బి.విఠలాచార్య , Vitalacharya
పరిచయం :
సినిమా నిర్మాణంలో పొదుపు చూపించే దర్శక నిర్మాత బి.విఠలాచార్య. అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెట్టేవారు కాదు. కొందరు దర్శకులు రాసుకున్నది రాసుకున్నట్టే తీసేవారు. కానీ, విఠలాచార్య విధానం వేరు. ఒక లాంగ్‌షాటులోనే, మిడ్‌షాటులోనూ నటిస్తున్న నటులు ఎవరైనా సంభాషణ చెప్పలేక ఆగిపోయినా, తప్పుగా పలికినా, తిరిగి పూర్తిగా తీసేవారు కాదు. ఎక్కడ పోయిందో అక్కడ నుంచే షాటుమార్చి తీసేవారు. ''ఎందుకు అనవసరంగా ఫిల్మ్ ఖర్చు? ఎలా తీసినా ఒకటే. సామాన్య ప్రేక్షకుడికి షాట్స్ అవసరం లేదుకదా!'' అనేవారు. సెట్స్‌కూడా (ఎక్కువగా జానపదాల్నే తీశారు) రెండుమూడింటితోనే చిత్రం పూర్తి చేసేవారు. రాజుగారి మందిరం వుంటే దాన్నే అటుఇటూ మార్చేవారు. తెరలు, ఆసనాలు మార్చేవారు. అదే విలను మందిరంగా మారిపోయేది. దాన్నే మళ్లీ మార్చి, పెద్ద మంచం అవీ వేసి పడకగది చేసేవారు. ఈ మార్పులు ఒకటిరెండు రోజుల్లో అయిపోయేవి. ఆరోజుల్లో కోడక్ వారి ఫిల్మే ఎక్కుగా వచ్చేది. రీటెక్స్ తగ్గిస్తూ ''ఎందుకు కోడక్ వారిని పోషించడం?'' అనేవారు. ఆయనకి అలవాటుగా ఒక తిట్టు వుండేది. ఎవరైనా చెప్పింది సరిగా వినకపోయినా, చెయ్యకపోయినా ''గుడాక్'' అని తిట్టేవారు. ఓసారి నేను అడిగాను ''అది కన్నడంలో తిట్టా?'' అని. కాదుట, ఆ రోజుల్లో కోడక్ కంపెనికీ లాభాలు రావాలని, ఫిల్మ్ ఎక్కువ ఖర్చుకావాలని, కొందరు ఏజెంట్లని పెట్టేది. వాళ్లు, ఛాయాగ్రహకుడికో సౌండ్‌రికార్డింగ్‌కో చేతులు తడిపేవారు. దాంతో వాళ్లు 'వన్‌మోర్', వన్‌మోర్' అంటూ, ఎక్కువ టేకులు చేయించేవారు. దానివల్ల ఫిల్మ్ ఖర్చు పెరిగి, కోడక్ వారికి అమ్మకాలు పెరిగేవి. ఎవరైనా నటిస్తున్నప్పుడు ఎక్కువ సార్లు తప్పుచేస్తే 'బాబూ! నువ్వు కోడక్ ఏజెంట్‌వా?' అని అడిగేవారు. తప్పు చేసిన వాళ్లని ''ఓరి కోడక్'' అనేవారు. అది అలా ''గుడాక్''గా మారిపోయింది' అని చెప్పారు విఠలాచార్య. నిర్మాణంలో పొదుపు పాటించినా, ఇతర విషయాల్లో మాత్రం కచ్చితంగా వుండేవారు. నటీనటులకి పారితోషికాలు తగ్గించి ఇచ్చినా, కచ్చితంగా ఇచ్చేసేవారు. అలాగే టెక్నిషియన్లకీ, అనుకున్న మొత్తాన్ని చిత్రనిర్మాణ కాలానికి తగ్గట్టుగా విభజించి ప్రతినెలా ఒకటో తేదీన కచ్చితంగా చెక్కు ఇంటికి పంపించేసేవారు. ఒకటో తారీఖు రాగానే, విఠలాచార్యగారి చెక్కు గుమ్మంలోకి వస్తుందని ఎదురు చూడనక్కరలేదు. ఏదో ఒకవేళకి మేనేజరు వచ్చి చెక్కు ఇచ్చి వెళ్లేవారు.
courtesy @ Pathabangaram by Ravi kondalarao
- బి.విఠలాచార్య 'జానపదబ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు. తెలుగు, తమిళ, కన్నడబాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా, పాలనాచూశారు.
- ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతికపరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైనజానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీక చిత్రాలేఅధికము.
- ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికిదర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలనుతీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవేఅందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.
- పేరు : వితలచర్య - బి .
- పుట్టిన ఊరు ; ఉడిపి ,కర్ణాటక ,
- నివాసము : చెన్నై ,
- జననము : 28 జనవరి 1920 .
- మొదట దర్సకత్వం చేసిన ఫిలిం : కన్యాదానం ( షావుకారి జనక హీరోయిన్),
- బిరుదు: జానపద బ్రహ్మ ,
- మరణము : 1999 మే 28 న- 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు.
- కుటుంబము : ఒక భార్య(jayalaxmi acharya), నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కలరు.
- స్వీయదర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం: రాజ్యలక్ష్మి (1954)
- కనకదుర్గ పూజా మహిమ
- ఆలీబాబా 40 దొంగలు-
- నిన్నే పెళ్ళాడుతా
- కన్యాదానం-
- భలే మొనగాడు
- అగ్గిబరాటా-
- లక్ష్మీ కటాక్షం-
- చిక్కడు దొరకడు-
- విజయం మనదే-
- బందిపోటు-
- జగన్మోహిని-
- రాజకోట రహస్యం.
సినిమా నిర్మాణంలో పొదుపు చూపించే దర్శక నిర్మాత బి.విఠలాచార్య. అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెట్టేవారు కాదు. కొందరు దర్శకులు రాసుకున్నది రాసుకున్నట్టే తీసేవారు. కానీ, విఠలాచార్య విధానం వేరు. ఒక లాంగ్‌షాటులోనే, మిడ్‌షాటులోనూ నటిస్తున్న నటులు ఎవరైనా సంభాషణ చెప్పలేక ఆగిపోయినా, తప్పుగా పలికినా, తిరిగి పూర్తిగా తీసేవారు కాదు. ఎక్కడ పోయిందో అక్కడ నుంచే షాటుమార్చి తీసేవారు. ''ఎందుకు అనవసరంగా ఫిల్మ్ ఖర్చు? ఎలా తీసినా ఒకటే. సామాన్య ప్రేక్షకుడికి షాట్స్ అవసరం లేదుకదా!'' అనేవారు. సెట్స్‌కూడా (ఎక్కువగా జానపదాల్నే తీశారు) రెండుమూడింటితోనే చిత్రం పూర్తి చేసేవారు. రాజుగారి మందిరం వుంటే దాన్నే అటుఇటూ మార్చేవారు. తెరలు, ఆసనాలు మార్చేవారు. అదే విలను మందిరంగా మారిపోయేది. దాన్నే మళ్లీ మార్చి, పెద్ద మంచం అవీ వేసి పడకగది చేసేవారు. ఈ మార్పులు ఒకటిరెండు రోజుల్లో అయిపోయేవి. ఆరోజుల్లో కోడక్ వారి ఫిల్మే ఎక్కుగా వచ్చేది. రీటెక్స్ తగ్గిస్తూ ''ఎందుకు కోడక్ వారిని పోషించడం?'' అనేవారు. ఆయనకి అలవాటుగా ఒక తిట్టు వుండేది. ఎవరైనా చెప్పింది సరిగా వినకపోయినా, చెయ్యకపోయినా ''గుడాక్'' అని తిట్టేవారు. ఓసారి నేను అడిగాను ''అది కన్నడంలో తిట్టా?'' అని. కాదుట, ఆ రోజుల్లో కోడక్ కంపెనికీ లాభాలు రావాలని, ఫిల్మ్ ఎక్కువ ఖర్చుకావాలని, కొందరు ఏజెంట్లని పెట్టేది. వాళ్లు, ఛాయాగ్రహకుడికో సౌండ్‌రికార్డింగ్‌కో చేతులు తడిపేవారు. దాంతో వాళ్లు 'వన్‌మోర్', వన్‌మోర్' అంటూ, ఎక్కువ టేకులు చేయించేవారు. దానివల్ల ఫిల్మ్ ఖర్చు పెరిగి, కోడక్ వారికి అమ్మకాలు పెరిగేవి. ఎవరైనా నటిస్తున్నప్పుడు ఎక్కువ సార్లు తప్పుచేస్తే 'బాబూ! నువ్వు కోడక్ ఏజెంట్‌వా?' అని అడిగేవారు. తప్పు చేసిన వాళ్లని ''ఓరి కోడక్'' అనేవారు. అది అలా ''గుడాక్''గా మారిపోయింది' అని చెప్పారు విఠలాచార్య. నిర్మాణంలో పొదుపు పాటించినా, ఇతర విషయాల్లో మాత్రం కచ్చితంగా వుండేవారు. నటీనటులకి పారితోషికాలు తగ్గించి ఇచ్చినా, కచ్చితంగా ఇచ్చేసేవారు. అలాగే టెక్నిషియన్లకీ, అనుకున్న మొత్తాన్ని చిత్రనిర్మాణ కాలానికి తగ్గట్టుగా విభజించి ప్రతినెలా ఒకటో తేదీన కచ్చితంగా చెక్కు ఇంటికి పంపించేసేవారు. ఒకటో తారీఖు రాగానే, విఠలాచార్యగారి చెక్కు గుమ్మంలోకి వస్తుందని ఎదురు చూడనక్కరలేదు. ఏదో ఒకవేళకి మేనేజరు వచ్చి చెక్కు ఇచ్చి వెళ్లేవారు.
courtesy @ Pathabangaram by Ravi kondalarao
- =======================

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog