటం భర్తగా తన భాద్యతగా భావించిన ఆ భర్తప్రకాష్ రాజ్ ని కలిసాడుట. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే సెట్స్ మీదకు ఈ రీమేక సినిమాను తీసుకెళ్ళాననితాపత్రయంట. (Ref:thatsTelugu)
నటించిన తెలుగు సినిమాలు:
- బంగారక్క (1977) (హిరోయిన్ గా తెలుగులో తొలి చిత్రం)
- పదహారేళ్ళ వయసు (1978)
- ఎర్ర గులాబీలు(1978) (సిగప్పు రోజక్కల్ - అను చిత్ర అనువాదం)
- బుర్రిపాలెం బుల్లోడు (1979)
- కార్తీక దీపం (1979)
- వేటగాడు (1979)
- కళ్యాణ రాముడు (1979)
- ముద్దుల కొడుకు (1979)
- ఆటగాడు (1980)
- చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
- దేవుడు ఇచ్చిన కొడుకు (1980)
- ఘరాణ దొంగ (1980)
- కక్ష (1980)
- మామ అల్లుళ్ళ సవాల్ (1980)
- ప్రేమ కానుక (1980)
- రౌడి రాముడు కొంటె కృష్ణుడు (1980)
- సర్దార్ పాపారాయుడు (1980)
- గజ దొంగ (1980)
- సిఐడి (1980)
- మోసగాడు (1980)
- పాటగాడు (1980)
- ఆకలి రాజ్యం (1981)
- బాల నాగమ్మ (1981)
- భోగభాగ్యాలు (1981)
- ఘరాణ గంగులు (1981)
- గడసరి అత్త-సొగసరి కోడలు (1981)
- కొండవీటి సింహం (1981)
- ప్రేమాభిషేకం (1981) (హైదరాబాద్ లో 500 రోజులకి పైగా ఆడింది)
- రాణికాసుల రంగమ్మ (1981)
- ఇల్లాలు (1981)
- సత్యం శివం(1981)
- గురుశిష్యులు (1981)
- ఆదివిష్ణులు (1982)
- అనురాగ దేవత (1982)
- బంగారు భూమి (1982)
- బంగారు కానుక(1982)
- బంగారు కొడుకు (1982)
- బొబ్బిలి పులి (1982)
- దేవత (1982)
- జస్టిస్ చౌదరి(1982)
- కలవారి సంసారం (1982)
- కృష్ణార్జునులు(1982)
- కృష్ణావతారమ్ (1982)
- షంషేర్ శంకర్ (1982)
- వయ్యారి భామలు వగలమారి భర్తలు(1982)
- అడవి సింహాలు (1983)
- కిరాయి కోటిగాడు (1983)
- ముందడుగు (1983)
- రామరాజ్యంలో భీమరాజు (1983)
- రాముడు కాదు కృష్ణుడు (1983)
- సింహం నవ్వింది (1983)
- శ్రీరంగ నీతులు (1983)
- ఊరంతా సంక్రాంతి (1983)
- కంచు కాగడ(1984)
- కోడెత్రాచు (1984)
- వజ్రాయుధం (1985)
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
- పచ్చని కాపురం (1985)
- త్రిశూలం (1985)
- జయం మనదే (1986)
- ఖైది రుద్రయ్య (1986)
- మకుటంలేని మహరాజు (1987)
- మాఊరి మగాడు (1987)
- ఆఖరి పోరాటం (1988)
- జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
- క్షణ క్షణం (1991)
- గోవిందా గోవిందా (1993)
- ఎస్.పి.పరశురాం (1996)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog