అద్దంకి శ్రీరామమూర్తి , Addanki Sriramamurty

  • <

  •  
  • =========================================
  •  
పరిచయం :
  • ఆద్దంకి శ్రీరామమూర్తి పాత కాలపు ,సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు మరియు సంగీత విశారదులు. బాపట్ల ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత రాజమండ్రిలోని కృత్తివెంటి నాగేశ్వరరావు గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో పాపట్ల కాంతయ్య, పారుపల్లి రామకృష్ణయ్య ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారు. బి.టి.రాఘవాచార్యుల వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు. ప్రసిద్ధ నటులు హరి ప్రసాదరావు, బళ్ళారి రాఘవ ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన ధర్మారాజు మరియు దశరథుని పాత్రలకు పేరొందాడు. పాండవ ఉద్యోగ విజయం నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవాడు.
ప్రొఫైల్ :
  • పుట్టిన స్థలం : ఈయన గుంటూరు జిల్లా కలవకుర్తి .
  • పుట్టిన తేది - 21-సెప్టెంబర్ -1898 ,
  • చదువు : సంగీత విద్వాంశులు
కెరీర్ :
  • ఇతను తన పద్నాగు ఏట స్టేజి ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు వేసేవారట. 1934 లోహరిశ్చంద్ర' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. 20 సినిమాలకు పైగా నటించారు . సినిమాపరిశ్రమ అన్ని రంగాలలో నైపుణ్యం ఉండేది .
' ఫైల్మోగ్రఫి :
  • బ్రహ్మరధం (1947)
  • మాయా మచ్చీంద్ర (1945)
  • పాదుకా పట్టాభిషేకం (1945)
  • కృష్ణ ప్రేమ (1943)
  • సత్యభామ (1942)
  • భక్తిమాల (1941)
  • భోజ కాళిదాసు (1940)
  • మహానంద (1939)
  • సారంగధర (1937)
  • హరిశ్చంద్ర (1935)
మూలము : మహానుభావుల జీవిత చరిత్రలు .
  • ==========================
 Visit My website : dr.seshagirirao.com

  •  

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala