----------------------------------------------------------------------------------------
పరిచయం :
- ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు పింగళి నాగేంద్ర గారు .
- పింగళినాగేంద్రరావు(1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమారఛయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయనఉపసంపాదకుడు గా పని ఛేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నాకుటుంబం,గమ్మత్తు ఛావు తదితర నాటకాలు ఆయన రాసినవే.
- నాటక రచయితగా లబ్ద ప్రతిష్టులైన పింగళి నాగేంద్రరావు 40ల దశకంలోనే సినీరంగంలో ప్రవేశించినా, విజయావారి ‘పాతాళ భైరవి (1951)’తోనే సినీరచయితగా స్థిరపడ్డారు. పదమాంత్రికుడని పేరుపడిన పింగళి ‘బాళి’, ‘వైళమ’, ‘లాహిరి’, ‘హలా’ వంటి పదప్రయోగాలతో అభిమానులను అలరించారు.
సున్నితంగా చక్కిలి గింతలు పెట్టే హాస్యగీతాలు ఆయనతోనే ఆరంభమయ్యాయి. జన వ్యవహారానికి దగ్గరగా ఉండే క్రియాపదాలతో మాట్లాడుకునే రీతిలో పాటలు రాసే ధోరణికి మార్గదర్శిగా నిలిచారు. వినడానికే కాక, తిరిగి పాడుకోవడానికి వీలుగా సరళ శైలిలో రాసిన కవి.
మిస్సమ్మ, మాయాబజార్, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు వంటి గొప్ప చిత్రాల్లో కేవలం 300 పాటలు రాసి 3 వేల పాటలు రాసినంత ఖ్యాతిని పొందిన ప్రతిభాశాలి.
ప్రొఫైల్:
- పేరు : నాగేంద్రరావు పింగళి ,
- స్వస్థలం : శ్రీకాకుళం జిల్లా రాజాం.
- పుట్టిన తేది : 29-12-1901 ,
- మరణము: 06-May- 1971 ,
నాగేంద్రరావు గారి వయస్సు రెండేళ్లప్పుడు ఆయన తండ్రి గారు మచిలీపట్నం వలస వచ్ఛారు. ఛల్లపల్లి జమీందారు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని ఛేసేవారు. ఆయన ఇద్దరు మొగపిల్లల్లో నాగేంద్రరావు గారు రెండవ వారు.
- * 1. సి.ఐ.డి (1965) (writer) *
- 2. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (adaptation) *
- 3. మహామంత్రి తిమ్మరుసు (1962) (writer) *
- 4. గుండమ్మ కథ (1962) (screen adaptation) *
- 5. జగదేకవీరుని కథ (1961) (writer) *
- 6. మహాకవి కాళిదాసు (1960/I) (dialogue) (screenplay) *
- 7. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (dialogue) (story) *
- 8. మాయా బజార్ (1957/I) (dialogue) (story) (screen adaptation)
- 9. మిస్సమ్మ (1955) (writer) *
- 10. చంద్రహారం (1954) (writer) *
- 11. పాతాళ భైరవి (1951) (dialogue) (story) *
- 12. గుణసుందరి కథ (1949) (dialogue) *
- 13. వింధ్యారాణి (1948) (dialogue) (story) *
- 14. శ్రీకృష్ణ లీలలు (1935) (dialogue)
collected / Dr.Seshagirirao-MBBS (Srikakulam )
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog