ఆర్తి అగర్వాల్ - AarthiAgarwal





































పరిచయం :
  • ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో పుట్టి పెరిగిన ఈమె 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది.
ప్రొఫైల్ :
  • పేరు : ఆర్తి అగర్వాల్ ,
  • పుట్టిన ఊరు : అమెరిక లోని నుజేర్సి లో
  • పుట్టిన తేది : 05 ,మార్చ్ 1985
  • సోదరి : అదితి అగర్వాల్ ఈమె చెల్లెలే.
కెరీర్ :
  • 14 (పద్నాలుగేల్లు) వరకు అమెరిక లో పెరిగారు. సునీల్ శెట్టి ద్వార ఈమె బోలీ వుడ్ కి పరేచయమయ్యారు. ఈమె మొదటిసినిమా "పాగాల్పన్" అనే హిందీ 2001 లో వచ్చింది. అదే సంవత్సరం మొదటి తెలుగు సినిమానువ్వు నాకు నచ్చావు" విక్తరి వెంకటేష్ తో చేసారు .
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • 2008 -గోరింటాకు
  • 2007 -లండన్ ద్రేఅమ్స్
  • అందాల రాముడు ,(2006)
  • ఛత్రపతి (2005),
  • సోగ్గాడు (2005),
  • సంక్రాంతి (2005),
  • అడవిరాముడు (2004),
  • నేనున్నాను (2004),
  • వీడె (2003),
  • పల్నాటి బ్రహ్మనాయుడు(2003),
  • వసంతం (2003),
  • బాబి-2002 ,
  • ఇంద్ర (2002),
  • నువ్వు నాకు నచ్చావు (2001).
  • 2001 నువ్వు లేక నేను లేను
పెళ్లి :
  • March 23, 2005 న సుయిసైడు ప్రయత్నం చేసారు - తరుణ్ తో తనకున్న రుమర్స్ వల్ల . 2007 నవంబర్ 22 న ఆర్తీ రాణీ గంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్జ్వల్ కుమార్ ను వివాహమాడింది. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది.

  • ఆరిపోయిన ఆర్తి --అమెరికాలో గుండెపోటుతో ఆర్తి అగర్వాల్‌ మృతి 
నువ్వునాకు నచ్చావ్‌తో తెలుగులో 'తెర'ంగేట్రం --16 ఏళ్లప్రాయంలోనే సినిమాల్లోకి
 'నువ్వు నాకు నచ్చావ్‌' అంటూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న నటి ఆర్తి అగర్వాల్‌.. జీవితం అర్ధాంతరంగా ముగి సింది. చిన్నవయస్సులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చి అన తికాలంలోనే అగ్రనటుల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని తారాపథంలో దూసుకెళ్లిన ఆర్తి(31) అమెరికాలోని న్యూజెర్సీలో ఆకస్మికంగా మరణించారు. పుట్టింది అమెరికాలోనైనా.. అచ్చం తెలుగుంటి ఆడపడుచులా ఆర్తి తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు 'నేనున్నాను'.. అంటూ ప్రేక్షకలోకాన్ని తన నటనతో ఆకట్టుకుంది. పెదవిపై చెదరని చిరునవ్వుతో ఇట్టే ఆకట్టుకునే ఆర్తి.. చిన్న వయస్సులోనే మృతి చెందడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటే.. ఆమె అభిమానులకు విషాదమే. అట్లాంటిక్‌ సిటీ ఎగ్‌ హార్బర్‌ టౌన్‌షిప్‌లోని తమ స్వగృహంలో ఆర్తికి శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12.30 సమయానికి (అమెరికా కాలమానం ప్రకారం) తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆమె మేనేజర్‌ తెలిపారు. ఆర్తి మృతికి తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
కౌశిక్‌ అగర్వాల్‌, వీమా అగర్వాల్‌ దంపతులకు మార్చి 5, 1985న న్యూజెర్సీలో ఆర్తి అగర్వాల్‌ జన్మించింది. పద్నాలుగేళ్ల వయసులో యూఎస్‌ఏలో జరిగిన ఓ వినోద కార్యక్రమంలో బాలీవుడ్‌ నటులు సునీల్‌ శెట్టి, గొవిందాతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసింది. ఆమె హుషారును గమనించిన సునీల్‌శెట్టి 'బాలీవుడ్‌ సినిమాలో అవకాశమిస్తా' అని పిలిచారు. ఆమె కుటుంబంతో పరిచయమున్న అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఆమెను బాలీవుడ్‌కు పంపమని ఆర్తి తండ్రి కౌశిక్‌ అగర్వాల్‌కు సూచించారు. మొదట్లో అంగీకరించకపోయినా ఆర్తి ఆసక్తిని గమనించి అంగీకరించారు. అలా ఆర్తి ముంబయి వచ్చి నటనా శిక్షణాలయంలో చేరింది. 2001లో తొలిసారిగా 'పాగల్‌ పన్‌' హిందీ చిత్రంలో నటించింది. అది సరైన ఫలితమివ్వకపోయినా డి.సురేష్‌బాబు, వెంకటేష్‌ దృష్టిలో పడి 'నువ్వునాకు నచ్చావ్‌'తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అది విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తన కెరీర్‌లో సుమారు 50కు పైగా సినిమాలు చేసింది ఆర్తి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు, రవితేజ, ప్రభాస్‌ తదితర ప్రముఖ నటులతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌, సునీల్‌లాంటి యువ కథానాయకుల సరసన కూడా నటించి ఆకట్టుకొంది. ఆమె చేసిన సినిమాల్లో ఇంద్ర, వసంతం, నేనున్నాను, సంక్రాంతి, గోరింటాకు, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, అందాలరాముడు, ఛత్రపతి, నరసింహుడు.. లాంటివి ఆమెకెంతో పేరు తెచ్చిపెట్టాయి.
వివాదాలతో ఇబ్బందులు
ఆర్తి జీవితాన్ని వివాదాలు కొన్నాళ్లు ఇబ్బందులు పెట్టాయి. మార్చి 23, 2005న ఆర్తి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ యువనటుడితో ఆమె సాగించిన ప్రేమాయణమే దీనికి కారణమని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2006లో మెట్లు ఎక్కుతుండగా జారిపడి గాయాలపాలైంది. ఇది కూడా ఆత్మహత్య ప్రయత్నమేనన్న వదంతులు వచ్చాయి. తర్వాత ఆర్తి సినీ జీవితం దెబ్బతింది. నవంబర్‌ 22, 2007న ఉజ్వల్‌ కుమార్‌ అనే ఎన్‌ఆర్‌ఐని వివాహమాడింది ఆర్తి. ఈ బంధమూ ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్త్లెన కొద్ది నెలల్లోనే వీరు విడిపోయారు. పెళ్లయ్యాక కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సత్ఫలితాలివ్వలేదు. ప్రస్తుతం ఆమె 'జంక్షన్‌లో జయమాలిని', 'ఆమె ఎవరు?' సినిమాలు అంగీకరించింది. ఆమె నటించిన 'రణం 2', 'ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఆడపులి..
ఆర్తికి తమ్ముడు ఆకాష్‌ అగర్వాల్‌, చెల్లి అదితి అగర్వాల్‌ ఉన్నారు. ఆకాష్‌ వ్యాపార రంగంలో ఉన్నాడు. చెల్లి అదితి 'గంగోత్రి'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత వివాహం చేసుకొని ఈ పరిశ్రమకు దూరమైంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తిరిగి సినిమాల్లోకి వచ్చాక ఓ ఇంటర్వ్యూలో, ''జీవితం రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం లాంటిది. నేనెప్పుడూ పరాజితురాలిని కాదు. నేను ఆడపులిని. యాక్సిడెంట్‌, ప్రేమలో విఫలం, పెళ్లిలాంటివి నా మీద పెద్దగా ప్రభావం చూపించవు'' అని ధైర్యంగా చెప్పింది ఆర్తి అగర్వాల్‌. అయినా విధికి తలవంచింది.

--ఈనాడు, హైదరాబాద్‌:

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala