ప్రభుదేవా , Prabhudeva


పరిచయం :
- దాన్సర్ గా , డాన్స్ మాస్టర్ గా , హిరో గా , దర్శకుడు గా బహుముఖ ప్రజ్ఞా శాలి- ప్రభుదేవా , ఇండియన్ మైకల్జాక్సన్ అంటారు . ఈయన డాన్సర్మాస్టర్ . సుందరం- కొడుకు. తమిళ , కన్నడ , తలుగు మలయాళం లో నటించారు ,
- పేరు : ప్రభు దేవా .
- అసలు పేరు : ప్రభు దేవా సుందరం .
- పుట్టిన తేది : 03- ఏప్రిల్ -1973-
- పుట్టిన ఊరు : మైసూర్ , కర్ణాటక ,
- నివాసము : చెన్నై ,
- తండ్రి : ముగురు సుందరం మాస్టర్ ,
- భార్య : లత (రామలత్ ),
- పిల్లలు :ముగ్గురు , పెద్ద కొడుకు 13 ఎల్ల వయసు లో కాన్సర్ తో చనిపోయాడు .
- మాతృభాష = కన్నడ .
- నువ్వొస్తానంటే (దర్శకుడు)
- పౌర్ణమి (దర్శకుడు)
- ప్రభుదేవా, లైలా, నేహాలు ప్రధాన పాత్రధారులుగా నటించిన తమిళ అనువాద చిత్రం 'సత్తి'.
- మళ్లీ పెళ్లి ఆలోచన లేదు
''తెలుగు పరిశ్రమ దర్శకుడిగా నాకు జీవితాన్నిచ్చింది. అందుకే టాలీవుడ్‌ని ఎప్పటికీ మర్చిపోను. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు సినిమాపై దృష్టి పెట్టలేకపోతున్నా. మంచి కథ వస్తే తెలుగులో నటిస్తాన''న్నారు ప్రభుదేవా. నృత్య దర్శకుడిగా సుపరిచితుడైన ప్రభుదేవా, ఆ తరవాత దర్శకుడిగానూ తన ముద్ర చూపించారు. బాలీవుడ్‌కి వంద కోట్ల చిత్రాల్ని అందించారు. హిందీలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న దర్శకుల జాబితాలో ప్రభుదేవా పేరు కూడా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'యాక్షన్ జాక్సన్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రభుదేవా చెన్నైలో పాత్రికేయులతో మాట్లాడారు. ''నా కెరీర్ మలుపులను చూస్తే తెలుగు పరిశ్రమ ప్రతిచోటా కనిపిస్తుంది. దర్శకుడిగా రూ.25కోట్లు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నన్ను మించిన హేమాహేమీలు పరిశ్రమలో ఉన్నారు. నాకంత పారితోషికం ఇస్తారని అనుకోవడం లేదు. ప్రస్తుతం నా పిల్లలతో చాలా హాయిగా ఉంటున్నాను. చెన్నైలో ఉంటే వారితోనే గడుపుతుంటాన''న్నారు. 'మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా' అని అడిగితే ''ప్రస్తుతం నా దృష్టంతా పిల్లలు, సినీ కెరీర్‌పైనే ఉంది. పెళ్లి విషయం ఇంత వరకు ఆలోచించలే''దన్నారు.
- న్యూస్‌టుడే, చెన్నై- 12-Sep-14
==========================
- Visit my website : dr.seshagirirao.com