సి.పుల్లయ్య , Pullayya.C
పరిచయం :
- చిత్తజల్లు పుల్లయ్య మొదటి తరానికి చెంచిన తెలుగు సినిమా దర్శకుడు. 1936 లో కలకత్తా లో ఈస్ట్ ఇండియా వారికి పెద్దనటీ నట వర్గం తో "ధృవ "నూ , చిన్నపిల్లల తో "అనసూయ" నూ నిర్మించి రెండింటిని బేడకి (రెండణాలు )కె చూపించడం జరిగింది . చిన్న పిల్ల లతో పౌరాణికం తీయడం ఒక సాహసం ,తీసి ఔననిపించు కోవడం మరో సాహసం , అని ఆనాటి మేధావులంతా మెచ్చుకున్న రోజులవి . అంటే కాదు ఇలా రెండు లఘు చిత్రాల్ని కలిపి ఒకే ప్రదర్శనలో చూపడం అదే మొదటిసారి . నాటి ప్రసిద్ధ నటి -గాయని సి.క్రిష్ణవేణి ని ... పుల్లయ్య ఈ చిత్రం తో నే వెండి తెరకు పరిచయం చేశారు .
- పేరు : సి.పుల్లయ్య ,
- పుట్టిన తేది : x-x-1898 .
- జన్మస్థలం : కాకినాడ ,
- భార్య : రంగమ్మ,
- పిల్లలు : వీరి కుమారుడు దర్శకుడు ,, సి.యస్.రావ్.
- మరణము : 06-అక్టోబర్ -1967-మద్రాస్ లో మరణించారు ,
- ఈయన ఎంతో మందిని తెరకు పరిచయం చేసారు, అందులో ముఖ్యమైనవారు - కాంచనమాల, లక్ష్మిరాజ్యంరేలంగి, అంజిలీదేవి, పుస్పాంజలి , భానుమతి , క్రిష్ణవేణి , కస్తూరి శివరావ్ , మున్నగువారు. ,
- * భువన సుందరి కథ (1967)
- * భామావిజయం (1967)
- * పరమానందయ్య శిష్యుల కథ (1966)
- * లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..
- * దేవాంతకుడు (1960)
- * పక్కింటి అమ్మాయి (1953)
- * సంక్రాంతి (1952)
- * అపూర్వ సహోదరులు (1950)
- * వింధ్యరాణి (1948)
- * గొల్లభామ (1947)
- * నారద నారది (1946)
- * బాలనాగమ్మ (1942)
- * మాలతీ మాధవం (1940)
- * వరవిక్రయం (1939)
- * మోహినీ భస్మాసుర (1938)
- * సత్యనారాయణ వ్రతం (1938)
- * చల్ మోహనరంగ (1937)
- * దశావతారములు (1937)
- * కాసుల పేరు (1937)
- * అనసూయ (1936)
- * ధ్రువ (1936)
- * శ్రీకృష్ణ తులాభారం (1935)
- * లవకుశ (1934 సినిమా) (1963)
- * రామదాసు (1933)
- * సావిత్రి (1933)
- ============================
Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog