-
-
- ===============================================================
-
Introduction :
- ముళ్ళపూడివెంకటరమణ తెలుగు సినిమా కద రచియిత. ~1931 లో జన్మించారు. సినిమా డైలాగు రచియిత కూడా. బాపు, ముళ్ళపూడి వెంకటరమణ ల బంధం గురించి ఇవాళ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బొమ్మా బొరుసులుగా పెనవేసుకున్న బంధం వారిది. ఈ కాంబినేషన్‌లో చార్మీ ప్రధాన పాత్రధారిణిగా రూపొందినdi ‘సుందర కాండ’ చిత్రం . 1945 లో బాపు గారి తో స్నేహం కలిసింది.
Profile :
- పేరు : ముళ్ళపూడి వెంకటరమణ ,
- అసలు పేరు :ముళ్ళపూడి వెంకటరావు ,
- పుట్టిన తేది : born 1931-జూన్-28.
- మరణము : 23-feb-2011
- తోబుట్టువులు : ఒక అక్క , ఒక తమ్ముడు ,
- పుట్టి స్థలం: ధవళేశ్వరము --తూర్పు గోదావరి జిల్లా .
- తండ్రి : సింహాచలం -గోదావరి ఆనకట్ట కార్యాలయము ళో పని ,రమణ 9 వ ఏట చనిపోయారు .సింహాచలం పూర్వీకులు బరంపురానికి చెందినవారు .
- తల్లి : ఆదిలక్ష్మి ,
- పిల్లలు :ఒక కుమార్తె , ఒక కుమారుడు--ముల్లపూడి వరప్రసాద్ (దర్శకుడు )
- చదువు : SSLC in Madras ,
- నివాసము : అభిరామపురము --చెన్నై ,
కెరీర్ :
పాఠశాలలో చదివేటప్పుడే రమణ.. రచనలపై దృష్టి సారించారు. పద్యాలను ఆలపించేవారు. నాటకాల్లో వేషాలు కట్టేవారు. 1945లో ఆయన రాసిన తొలి కథ 'అమ్మమాట వినకపోతే' బాలపత్రికలో ప్రచురితమైంది. ఈ పత్రికలోనే బాలశతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. దీంతో ఆయన సొంతంగా 'ఉదయభాను' అనే లిఖిత పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా మారారు. ఈ పత్రికలో చిత్రకారుడిగా బాపు, విషయ రచయితగా మండలీక శాస్త్రి వ్యవహరించారు. ఆర్థిక ఇబ్బందులతో ఎసెస్సెల్సీతోనే చదువుకు స్వస్తి చెప్పిన రమణ చిన్నాచితక ఉద్యోగాలు చేశారు. అనంతరం ఆంధ్రపత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. ఈ పత్రికలోనే 'బుడుగు' పాత్ర సృష్టించారు. బుడుగు పాత్రతో ఆయన సృష్టించిన సందడిని ఏ తెలుగువాడూ మరచిపోలేడు. రమణ రచనలన్నీ బాపూ బొమ్మల కొలువుతో రూపొందాయి. కథా రమణీయం, బాల రమణీయం, కదంబ రమణీయం, సినీ రమణీయం వంటి రచనలు ఆయన కలం నుంచి జాలు వారాయి. ప్రస్తుతం 'కోతికొమ్మచ్చి' పేరుతో తన జీవిత చరిత్రకు సంబంధించిన కథనే స్వాతి వార పత్రికలో రాస్తున్నారు.అచ్చ తెలుగు నుడికారానికి రూపమిస్తే అదే రమణ. సినిమాల్లో నవ్వించాలంటే అశ్లీలాన్నో, ద్వందార్థాలనో నమ్ముకోవలసిందే... అనుకొనేవారికి రమణ రచనలే సమాధానం.
కొన్నిసినిమాలు ;As Writer
- రాధ గోపాలం ,
- దాగుడు మూతలు ,
- శ్రీరమ రాజ్యము ,
అవార్డులు :
- రాజ-లక్ష్మి సాహిత్య అవార్డ్ ఇన్ ~1995.
రచించిన కొన్ని పుస్తకాలు :
- బుడుగు -- పిల్లల పుస్తకం ,
- కోతి కొమ్మచ్చి - ఆత్మకథ ,
- అమ్మ మాట వినకపోతే ?,
Filmography
- This is partial list of his films. Kindly help expanding it.
- Year Film Language Credits
- 1962 రక్త సంబంధం Telugu Writer
- 1963 మూగ మనసులు Telugu Writer
- 1964 దాగుడుమూతలు Telugu Writer
- 1965 ప్రేమించి చూడు Telugu Story
- 1966 కన్నె మనసులు Telugu Story and Dialogues
- 1966 నవరాత్రి తెలుగు Writer
- 1967 పూల రంగడు Telugu Story
- 1967 ప్రాణ మిత్రులు Telugu Story and Dialogues
- 1967 సాక్షి Telugu Writer
- 1968 బంగారు పిచిక Telugu Writer
- 1969 బుద్ధిమంతుడు Telugu Story and Screenplay
- 1970 బాలరాజు కథ Telugu Dialogues
- 1971 సంపూర్ణ రామాయణం Telugu Writer
- 1973 అందాల రాముడు Telugu Writer
- 1975 ముత్యాల ముగ్గు Telugu Story
- 1976 భక్త కన్నప్ప Telugu Writer
- 1976 జీవన్ జ్యోతి Hindi Story
- 1976 సీత కళ్యాణం Telugu Writer
- 1978 గోరంత దీపం Telugu Story and Screenplay
- 1978 మనవూరి పాండవులు Telugu Screenplay and Dialogues
- 1980 హమ్ పాంచ్ Hindi Screenplay
- 1980 కలియుగ రావణసురుడు Telugu Writer
- 1980 రాజదిరాజు Telugu Story and Screenplay
- 1980 వంసవ్రిక్షం Telugu Screenplay and Dialogues
- 1981 రాధా కళ్యాణం Telugu Writer
- 1981 త్యాగయ్య Telugu Writer
- 1982 పెళ్లీడు పిల్లలు Telugu Story and Dialogues
- 1983 మంత్రిగారి వియ్యంకుడు Telugu Writer
- 1985 బుల్లెట్ తెలుగు Story and Screenplay
- 1985 జాకీ Telugu Writer
- 1986 కళ్యాణ తాంబూలం Telugu Writer
- 1991 పెళ్లి పుస్తకం Telugu Dialogues and Screenplay
- 1993 Mr. పెళ్ళాం Telugu Writer
- 1993 శ్రీనాథ కవిసార్వభౌమ Telugu Writer
- 1994 పెళ్లి కొడుకు Telugu Writer
- 1996 రాంబంటు Telugu Writer
- 2005 రాధా గోపాలం Telugu Story and Dialogues
- 2008 సుందరకాండ Telugu Story, Screenplay and Dialogues
- 2011 శ్రీ రామరాజ్యం Telugu Story and Dialogues
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog