దేవులపల్లి కృష్ణశాస్త్రి , Devulapalli KrushnaSastry

  • ------------------------------------------------------------------------------------------------
పరిచయం:
  • ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దేవులపల్లి కృష్ణశాస్త్రి.
  • దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishna Sastri) -ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
  • భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి... బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’ తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.
జీవిత విశేషాలు
  • పేరు : దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ,
  • ఉరు : రామచంద్రపాలెం , పిఠాపురం దగ్గర , తూర్పు గోదావరి జిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు.
  • పుట్టిన తేది : 01- నవంబర్ -1897 ,
  • చదువు : డిగ్రీ ఆంగ్లము(విజయానగరం లో) చేసారు .
  • ఉద్యోగం : పెద్దాపురం మిషన్ హైస్కూల్ లో ఉపాధ్యాయునిగా పనిచేసారు ,
  • మరణించిన సం : 24 ఫిబ్రవరి 1980 ,
కుటుంబము :
  • కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.
  • భార్య : రాజహంష ,
  • పిల్లలు : కొడుకు - సుబ్బరయ సాస్త్రి , కూతురు -బుల్లిసీత (చనిపోయారు),
పురస్కారాలు
  • 1975 - ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ
  • సాహిత్య అకాడమీ అవార్డు
  • 1976 - పద్మభూషణ్
రచనలు :
  • కృష్ణ పక్షము ,
  • ఊర్వశి కావ్యము ,
  • అమృత వీణ -గేయమాలిక ,
  • అముల్యాభిప్రయలు -వ్యాసావళి ,
  • బహుకాల దర్సనం - నాటికలు , కదలు ,
  • ధనుర్దాసు - నాలుగు భక్తీ నాటికలు ,
  • కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
  • మంగళకాహళి - దేశభక్తి గీతాలు
  • శర్మిష్ఠ - 6 శ్రవ్య (రేడియో) నాటికలు
  • శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993
  • మేఘమాల - సినిమా పాటల సంకలనం - 1996
  • శ్రీ విద్యావతి - శృంగార నాటికలు
  • యక్షగానాలు - అతిథిశాల - సంగీత రూపకాలు
  • మహతి
పాటలు వ్రాసిన కొన్ని సినిమాలు :
  • మల్లీశ్వరి ,
  • సీతామహాలక్ష్మి ,
  • మేఘసందేశం ,
  • గోరింటాకు ,
  • కార్తీక దీపం,
--డా.వందన శేషగిరిరావు .

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)