హెచ్.ఎమ్.రెడ్డి , Reddy H M














-



  • -------------------------------------------------------



పరిచయం :
  • తొలి తెలుగు మాటల సినిమా ‘భక్త ప్రహ్లాద’ తీసినవారు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఆయన పూర్తిపేరు హనుమప్ప మునియప్ప రెడ్డి.... నటుడు , సినిమా దర్శకుడు మరియు నిర్మాత .
  • ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలాకుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండతో సినిమా రంగంలోప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.
  • 1930లో ఇంపీరియల్‌ కంపెనీకి ‘విజయకుమార్‌’, 1931లో ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు మూకీలనుహెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళంలో తీశారు రెడ్డి.
  • హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు.
ప్రొఫైల్ :
  • పేరు : హనుమప్ప మునియప్ప రెడ్డి (హెచ్.యం.రెడ్డి),
  • జననము : 12 జూన్ 1892 ,
  • నివాసము : బెంగుళూరు , ఇతని పూర్వీకులు తెలుగువారే ,
  • మరణము : 14 జనవరి 1960 ,
ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా :
  • 1. భక్త ప్రహ్లాద (1931) (ప్రొడ్యూసర్)
  • 2. గ్రిహలక్ష్మి (1938) (ప్రొడ్యూసర్)
  • 3. ప్రతిజ్ఞ (1953) (ప్రొడ్యూసర్)
దర్శకుడు గా :
  • 1. ప్రిన్స్ విజయకుమార్ (1930)
  • 2. భక్త ప్రహ్లాద (1931)
  • 3. కాళిదాస్ (1931)
  • 4. బార్ కె పోబార్ (1931), "A వాగేరు in లవ్"
  • 5. జజ్జ్ అఫ్ లైఫ్ (1932)
  • 6. సావిత్రి (1933)
  • 7. సీత స్వయంవర్ (1933)
  • 8. గ్రిహలక్ష్మి (1938)
  • 9. మాతృ భూమి (1939)
  • 10. చదువుకొన్న భార్య (1940)
  • 11. బొండం పెళ్లి (1940)
  • 12. బారిష్టరు పర్వతిషన్ (1940)
  • 13. తెనాలి రామకృష్ణ (1941)
  • 14. ఘరానా దొంగ (1942)
  • 15. సతి సీత (౧౯౪౬)
  • 16. నిర్దోషి (1951)
  • 17. నిరపరాధి (1951)
  • 18. ప్రతిజ్ఞ (1953)
  • 19. వద్దంటే డబ్బు (1954)

  • =========================

visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)