సాలూరు రాజేశ్వరరావు , Rajeswararao Saluru

  • ------------------------------------------------------------------------------------------
పరిచయం :
  • సాలూరు రాజేశ్వరరావు (Saluru Rajeswara Rao) తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటుమధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గసంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెరవెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలోఆయనకు ప్రత్యేక స్థానముంది.
బాల్యం
  • పుట్టిన ఊరు : సాలూరు మండలములోని శివరామపురం గ్రామము
  • పుట్టిన తేది : 1922 సంవత్సరంలో జన్మించాడు.
  • మరణించిన తేది : అక్టోబర్‌ 26, 1999, ఉదయం కన్నుమూసినరు .
  • తండ్రీ : సన్యాసిరాజు.
కెరీర్ :
  • రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దేసరిగమలుదిద్దాడు. సన్యాసిరాజుగారు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలోమృదంగంపై సహకరించిన వ్యక్తి. అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవాడు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! " తోటలోనొకటిఆరాధనాలయము", "తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని", "పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల", "కలగంటికలగంటి" లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.
కుటుంబ సభ్యులు
  • రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం. ఇతని అన్న సాలూరు హనుమంతరావు కూడా తెలుగు, కన్నడసినిమాలలో సంగీత దర్శకులుగా పని చేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ద పియానోమరియు ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్ద గిటారిస్టు. ఈయన మూడవ మరియునాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్ద సంగీత దర్శకులే. ముఖ్యంగా కోటేశ్వరరావు (కోటి) ప్రముఖ సంగీత దర్శకులు టీ.వీ.రాజు కోడుకైన సోమరాజుతో కలసి రాజ్-కోటి అన్న పేరుతో అనేక విజయవంతమైనఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తరువాత కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగాస్థిరపడ్డారు.
సంగీతం అందించిన సినిమాలు
  • 1. జయప్రదము (1939)
  • 2. ఇల్లాలు (1940)
  • 3. అపవాదు (1941)
  • 4. బాలనాగమ్మ (1942)
  • 5. చెంచులక్ష్మి (1943)
  • 6. భీష్మ 1944)
  • 7. పాదుకా పట్టాభిషేకం (1945)
  • 8. రత్నమాల (1947)
  • 9. వింధ్యరాణి (1948)
  • 10. ఆహుతి (1950)
  • 11. అపూర్వ హోదరులు (1950)
  • 12. మంగళ (1951)
  • 13. మల్లీశ్వరి (1951)
  • 14. నవ్వితే నవరత్నాలు (1951)
  • 15. ప్రియురాలు (1952)
  • 16. పెంపుడు కొడుకు 1953)
  • 17. రాజు-పేద (1954)
  • 18. విప్రనారాయణ (1954)
  • 19. మిస్సమ్మ (1955)
  • 20. భలేరాముడు (1956)
  • 21. చరణదాసి (1956)
  • 22. మాయాబజార్ (1957) (నాలుగు పాటలకు మాత్రమే)
  • 23. చెంచులక్ష్మి (1958)
  • 24. అప్పుచేసి పప్పుకూడు (1959)
  • 25. భక్త జయదేవ (1961)
  • 26. ద్దరు మిత్రులు (1961)
  • 27. భార్యాభర్తలు (1961)
  • 28. భీష్మ (1962)
  • 29. ఆరాధన (1962)
  • 30. చదువుకున్న అమ్మాయిలు (1963)
  • 31. పూజాఫలం (1964)
  • 32. బొబ్బిలి యుద్ధం (1964)
  • 33. మంచి మనిషి (1964)
  • 34. అమరశిల్పి జక్కన (1964)
  • 35. మైరావణ (1964)
  • 36. డాక్టర్ చక్రవర్తి (1964)
  • 37. దేశద్రోహులు (1964)
  • 38. దొరికితే దొంగలు (1965)
  • 39. పల్నాటి యుద్ధం (1966)
  • 40. సంగీత లక్ష్మి (1966)
  • 41. ఆత్మగౌరవం (1966)
  • 42. పూలరంగడు (1967)
  • 43. భక్త ప్రహ్లాద (1967)
  • 44. వసంతసేన (1967)
  • 45. బంగారు పంజరం (1968)
  • 46. ఆత్మీయులు (1969)
  • 47. ఆదర్శ కుటుంబం (1969)
  • 48. చిట్టిచెల్లెలు (1970)
  • . పవిత్ర బంధం (1971)
  • 50. అమాయకురాలు (1971)
  • 51. బాలభారతం (1972)
  • 52. సెక్రటరీ (1976)
  • 53. కురుక్షేత్రం (1977)
  • 54. రాధాకృష్ణ (1978)
  • 55. తాండ్ర పాపారాయుడు (1986)
  • నటించిన సినిమాలు
  • 1. శ్రీకృష్ణ లీలలు (1935)
  • 2. శశిరేఖా పరిణయం(1936)
  • 3. మాయాబజార్ (1936)
  • 4. జయప్రద (1939)
  • 5. ఇల్లాలు (1940)
బిరుదులు
  • * సాలూరు రాజేశ్వరరావుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 1979లో డాక్టరేటుతో పాటు కళాప్రపూర్ణ బహూకరించింది.
  • * తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్గా నియమించుకుంది. ఇదే కాలంలోనే ఈయన స్వరపరచిన అన్నమయ్యకీర్తనలను ఘంటసాల పాడాడు.
  • * తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదును ఇచ్చి సత్కరించింది.
విశేషాలు
  • * రాజేశ్వరరావు అన్న హనుమంతరావు కూడా సంగీత దర్శకునిగా రాధిక (1948), రాజీ నా ప్రాణం (1954), ఉషాపరిణయం (1960) మొదలైన చిత్రాలకు, నల్లనివాడా నే గొల్లకన్నెనోయ్‌, వినవే చెలి పిలుపు (బాలసరస్వతిపాడినవి) లాంటి లలితగీతాలకు చక్కని సంగీతాన్ని అందించాడు.
  • * సాహిత్యాన్ని మింగి వేయని సరస సంగీతాన్ని అందించడం వీరి ప్రత్యేకత.
  • * స్వరాలూరు రాజేశ్వరరావు అని ఈయనను గురించి అభిమానులు చమత్కారంగా వ్రాశారు.
  • * విష్ణులీల (1938) అనే తమిళ సినిమాకు సహాయ సంగీత దర్శకునిగా పని చెయ్యటమే కాక బలరాముని పాత్ర ధరించికొన్ని పాటలు కూడా పాడాడు.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala