సి.హెచ్.నారాయణరావు , ChNarayanarao
- -------------------------------------
- వృత్తి -నటుడు చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం , సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్.నారాయణరావు.
- జననం :సి.హెచ్.నారాయణరావు -1937
- మరణం : -ఫిబ్రవరి 14, 1984
- వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు. 1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’ లో మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు. నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు, పొడుగైన ముక్కు, నవ్వితే నవరత్నాలు రాలినట్టు కనిపించే పెదవులు, పలువరసతోఅందర్నీ ఆకర్షించాడు. ఆ హీరో నారాయణరావు. నాగయ్య, సి.ఎస్.ఆర్., జి.వి.రావు., ఉమామహేశ్వరరావులు ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు ఆ రోజుల్లో పర్సనాల్టీలో వీరికి భిన్నంగా కనిపిస్తూ నారాయణరావు రాగానే, ‘ హీరో అంటే ఇలా అందంగా ఉండాలన్న మాట... హీరోయిన్ లాగానే’ అనుకున్నారు ప్రేక్షకులు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న నారాయణరావూని చూసి , ద్రోణంరాజు చినకామేశ్వరరావు (‘జీవనజ్యోతి’ దర్శకుడు) చిత్రాల్లో ప్రవేశ పెట్టారు. కృష్ణవేణి ఆ చిత్రంలో కథనాయిక. నారాయణరావు నటన చాలా సహజంగా ఉంటుందని, అవలీలగ నటించేస్తాడనీ పత్రికలు రాసేవి. అయితే ఆయన కేవలం హీరో పాత్రలే ధరించలేదు. హీరోగా ఎష్టాబ్లిష్ అయిన తర్వాత విలన్ పాత్రలు కూడా ధరించారు. తర్వాత కారెక్టర్ యాక్టర్.
- ‘చెంచులక్ష్మి’,
- ‘తాసిల్దార్ ’,
- ‘మొదటిరాత్రి ’,
- ‘ మనదేశం’ ,
- ‘ తిరుగుబాటు’, మొదలైన చిత్రాల్లో హీరో అయితే,
- ‘ జీవితం’ లో విలన్.
- ‘దేవత’, ‘స్వర్గసీమ’ చిత్రాల్లో విలన్ కాదుగాని, అదో తరహా పాత్రలు.
- ‘ గంగ గౌరీ సంవాదం’ లో శివుడు, సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు... అన్నింటిలో కూడా నారాయణరావు నటించారు.
- * కలెక్టర్ జానకి (1972)
- * రహస్యం (1967)
- * వీలునామా (1965)
- * గంగ గౌరీ సంవాదం (1958)
- * మేనరికం (1954)
- * మంజరి (1953)
- * మానవతి (1952)
- * ఆడజన్మ (1951)
- * తిరుగుబాటు (1950)
- * మనదేశం (1949)
- * లక్ష్మమ్మ (1950)
- * జీవితం (1949)
- * ముగ్గురు మరాఠీలు (1946)
- * స్వర్గసీమ (1945)
- * తాహసీల్దార్ (1944)
- * చెంచులక్ష్మి 1943
- * చూడామణి (1941)
- * దేవత (1941)
- * జీవన జ్యోతి (1940)
About Narayanarao @APR
మొదట రంగస్థలం నటులుగా అనుభవం గడించి తర్వాత సినిమాల్లో ప్రవేశించినవారే ఎక్కువ. తమంతట తమకు ఏర్పడిన కోరికతోనో, ఇతరుల ప్రోద్బలం, ప్రోత్సాహంతోనో చలనచిత్ర సీమలో అడుగుపెట్టి తమ టాలెంట్‌ను రుజువు చేసుకుని కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది తెలుగుచిత్ర పరిశ్రమలో ప్రారంభంనుంచి వస్తున్న రివాజు.
ఓ రోజు రైలు ప్రయాణం చేస్తోన్న చిత్ర దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు రైల్వే ఉద్యోగిని చూసి ఆయన అందానికి, మాటతీరుకి ముచ్చటపడ్డాడు. కొద్దిపాటి పరిచయంతోనే ఆయన ప్రవర్తనా విధానం చూసి ముగ్ధుడయ్యాడు. అతను, తనకు నటనలో ఎంతమాత్రం అనుభవం లేదని చెప్పినా వినకుండా ఏకంగా హీరో వేషానికి ఎంపికచేశారు. ఎంపిక చేసిన తర్వాత ఆ హీరో ఆంగ్లభాషా పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు చదలవాడ నారాయణరావు.
అసలుపేరు చదలవాడ నారాయణరావు కాగా, సి.హెచ్.నారాయణరావుగా సుప్రసిద్ధులు. ద్రోణం రాజు చిన కామేశ్వరరావు దర్శకత్వంలో నారాయణరావు సరసన కృష్ణవేణి కథానాయికగా నటించిన 'జీవనజ్యోతి' చిత్రం 1940లో విడుదలై విజయం సాధించడమే కాకుండా హీరోకు మంచి పేరు గడించి పెట్టింది.
తరువాత 'దేవత' చిత్రంలో చిన్న పాత్రను పోషించారు. చక్కని పర్సనాల్టితో ఉండే నారాయణరావుకి 'రొమాంటిక్ హీరో'గా పేరు వచ్చింది.
నటుడనేవాడు హీరో పాత్రలతోనే సరిపెట్టుకోకూడదనే ఆలోచన ఆయనలో ఉండేది. కారణం ఆయనకు ఎక్కువగా ఆంగ్లచిత్రాలు చూసే అలవాటు ఉండేది. అలాగే పుస్తకాలు కూడా విపరీతంగా చదివే ఆసక్తి ఆయనది. ఆనాటి చిత్రాల్లో నటన కొంచెం అతిగా ఉండాలని దర్శకులు పట్టు బట్టేవారు. ఎక్కవమంది నటీనటులు, దర్శకులు, రచయితలు కూడా రంగస్థలం నుంచి వచ్చిన కారణంగా ఓవర్ యాక్షన్ ఉంటేనేగాని ప్రేక్షకులను ఆకర్షించలేమేమో అనే ఆలోచనతో ఉండేవారు. అది చదలవాడ నారాయణరావుకు ఇష్టం ఉండేది కాదు.
ఇటు ఓవర్ యాక్షన్, అటు అండర్ ప్లే లేకుండా స్టడీగా నటించేవారు నారాయణరావు. కానీ దర్శకుల ఆలోచనా విధానం, ఆ సీన్లో నటీనటులు నటన, డైలాగ్ డెలివరీకీ తన నటన బాలెన్స్ చేయాలనే ఉద్దేశ్యంతో తన ధోరణిలో మార్పు చేసుకునేవారు.
హీరోగా చేస్తూనే మంచి పాత్రలు వచ్చినప్పుడు విలన్ పాత్రలు, కేరక్టర్ రోల్స్ లాంటివి చేయడానికి అంగీకరించేవారు. సినిమాల్లో పాపులర్ అయ్యాక రంగస్థల నటనను మించిన సంతృప్తి లేదని భావించి రంగస్థల నాయకుడిగా 'మిస్ ప్రేమ బి.ఎ' తదితర నాటకాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడటం అనేది నారాయణతోనే ప్రారంభమైంది. తెలుగు చిత్రసీమలో ఆయనమీద అభిమానంతో పలు అభిమాన సంఘాలు ఆ రోజుల్లోనే నెలకొల్పారు. 'చెంచులక్ష్మి', 'తాసిల్దార్', 'తిరుగుబాటు', 'మనదేశం', 'శ్రీలక్ష్మమ్మ కథ', 'ముగ్గురు మరాఠీలు' తదితర చిత్రాల్లో హీరోగా నటించారాయన. 'జీవితం' చిత్రంలో విలన్‌గా, 'దేవత', 'స్వర్గసీమ' తదితర చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా నటించారు. హీరోగా రాణిస్తున్న దశలోనే విభిన్న తరహా పాత్రల పోషణకి శ్రీకారం చుట్టి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు సి.హెచ్.నారాయణరావు.
-- వి. ఎస్. కేశవరావ్@ఆంధ్రప్రభ ఆదివారము 29 Apr 2013
- ===========================
Visit my website : dr.seshagirirao.com


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog