కోవెలమూడి సూర్యప్రకాశరావు , Suryaprakasarao Kovelamudi

పరిచయం :
  • కోవెలమూడి సూర్యప్రకాశరావు -తెలుగు సినిమా దర్శక నిర్మాతలలోఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు కూడాప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్దవిజయం సాధించింది.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : -- 1914 సంవత్సరం
  • పుట్టిన ఊరు : కృష్ణా జిల్లాకు చెందిన కొలవేనులో జన్మించాడు.
  • మరణము :1996 సంవత్సరంలో మరణించాడు
  • చదువు : ప్రాధమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగలదుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితోప్రకాశరావు పనిచేసేవాడు.
సినీరంగ ప్రవేశం
  • ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లోనిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్రపోషించాడు. ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహిసినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు. స్వతంత్రపిక్చర్స్ పతాకముపై విడుదలైన సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. తరువాత 1949లో పతాకముపేరు ప్రకాశ్ ప్రొడక్షన్స్గా మార్చి మొదటిరాత్రి మరియు దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్గా నామకరణం చేశాడు.
‌‌‌
  • 1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. తరువాత కాలములో ప్రేమనగర్ వంటిసైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. ఈయన పుట్టన కణగళ్ తీసిన నగర హావు (1972) అనే కన్నడ ప్రేమకథా చిత్రాన్నితెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించాడు. 1970 దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు. ఈయన కొడుకుకె.రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగాపేరుతెచ్చుకున్నాడు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు. 1994 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన 1996 సంవత్సరంలో మరణించాడు.
నటించిన సినిమాలు
  • 1. అపవాదు (1941)
  • 2. పత్ని (1942)
  • 3. బభ్రువాహన (1942)
  • 4. ద్రోహి (1948) --> కథానాయకుడిగా
  • 5. ప్రేమనగర్ (1971) --> చిన్న పాత్రలో
నిర్మించిన సినిమాలు
  • 1. ద్రోహి (1948)
  • 2. మొదటిరాత్రి (1950)
  • 3. దీక్ష (1951)
  • 4. కన్నతల్లి (1953)
  • 5. బాలానందం (1954)
  • 6. అంతేకావాలి (1955)
  • 7. మేలుకొలుపు (1956)
  • 8. రేణుకాదేవిమాహాత్మ్యం (1960).
దర్శకత్వం వహించిన సినిమాలు
  • 1. మొదటిరాత్రి (1950)
  • 2. దీక్ష (1951)
  • 3. కన్నతల్లి (1953)
  • 4. బాలానందం (1954)
  • 5. అంతేకావాలి (1955)
  • 6. మేలుకొలుపు (1956)
  • 7. రేణుకాదేవిమాహాత్మ్యం (1960)
  • 8. స్త్రీజన్మ (1967)
  • 9. విచిత్రకుటుంబం (1969)
  • 10. తాసిల్దారు గారి అమ్మాయి (1971)
  • 11. ప్రేమనగర్ (1971)
  • 12. ఇదాలోకం (1973)
  • 13. కోడెనాగు (1974)
  • 14. చీకటి వెలుగులు (1975)
  • 15. కొత్తనీరు (1982)
*(మూలము : సితార వారపత్రిక .)*

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)