సిరివెన్నెల సీతారామశాస్త్రి , Sirivennela Sitarama Sastry
పరిచయం :
- ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...సీతారామశాస్త్రి.
- సిరివెన్నెలతో సినీరంగ ప్రవేశము చేసిన చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత.
- శిశిరంలో కోయిల సిరివెన్నెల--ఎనభైల దశకంలో తెలుగు సినిమా పాట అయోమయ స్థితిలో ఉండగా, శిశిరంలో కోయిలలా సీతారామశాస్ర్తి సినీరంగంలో ప్రవేశించారు. 20/5/1955న జన్మించిన చేంబోలు సీతారామశాస్ర్తి టెలిఫోన్స్‌లో పనిచేస్తూ ‘గంగావతరణం’ గేయం ద్వారా దర్శకుడు విశ్వనాథ్ దృష్టిలో పడి, ‘సిరివెన్నెల (1986)’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ 12 మంది ప్రతిభామూర్తుల్లో 10 నంది బహుమతులను కైవసం చేసుకొన్న సినీకవి.తాత్వికత, తార్కికత, భావుకతతో కూడిన అభివ్యక్తి- సిరివెన్నెల మూల సిద్ధాంతాలు. భారతీయతకు ఆత్మయిన మానవతను తన కవిత్వంలో ఆవిష్కరించాలని ఆయన తపన. వచన శైలిలో శుచిగా రాస్తున్న పాటలు సిరివెన్నెల ప్రత్యేకతను పట్టిస్తాయి. శ్రుతిలయలు, స్వర్ణకమలం, మనీ, శుభలగ్నం, చక్రం, గమ్యం మొదలైన చిత్రాల్లో 2,500 వరకు రాసిన గేయ సుమాల్లో సిరివెన్నెల భావుకత పరిమళిస్తుంది.
- పేరు : చెంబోలు సీతారామశాస్త్రి
- ఊరు : విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి
- పుట్టిన తేది : 20-05-1955 .
- నాన్న : శ్రీ డా.సి.వి.యోగి,
- అమ్మ :శ్రీమతి సుబ్బలక్ష్మి .
- శాస్త్రి గారి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశంవచ్చింది. ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.
- 'విధాత తలఁపున ప్రభవించినది...' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లోఆయనకు స్థానం సంపాదించి పెట్టంది.
- ధన మాయ ను ఎంత చిన్న చిన్న పదాలలొ పొదగగలరో దైవ మాయ ని కూడ అంతే సులువుగా విడమరచిచెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూతనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఎర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడాఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగు లో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్యప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఫ్రస్తుత కాలమాన పరిస్ఠితులలో ప్రముఖం గా సినిమా పాటలతోప్రజలను అలరిస్తున్న 'సిరివెన్నెల పాటల వల్ల మాత్రమే తెలుగు పాటల్లో లో తెలుగు ఇంకా బ్రతికి ఉంది అంటేఅతిశయోక్తి కాదు అంటే ఒప్పుకోని జనాభా తక్కువేమో.
- ఆరంగేట్రం 'సిరివెన్నెల' లోని ప్రతి పాట అణిముత్యమే.
- స్వయంకృషిలోని పాటలు
- రుద్రవీణలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ ; జాతీయ అవార్డు అందుకున్న 'లలిత ప్రియ కమలం విరిసినదీ
- స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశం లో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిదీ
- శృతిలయలు లో - తెలవారదేమో స్వామి
- శివ లో 'బోటని పాఠముందీ
- క్షణ క్షణం లో 'కో అంటె కోటి ; 'జాము రాతిరి జాబిలమ్మా
- గాయం లో 'అలుపన్నది ఉందా' ; 'నిగ్గ దీసి అడుగూ ; రాష్ట్ర నంది అవర్డు సాధించిన 'స్వరాజ్యమవలేని
- గులాబి లో 'ఏ రోజైతె చూశానో నిన్నూ ; 'క్లాసు రూము లో తపస్సు చేయుట వేస్టురా గురూ'
- మనీలో 'చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ ; 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ'
- శుభలగ్నం లోని 'చిలకా ఏ తోడు లేకా
- నిన్నే పెళ్ళడతా లోని 'కన్నుల్లో నీ రూపమే ; 'నిన్నే పెళ్ళాడెస్తానంటూ'
- సింధూరం లోని అన్ని పాటలు ; ముఖ్యంగా - 'సంకురాత్రి పండగొచ్చెరో' ; 'అర్థ శతాబ్దపూ
- దేవీపుత్రుడు లోని 'ఓ ప్రేమా'
- చంద్రలేఖ లోని 'ఒక్క సారి ఒక్క సారి నవ్వి చూదయ్యో
- నువ్వే కావాలి నుంచి 'ఎక్కడ ఉన్నా' ; 'కళ్ళలొకి కళ్ళు పెట్టీ
- నువ్వు నాకు నచ్చావు నుంచి 'ఆకశం దిగివచ్చీ ;
- శుభ సంకల్పం నుంచి 'హైలెస్సో 'సీతమ్మ అందాలూ
- ఇలా చెప్పుకొంటూ పోతే చాలా కనిపిస్తాయి.
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1986 - సిరివెన్నెల - విధాత తలఁపున...
- 1987 - శృతిలయలు - తెలవారదేమో ...
- 1988 - స్వర్ణకమలం - అందెల రవమిది...
- 1993 - గాయం - స్వరాజ్యమవలేని...
- 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక...
- 1995 - శ్రీకారం - మనసు కాస్త కలత...
- 1997 - సింధూరం - అర్ధ శతాబ్దపు...
- కళాసాగర్ అవార్డులు 4 పర్యాయములు ఉత్తమ గేయ రచయితగా...
- సౌతిండియా టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి 1988వ సంవత్సరపు ఉత్తమ గేయ రచయిత పురస్కారంరుద్రవీణ సినిమాకు.
- -మనస్విని సంస్థ ద్వారా ఆత్రేయ బంగారు కిరీటం.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog