లక్ష్మీరాజ్యం , Lakshmirajyam

Introduction:
- సి.లక్ష్మీరాజ్యం- తెలుగు సినిమా, రంగస్థల నటి మరియు నిర్మాత. లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన శ్రీకృష్ణ లీలలు సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్‌గా నటించింది
profile :
- Name : సి.లక్ష్మీరాజ్యం,
- Birth place : విజయవాడ,
- Date of Birth :x* x* 1922.,
- Husband : కె.శ్రీధరరావు-తెనాలికి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి(marriage year=1941)శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని తమ స్వగృహములో మరణించాడు.,
Career :
- చిన్నతనంలో నరసింహం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. యుక్తవయసులో హరికథలు చెప్పాలనే మక్కువతో సాలూరు రాజేశ్వరరావు గారి వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. మేనమామ వెంకటరామయ్య గారితో పటు సూరిబాబు నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు. తరువాత పులిపాటి వెంకటేశ్వర్లు, పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె తులాభారంలో నళిని, చింతామణిలో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవారు. వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి నందమూరి తారక రామారావుతో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన నర్తనశాల. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు
లక్ష్మీరాజ్యం నిర్మించిన చిత్రాలలో కొన్ని :
- హరిశ్చంద్ర,
- శ్రీకృష్ణ లీలలు,
- శకుంతల,
- దాసి,
- రంగేళి రాజా
- మగాడు . .
చిత్ర సమాహారం
నటిగా
* నర్తనశాల (1963)
* శ్రీకృష్ణ లీలలు (1959)
* హరిశ్చంద్ర
* రాజు-పేద (1954)
* దాసి (1952)
* ఆకాశరాజు (1951)
* అగ్నిపరీక్ష (1951) - సుశీల
* పరమానందయ్య శిష్యుల కథ - లీలావతి
* సంసారం (1950) - మంజుల
* ద్రోహి (1948) - సీత
* నారద నారది (1946)
* త్యాగయ్య (1946)
* ఇది మా కధ (1946)
* పంతులమ్మ (1943)
* ఇల్లాలు (1940)
* అమ్మ (1939)
* శ్రీకృష్ణ లీలలు (1935)
* కృష్ణ తులాభారం (1935)
- =================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog