ఘంటసాల వెంకటేశ్వరరావు , Ghantasala Venkateswararao

  • ----------------------------------------------------------------------------------------
పరిచయం : -
  • ఘంటసాల వెంకటేశ్వరరావు - ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. . ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.
ప్రొఫైల్ :
  • పేరు : ఘంటసాల వెంకటేశ్వరరావు,
  • పుట్టిన తేది : 4-డిసెంబర్ -1922.
  • మరణము : 1974 ఫిబ్రవరి 11 ఆస్పత్రిలో కన్నుమూసారు.
  • పుట్టిన ఊరు : చౌటపల్లి , near గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
  • తండ్రీ పేరు : ఘంటసాల సూర్యయా - గాయకుడు , వెంకటేశ్వరరావు బాల్యము లోనే తండ్రీ చనిపోయారు .
  • మేనమామ : రాయాలి పిచ్చి రామయ్య - ఈయన వద్దనే పెరిగి పెద్దయ్యారు . సాలూరు చిన్న గురువు గారు అని అంటారు.
  • పాట పాడినమొదటి సినిమా : సీత రామ జననం ,
  • పెళ్లి : 1944 మార్చి 4 ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు.
  • పిల్లలు : 5 గురు . ఇద్దరు కొడుకులు -విజయ కుమార్ , రత్న కుమార్ , 3 గగురు కూతుర్లు -శ్యామల , సుగుణ , శాంతి .
కెరీర్ :
  • పెళ్లి రోజు సాయంత్రం తానే తనపెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులువచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యంగ్రహించిన సముద్రాలవారు ఘంటసాలను మద్రాసుకు వచ్చికలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందుపాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
  • సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంనుపానగల్ పార్కు వాచ్మన్కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికిరాత్రి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపుబృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్య గాయకుడిఅవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
‌‌
  • తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
విజయ విహారం
  • 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారు మ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లుకొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలయిన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంతప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. చిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమేతనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు. 1955లో విడుదలయిన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరుతెచ్చింది. 1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలంఅందుకున్నాయి. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటనుతెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతితెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే! నోట విన్నా ఆయన పాడిన పాటలే.
చివరిదశ
  • 1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురి అయ్యేవాడు.1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసారు.1972లో రవీంద్రభారతిలోప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూఉన్నారు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు.
  • అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదుఅనుకున్నారు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలయిన హిట్ చిత్రాలకుపాటలు పాడారు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
పేరు పొందినవి :
  • నేపథ్య గాయకునిగా మరియు సంగీత దర్శకునిగా కొన్ని సినిమాలు :
  • షావుకారు
  • పాతాళభైరవి
  • మాయాబజార్
  • గుండమ్మ కథ
  • లవకుశ
  • రహస్యం
  • గుడిగంటలు
నేపథ్య గాయకునిగా కొన్ని ఆణిముత్యాలు .
  • దేవదాసు
  • కన్యాశుల్కం
  • దొంగరాముడు
  • తోడికోడళ్ళు
  • డాక్టర్ చక్రవర్తి
  • మిత్రులు
  • అప్పు చేసి పప్పు కూడు
  • జగదేకవీరుని కధ
  • మూగ మనసులు
  • మంచి మనసులు
  • భక్త జయదేవ
  • మహాకవి కాళిదాసు
  • భక్త తుకారాం
  • పాండురంగ మహత్యంఆరాధన
  • ఆత్మబలం
  • ప్రేమనగర్
  • బంగారు బాబు
ప్రైవేటు ఆల్బములు :
  • కుంతీవిలాపం
  • పుష్ప విలాపం
  • దేశభక్తి గీతాలు
  • భగవద్గీత
  • భక్తి గీతాలు
--డా.వందన శేషగిరిరావు -శ్రీకాకుళం.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)