బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి , B.N.Reddy

  • --------------------------------------------------
పరిచయం :
  • బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (Bommireddy Narasimha Reddy / B.N.Reddy)(నవంబర్ 16, 1908 - నవంబర్ 8, 1977) అనే పేరు వినగానే మదిలో మల్లెల మాలలూగుతాయి. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు మల్లీశ్వరితో సహా మన కళ్ళ ముందు కదలాడతాయి. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
బాల్యం ప్రొఫైల్ :
  • పేరు : బి.ఎన్.రెడ్డి
  • పుట్టిన తేది : నవంబర్ 16, 1908.
  • పుట్టిన ఊరు : కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు.
  • తండ్రీ : బి.ఎన్. తండ్రి గారైన నరసింహారెడ్డి రంగూన్(ఇప్పటి యాంగాన్)కు మద్రాసు(చెన్నై) నుంచి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవాడు.
  • మరణము : 25 -02-2004 ,
సినీరంగ ప్రవేశం :
  • బి.ఎన్.రెడ్డి తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద(1931) దర్శకుడైన హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ లతో కలిసి 1938 లో రోహిణి పిక్చర్స్ స్థాపించి 'రంగూన్ రౌడీ' అనే స్టేజి నాటకం ఆధారంగా గృహలక్ష్మి చిత్రాన్ని ప్రారంభించాడు. మద్యపానం, వేశ్యావ్యామోహం వల్ల కలిగే నష్టాలు, పాతివ్రత్య సంప్రదాయంలోని గొప్పదనం గురించి తీసిన ఈ చిత్రానికి హెచ్.ఎమ్.రెడ్డి దర్శకనిర్మాత కాగా, బి.ఎన్.రెడ్డి సహాయ దర్శకుడు, సహ నిర్మాత. దురదృష్ట వశాత్తూ చిత్ర రంగంలో తన తొలి అడుగైన 'గృహలక్ష్మి' లోనే దర్శకుడు ఒక "రసవత్తరమైన" దృశ్యం తీయబూనడంతో బి.ఎన్. ఆయనతో తెగతెంపులు చేసుకుని బయటికొచ్చేశాడు.(హీరో అయిన డాక్టరును వలలో వేసుకునే ఉద్దేశ్యంతో ఒక జాణ 'అబ్బా, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి' అంటూ తన ఒంట్లోని వివిద భాగాలను ఆ డాక్టరు చేత తడిమించుకునే ఆ దృశ్యం కాంచనమాల, నాగయ్యల మధ్య చిత్రించబడింది.)
పని చేసిన కొన్ని సినిమాలు :
  • సినిమా --- --- విడుదల తేదీ --- పాత్ర
  • గృహలక్ష్మి - ---1938 -------- దర్శకత్వం
  • వందేమాతరం - 1939 ------- దర్శకత్వం/నిర్మాత
  • సుమంగళి -- 1940 -------- దర్శకత్వం/నిర్మాత
  • దేవత ------ 1941 -------- దర్శకత్వం/నిర్మాత
  • స్వర్గసీమ --- 1945 -------- దర్శకత్వం/నిర్మాత
  • భక్త పోతన - - 1942 --------- నిర్మాత
  • యోగి వేమన - 1947 --------- నిర్మాత
  • మల్లీశ్వరి ---- 1951 -------- దర్శకత్వం
  • బంగారు పాప - 1954 ------- దర్శకత్వం
  • భాగ్యరేఖ ----- 1957 ------- దర్శకత్వం
  • రాజ మకుటం - 1960 ------ దర్శకత్వం
  • పూజా ఫలం -- - 1964 ------- దర్శకత్వం
  • బంగారు పంజరం - 1965 ------ దర్శకత్వం
  • రంగుల రాట్నం - 1966 ------ దర్శకత్వం
  • ======================================
visit my web site -> dr.seshagirirao-com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)