సంగీతా ఘోష్ , Sangeeta Ghosh

  • ------------------------------------------------------
పరిచయం (introduction) :
  • సంగీతా ఘోష్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మన తెలుగువాళ్లలో ఎక్కువమంది ఈ పేరు విని వుండకపోవచ్చు. కానీ టీవీలో హిందీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకి ఆ పేరు సుపరిచితం. పలు టీవీ సీరియళ్ల ద్వారా టీవీ తారగా పాపులర్ అయిన సంగీత డ్యాన్స్ ప్రోగ్రామ్ ’నాచ్ బలియే’ ద్వారా మరింత ఖ్యాతి సంపాదించుకుంది. ’దేశ్ మే నిక్లా హోగీ చాంద్’ సీరియల్ ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. అందమైన టీవీ తారగా అనతికాలంలోనే పాపులర్ అయ్యింది. ఇప్పుడామె తెలుగు సినిమాకి పరిచయమవుతోంది. స్వీయ నిర్మాణంలో దర్శకుడు విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న ’రెయిన్‌బో’ సినిమాలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఇందులో ఆమె ఒక సినీ తారగా కనిపిస్తుంది. ఇటీవల ఆమెపై బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ’బాటిల్స్ అండ్ చిమ్నీస్’ బార్‌లో ’సల సల సల కాగే ఒళ్లు.. మిల మిల మిల మెరిసే కళ్లు..’ అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఈ పాటలో కురుచ దుస్తుల్లో సంగీత వంటి ఒంపుసొంపులు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. సాహితి రాసిన ఈ పాటకు నిహాల్ సంగీతం సమకూర్చాడు. సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ సమకూర్చింది. ’పోకిరి’ సినిమాలో పాడిన ’గల గల పారుతున్న గోదారిలా’ పాటతో పాపులర్ అయిన గాయకుడు నిహాల్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మారుతున్నాడు. ’హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ (టైసన్) హీరోగా, ఎమ్రాన్ హష్మి సరసన ’జన్నత్’లో నటించిన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ప్రొఫైల్ (Profile) :
  • పేరు : సంగీతా ఘోష్ ,
  • పుట్టిన తేది - ఆగష్టు 18, 1976,
  • పుట్టిన ఊరు : కలకత్తా -- పశ్చిమ బెంగాల్ ,
నటించిన సినిమాలు :
  • -------తెలుగు-------- :
  • రెయిన్‌బో -- ఐటం సాంగ్ ,
  • పోకిరి -- ఐటం సాంగ్ ,
ఇతర సినిమాలు :
  • *Mehndi Tere Naam Ki - muskaan
  • * Des Mein Niklla Hoga Chand - Pammi
  • * Bhanvraa - cancelled
  • * Viraasat (STAR One) - Priyanka Kharbanda
  • * Nach Baliye - Herself (Performer/ Anchor)
  • * Rabba Ishq Na Hove - Veera
  • * Zara Nachke Dikha - Sangeeta (Girl's caption)
  • ==================================
డ్ర్.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)